S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

01/14/2016 - 07:21

వాషింగ్టన్, జనవరి 13: హెచ్-1బి, ఎల్-1 వీసాల ఫీజులను పెంచడంపై తీవ్రస్థాయిలో ఐటి కంపెనీల నుంచి వ్యతిరేకత వస్తున్నప్పటికీ ఈ నిర్ణయాన్ని అమెరికా అమల్లోకి తెచ్చింది. భారీగా పెంచిన ఈ ఫీజుల వల్ల భారత్‌కు చెందిన ఐటి కంపెనీలపై తీవ్రస్థాయిలో ఆర్థిక భారం పడుతుంది. హెచ్-1బి, ఎల్-1 వీసాలపై అదనంగా 4000 డాలర్ల ఫీజు వసూలు చేయాలని అమెరికా నిర్ణయించింది.

01/14/2016 - 06:23

రెండు ఆఫీసుల మూసివేత
పఠాన్‌కోట్ దాడిపై
ప్రత్యక్ష చర్యలకు దిగిన పాక్
చర్యలను సమీక్షించిన
ఉన్నత స్థాయి భేటీ

01/12/2016 - 05:57

ఇస్లామాబాద్, జనవరి 11: భారత్‌లోని పఠాన్‌కోట్ వైమానిక స్థావరంపై ఉగ్రవాద దాడి నేపథ్యంలో పాకిస్తాన్ అధికారులు వివిధ ప్రాంతాల్లో దాడులు నిర్వహించి, దాడితో సంబంధం ఉందనే అనుమానంతో కొంతమందిని అరెస్టు చేసినట్లు నిఘా అధికారులు సోమవారం చెప్పారు. గుజ్న్‌వ్రాలా, జెలుం, బహవల్‌పూర్ జిల్లాల్లో నిర్వహించిన ఈ దాడుల్లో కొంతమందిని అరెస్టు చేశారు. అయితే ఎంతమందిని అరెస్టు చేశారనేది తెలియరాలేదు.

01/11/2016 - 07:25

వాషింగ్టన్, జనవరి 10: మన సౌర వ్యవస్థ ఆవల వందల వేల సంఖ్యలో ఉన్న గ్రహాలను, నక్షత్రాలను గుర్తించి ఎప్పటికప్పుడు వాటి వివరాలను వెల్లడిస్తున్న కెప్లర్ వ్యోమనౌక ఇప్పటివరకు భూమిని పోలిన వంద కొత్త గ్రహాలను గుర్తించింది. అనేక నక్షత్రాల చుట్టూ వందకుపైగా ఈ గ్రహాలు పరిభ్రమిస్తున్నాయని కెప్లర్ అందించిన వివరాల ఆధారంగా అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా వెల్లడించింది.

01/11/2016 - 07:20

లండన్, జనవరి 10: వ్యోమగాములు, రోబోటిక్ వ్యవస్థల మధ్య సహకారంతో చంద్రుడిపై గ్రామాలను నిర్మించాలన్న స్వప్నం 2030 సంవత్సరంలోగా సాకారం కావచ్చని శాస్తవ్రేత్తలు చెబుతున్నారు.

01/11/2016 - 07:19

వాషింగ్టన్/సియోల్, జనవరి 10: ఉత్తర కొరియా తన హైడ్రోజన్ బాంబును విజయవంతంగా పరీక్షించినట్లు ప్రకటించిన కొద్ది రోజుల తర్వాత అమెరికా ఆదివారం అణ్వస్త్రాలను ప్రయోగించే సామర్థ్యం కలిగిన తన బి-52 బాంబర్ యుద్ధ విమానాన్ని, ఎఫ్-16 యుద్ధ విమానాలు దక్షిణ కొరియాకు చెందిన ఎఫ్-15 యుద్ధ విమానాలతో పాటుగా ఆదివారం ఉత్తర కొరియాకు దగ్గరగా గగనతల విహారం జరిపి తన సైనిక పాటవాన్ని చాటింది.

01/11/2016 - 07:18

వాషింగ్టన్/ఇస్లామాబాద్, జనవరి 10: పఠాన్‌కోట్ దాడి వెనుక వాస్తవాలేమిటో తెలుసుకుని దాడికి పాల్పడిన వారిని శిక్షించాలని అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ ఆదివారం పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్‌ను కోరారు. కెర్రీ ఈ రోజు ఫోన్‌లో నవాజ్ షరీఫ్‌తో మాట్లాడారు.

01/10/2016 - 05:36

న్యూయార్క్, జనవరి 9: విశ్వమంతా ఆవహించిన శూన్య పదార్థం ఆనుపానులు తెలుసుకునే దిశగా శాస్తవ్రేత్తలు ఓ బలమైన ముందడుగు వేశారు. పూర్తిగా అంతుబట్టని ఈ శూన్య పదార్థం ఆవహించి వున్న స్వల్ప నక్షత్ర మండలాలను గుర్తించేందుకు అంతర్జాతీయ శాస్తవ్రేత్తల బృందం ఓ కొత్త టెక్నిక్‌ను కనిపెట్టింది.

01/10/2016 - 05:35

సియోల్, జనవరి 9: ఇటీవల తాము జరిపిన హైడ్రోజన్ బాంబు పరీక్షను ఉత్తర కొరియా గట్టిగా సమర్థించుకుంది. ఇరాక్ అధినేత సద్దాం హుస్సేన్, లిబియా నేత గడాఫీలకు ఎదురైన పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఆత్మరక్షణ కోసం తామీ పరీక్షలు జరిపామని స్పష్టం చేసింది.

01/10/2016 - 02:11

లండన్, జనవరి 9: అసలారోజు ఏం జరిగింది? నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరణించినట్టుగా చెబుతున్న ఆ రోజు ఏం జరిగిందన్న దానిపై వాస్తవాలను కళ్లకుకడుతూ బ్రిటీష్ వెబ్‌సైట్‌లో తాజా వివరాలు వెల్లడయ్యాయి. నేతాజీ మరణంపై ఏర్పాటైన దర్యాప్తు కమిషన్‌కు నలుగురు ప్రత్యక్ష సాక్షులు అందించిన కథనాలు మాత్రం ‘విమాన ప్రమాదం జరిగింది. నేతాజీ తీవ్రంగా గాయపడ్డారు. ఆయన మంటల్లోనే కొద్దిసేపు నిలబడ్డారు.

Pages