S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయిన్ ఫీచర్

12/12/2017 - 18:09

‘‘కవిత్వం జీవితమంత విస్తృతం. జీవితం కవిత్వమంత సుందరం’’ అంటారు పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం ఉపకులపతి ఎస్వీ సత్యనారాయణ. అందరూ ఎస్వీ అని ఆత్మీయంగా పిలుచుకునే ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి. ‘‘జీవితం ఊహ కాదు వాస్తవం. సాహిత్యం సమాజ చలనాలకు దర్పణం’’ అనే ఆయన జీవితంలో ఎన్నో శిఖరాలు ఎక్కినా, ఎంతో సాధించినా తొణకని నిండు కుండలా ఉంటారు. సభలలో జనరంజకంగా, చమత్కారంగా మాట్లాడుతూ నవ్విస్తుంటారు.

12/10/2017 - 03:33

పచ్చని పొలాలుగా బాల్కనీలు ఇంటికి సరిపడా కూరగాయలు దిగుబడి
పట్టణ వ్యవసాయం పట్ల యువత ఆసక్తి

12/08/2017 - 19:00

పిల్లలు బయటకు వెళితే వాళ్లు వచ్చే వరకూ నాకు భయంగా ఉంటుంది. తరచూ ఫోన్ చేసి ఎక్కడున్నారు అని అడుగుతుంటాను అని అంటుంది ఒకనాటి బాలీవుడ్ అగ్రనటి శ్రీదేవి. మీడియాకు దూరంగా ఉండే శ్రీదేవి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన పిల్లలు, కుటుంబ విషయాలను, అభిరుచులను మీడియాతో ముచ్చటించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
పిల్లలకు తమిళం మాట్లాడటం రాదు. నా మాతృభాష తెలుగు. నేను ఎక్కువ సమయం చెన్నై, ముంబయిలో గడిపాను.

12/07/2017 - 19:01

ఇష్టమున్నా..లేకున్నా చలి కాలంలో ప్లాయిడ్స్‌ను అమితంగా ఇష్టపడతారు. ఎందుకంటే ఇవి చలిని తట్టుకునేలా వూల్‌తో స్టయిల్‌గా తయారుచేస్తారు. యువతులు అమితంగా ఇష్టపడే ఈ ప్లాయిడ్స్ మార్కెట్లో సందడి చేస్తున్నాయి. స్కాట్లాండ్‌లో పుట్టిన టార్టాన్ వస్త్రంతో ఈ ప్లాయిడ్స్ రూపుదిద్దుకుంటాయి. నిలువు, అడ్డం గీతలతో చెక్స్ తరహాలో ఉండే టార్టాన్ వస్త్రం స్కాట్లాండ్‌లో ప్రసిద్ధి.

12/06/2017 - 19:49

ఆ ఇంటిలో అడుగుపెడితే ఆ ఇంటి గోడలు సరిగమలు వినిపిస్తాయి. ఆ ఇంటిలో ఉండే ప్రతి వస్తువు రాగాలాపన చేస్తోంది. అదే పండిట్ శంకర్‌జీ కుటుంబం. ఆ కుటుంబ పాటల పూదోట నుంచి మరో కుసుమం వికసించింది. ఆ కుసుమమే స్నేహా శంకర్. ఔత్సాహిక గాయకురాలిగా తనను తాను నిరూపించుకుంటున్న పదకొండేళ్ల స్నేహా శంకర్ సంగీత వినీలాకాశంలో మెరుస్తున్న మరో నక్షత్రం. పిల్లలు బొమ్మలతో ఆడుకుంటారు.

12/05/2017 - 18:25

గురువు అంటే చీకటినుండి వెలుగుకు దారి చూపించేవారు అని అర్థం. ‘తమసోమా జ్యోతిర్గమయ’ అంటూ శిష్యులకు దారిదీపం అయినవారు డాక్టర్ డి.ఉషారెడ్డి. ఈవిడ మెరీడియన్ స్కూల్స్‌కి ప్రిన్సిపాల్, సిఇఓ. ఎడ్యుకేషనల్ ఫిలాసఫీస్ ఆఫ్ జిడ్డు కృష్ణమూర్తి అండ్ శ్రీ అరబిందో (జిడ్డు కృష్ణమూర్తి, అరబిందో తాత్త్విక విద్య)మీద పరిశోధన చేసి పిహెచ్‌డి పట్టా పొందారు.

12/02/2017 - 18:24

ఓ యువతి నడకతో దేశం మొత్తం చుట్టిరావటం అంటే మాటలు కాదు. కాని మూడు పదుల వయసున్న సృష్ట్భిక్షి చేస్తోంది. ఆమె చేస్తున్న పనిలో స్వార్థం లేదు. సాధికారిత దిశగా ప్రతి మహిళ అడుగులు వేయాలనే తపన మాత్రమే ఉంది. అందుకే అలుపెరగకుండా పయనిస్తోంది. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు 260 రోజుల్లో 3800 కిలోమీటర్లు పయనిస్తూ హైదరాబాద్‌కు చేరుకుంది.

12/01/2017 - 19:41

‘‘ఆట అంటే ఆలోచన కాదు. అలా భావిస్తే అసలు గెలవలేరు. ఆటను వృత్తిగా భావించవద్దు. ప్రజలు సందేహిస్తారు. మంచి క్రీడాకారిణిగా ఎదగాలంటే బాధలను కూడా తట్టుకోవాలి’’.

11/30/2017 - 21:17

ప్రస్తుతం బాల్యం ఒక శాపం. మూడేళ్ళయినా నిండని చిన్నారులకు వీపుపై కేజీల కొద్దీ బరువులు, నిద్ర చాలకుండానే స్నానం చేయించి ఏడుస్తుండగానే తయారుచేసి వ్యాను ఎక్కించగా అందులోనే వారు ఏడ్చి ఏడ్చి అలసిసొలసి నిద్రపోవడం. ఇదే విధంగా పదవ తరగతి వరకూ వాళ్ళ జీవితం సాగుతుంది. ఇక్కడే తల్లిదండ్రులు పిల్లకేది ఇష్టమో అడగరు. వాళ్ళ కలలు నిజం చేసుకోవడానికి గొప్పలు చెప్పుకోవడానికి తగిన విద్యను చదవాలని చెబుతారు.

11/29/2017 - 20:10

ఇంగ్లాక్ షినావత్రా!
ఆరు సంవత్సరాల క్రితం ప్రపంచ రాజకీయ వేదికపై ఆ పేరు ఒక సంచలనం. ఒంటి చేత్తో ఒక రాజకీయ పార్టీని అధికారంలోకి తెచ్చి మహిళల కీర్తిని ఆకాశానికెత్తిన మేటి.
ఇప్పుడు..
రాజకీయ రంగంలో ఆమె ఒక విఫల నాయకి. మంచికిపోతే చెడు ఎదురైన ప్రధానమంత్రి పదవిని కోల్పోయి జైలుశిక్షకు గురై స్వదేశం వదలిపెట్టి తప్పించుకొని తిరుగుతున్న అబల.

Pages