S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

01/14/2018 - 18:50

భారతీయులు జరుపుకొనే పండుగలలో ముఖ్యమైనది.. పెద్దపండుగగా చెప్పు కునేది ‘సంక్రాంతి’ ఇదే ‘పెద్దల పండుగ’ కూడా...
పెద్దలను స్మరించుకొని, వారికి తర్పణములు, పిండ ప్రదానములు జరిపే రోజు సంక్రాంతి. సం, క్రాంతి- అను రెండు సంస్కృత పదముల కలయికతో ఏర్పడేది సంక్రాంతి. ‘సం’ అంటే మంచి, ‘క్రాంతి’ అంటే పరివర్తనము. మనిషిలో మంచి పరివర్తనము కలిగించడమే ‘సంక్రాంతి’ పరమార్థము.

01/07/2018 - 22:58

కలియుగములో పాండ్య మండలము నందలి శ్రీవిల్లిపుత్తూరులో శ్రీ భట్టనాథులు పష్పోద్యానమున తులసీవనమును పెంచుటకై భూమిని తవ్వునప్పుడు భూదేవి చిన్న శిశువుగా ఆవిర్భవించింది. ఆ శిశువును చూచిన నిస్సంతువగు భట్టనాథులు ఆమె భగవానుడు తనకు ప్రసాదించిన సంతానముగా భావించి ఆమెకు ‘‘కోదై’’ అని పేరు పెట్టాడు.

12/31/2017 - 20:57

ప్రకృతిలో భాగమైన మానవుడు తన జీవన పథం కూడా ప్రకృతికి అనుగుణంగా ఉంటాలనే కృతజతాభావనతో ఉంటాడు. మానవుని ఉనికిని ఒక పవిత్ర అంశంగా ఈ పుడమిపై స్థిరపరిచినాడు. సృష్టి, స్థితి,లయమనే అపూర్వ విషయాలను తన ఏకాగ్రచిత్తంతో అనంతమైన మనో ప్రపంచంలో శోధించి సాధించారు మన ఋషులు. హిందూ ధర్మం సర్వజనీనము, మానవ శ్రేయస్సుకు మూలం ఒక్క సనాతన ధర్మమే. ప్రకృతి నుండి మానవుని ఆవిర్భావ మనే విశ్వాసమే బహు దేవతారాధనకు దారితీసింది.

12/24/2017 - 23:53

పరాశరభట్టరు అను భాగతోత్తముడు ‘‘నీళాదేవి వక్షస్థలముపై పరున్న శ్రీకృష్ణుని లేపి, వేదములందు చెప్పబడిన అతని మహత్త్వమును చెప్పి ఆత్మ పరతంత్ర భావన బోధించి , తాను ధరించి విడిచినపూల మాలలో బంధించి పారవశ్యము చెందిన గోదాదేవికి మాటిమాటికి నమస్కరిస్తున్నాను’’ అని చెప్పిన శ్లోకాన్ని చదివి గోదాదేవి రచించి పాడిన తిరుప్పావై రచించిన పాశురాలను అనుసంధానిస్తూ నేటి జనులు గోదాదేవి రంగనాథులను పూజిస్తారు.

12/17/2017 - 22:54

దివ్యధునీ మకరందే పరిమళ పరిభోగ సచ్చిదానందే
శ్రీపతి పదారవిందే భవ భయ ఖేదచ్చిదే వనే్ద॥

12/10/2017 - 20:16

కోపాన్ని జయంచడం చెప్పినంత తేలిక కాదు. కాని, కోరిక లేకపోతే కోపం రాదు. గౌతమబుద్ధుడు కోరికలే దుఃఖానికి హేతువులు అన్నాడు. కోపం రావడం మనిషికి సహజం. కాని వచ్చిన కోపాన్ని అదుపులో పెట్టుకోవడమే మనిషిచేయాల్సిన ధర్మం. ఈ ధర్మం ఆచరించడం కష్టమైనా పురాణ కథలు వింటూ ఉంటే కోపాన్ని అదుపులో పెట్టుకోవచ్చు. వచ్చిన కోపాన్ని నిగ్రహించుకున్న వారే ఉత్తములుగా పేర్గాంచుతారు. రామాయణం లో రాముడు శాంత స్వభావుడు.

12/03/2017 - 21:05

మనం చేసే సాంగత్యమే మన ఉన్నతికి దుస్థితికి కారణవౌతుంది. ఈ ప్రపంచంలో సజ్జన సాంగత్యం, దుర్జన సాంగత్యం అని రెండు రకాలు. లోకంలో సజ్జనులు తక్కువగాను, దుర్జనులు ఎక్కువగాను ఉంటుంటారు. సజ్జన సాంగత్యం చేయాలని సకల శాస్త్రాలను చెబుతున్నాయి. దుర్జనుల వల్ల సమాజానికి భయోత్పాతాలు ఏర్పడితే సజ్జనుల వల్ల సమాజాభివృద్ధి కలుగుతుంది.

11/26/2017 - 21:00

ఏకం శాస్త్రం దేవకీ పుత్ర గీతం ఏకోదేవో దేవకీ పుత్రయేవ
ఏకో మంత్రస్తస్య నామాని యాని,కర్మాప్యేకం తస్సదేవస్యసేవ॥