S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

01/10/2016 - 02:08

ఇస్లామాబాద్, జనవరి 9: భారత్‌తో విదేశాంగ కార్యదర్శుల స్థాయి చర్చలు జరిపేందుకు పాకిస్తాన్ నానాతంటాలు పడుతోంది. ఇరు దేశాల మధ్య 15న విదేశాంగ కార్యదర్శుల స్థాయి చర్చలు జరగాల్సి ఉందని నవాజ్ షరీఫ్ ప్రభుత్వం పేర్కొంది.

01/08/2016 - 07:39

ట్రిపోలి, జనవరి 7: పశ్చిమ లిబియా నగరం జ్లిటెన్‌లోని ఒక పోలీసు ట్రడైనింగ్ సెంటర్‌పై జరిగిన ట్రక్కు బాంబు దాడిలో 60 మంది మృతి చెందగా, రెట్టింపు సంఖ్యలో గాయపడినట్లు గురువారం స్థానిక మీడియా కథనాలు పేర్కొన్నాయి. అయితే కనీసం 60 మంది చనిపోయారని, 127 మంది గాయపడ్డారని జిల్టేన్‌పై ఆధిపత్యం కలిగిన ట్రిపోలిలోని అధికారులకు అనుకూలంగా ఉండే ప్రత్యర్థి వార్తాసంస్థ తెలిపింది.

01/07/2016 - 07:16

లండన్, జనవరి 6: ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, ఆజాద్ హింద్ ఫౌజ్ వ్యవస్థాపకుడు సుభాష్ చంద్రబోస్ అదృశ్యంపై మహాత్మా గాంధీ గందరగోళం సృష్టించారని బ్రిటన్‌లోని లండన్ కేంద్రంగా పనిచేస్తున్న ఒక వెబ్‌సైట్ పేర్కొంది. చివరి రోజుల్లో నేతాజీకి సంబంధించిన సమాచారాన్ని వెలుగులోకి తేవడానికి ప్రారంభించిన తీతీతీ.ఇ్యఒళచిజళఒ.జశచ్యి అనే వెబ్‌సైట్ వివిధ సందర్భాల్లో గాంధీజీ చేసిన ప్రకటనలను ప్రజల ముందుకు తెచ్చింది.

01/07/2016 - 06:24

న్యూయార్క్, జనవరి 6:. అమెరికాలో పెరిగిపోతున్న తుపాకీ సంస్కృతిని అదుపు చేసి తీరాలన్న కృతనిశ్చయంతో ఉన్న ఒబామా బలమైన గన్‌లాబీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ (పార్లమెంటు) మద్దతును కూడగట్టడానికి న్యూటౌన్‌లో ఓ పాఠశాల చిన్నారుల మూకుమ్మడి హత్యాకాండను, ఓక్‌క్రీక్‌లో ప్రార్థనలు చేస్తున్న సిక్కులపై జరిగిన కాల్పుల ఘటనలను గుర్తు చేసుకొంటూ కన్నీళ్ల పర్యంతం అయ్యారు.

01/07/2016 - 07:35

సియోల్, జనవరి 6: ప్రపంచ దేశాలను ముఖ్యంగా బద్ధ శత్రువైన దక్షిణ కొరియాను విస్మయానికి గురి చేస్తూ ఉత్తర కొరియా హైడ్రోజన్ బాంబును విజయవంతంగా పరీక్షించినట్లు బుధవారం ప్రకటించింది. జపాన్‌లోని హిరోషిమాపై అమెరికా ప్రయోగించిన బాంబు అంత శక్తి కలిగినదిగా నిపుణులు అంచనా వేస్తున్న ఈ బాంబు ప్రయోగంతో తమ దేశం అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన అగ్రరాజ్యాల సరసన నిలిచినట్లయిందని ఉత్తర కొరియా చెప్పుకొంది.

01/05/2016 - 06:53

కాబూల్, జనవరి 4: అఫ్గాన్‌స్తాన్ పట్టణమైన మజార్-ఎ-షరీఫ్‌లోని భారత్ కాన్సిలేట్‌పై ఉగ్రవాదులు దాడి జరిపిన నేపథ్యంలో సోమవారం కూడా పలు పేలుళ్లు, కాల్పుల శబ్దాలతో ఆ ప్రాంతం దద్దరిల్లిపోయింది. ఇందులో నక్కిన ఉగ్రవాదులను ఏరివేసేందుకు అఫ్గాన్ భద్రతా దళాలు ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించాయి.

01/04/2016 - 07:58

ఇస్లామాబాద్, జనవరి 3: భారత్, పాకిస్తాన్ నాయకుల మధ్య ఇటీవల జరిగిన సమావేశాల సుహృద్భావం ఏర్పడినప్పటికీ పఠాన్‌కోట్‌లో భారత వైమానిక స్థావరంపై ఉగ్రవాదులు జరిపిన దాడి ఇరు దేశాల మధ్య చర్చల పునరుద్ధరణకు జరుగుతున్న ప్రయత్నాలకు ముప్పు కలిగించవచ్చని పాక్ ప్రచార మాధ్యమాలు ఆదివారం పేర్కొన్నాయి.

01/04/2016 - 07:57

వాషింగ్టన్, జనవరి 3: పఠాన్‌కోట్‌లో భారత వైమానిక స్థావరంపై పాకిస్తాన్ ఉగ్రవాదులు దాడి జరపడాన్ని అమెరికా తీవ్రంగా ఖండించింది. ఉగ్రవాదులను మట్టుబెట్టి వారి నెట్‌వర్క్‌లను ధ్వంసం చేసేందుకు కలసికట్టుగా కృషి చేయాలని భారత్‌తో పాటు చుట్టుపక్కల గల అన్ని దేశాలకు అమెరికా ఆదివారం విజ్ఞప్తి చేసింది. ‘పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌లో భారత వైమానిక స్థావరంపై ఉగ్రవాదులు దాడి జరపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.

01/04/2016 - 06:47

కాబూల్, జనవరి 3: అఫ్గానిస్తాన్ పట్టణమైన మజారీ షరీఫ్‌లోని భారత కాన్సులేట్ కేంద్రంపై ఆదివారం గుర్తు తెలియని కొంత మంది ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. రెండు పేలుళ్లు, అనంతరం జరిగిన కాల్పుల నేపథ్యంలో వీరందరూ భారత కాన్సులేట్ ప్రాంగణంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించినట్లు ప్రభుత్వ ప్రతినిధి ఒకరు తెలిపారు.

01/03/2016 - 06:46

లాహోర్, జనవరి 2: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకస్మికంగా పాకిస్తాన్‌లో పర్యటించడాన్ని సవాలు చేస్తూ దాఖలయిన ఒక పిటిషన్‌ను లాహోర్ హైకోర్టు శనివారం కొట్టివేసింది. ఈ పిటిషన్‌ను శీతాకాల సెలవుల్లో విచారించాల్సిన అత్యవసరం ఏమీ లేదని స్పష్టం చేసింది.

Pages