S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయిన్ ఫీచర్

07/19/2019 - 19:39

ఒక మంచి ఎడిటర్ తను జీవిస్తున్న కాలంలో, అందరితోపాటు జీవిస్తూ- ఒక అడుగు ముందుకువేస్తాడు. ఆ ఒక్క అడుగు పత్రికా రంగానికి అందులో భాగమైన సాహిత్యానికి బిగ్ లీప్. పీరియాడికల్ జర్నలిజంలో ఒక అడుగు ముందుకువేసిన తెలుగు స్వతంత్రకు దీటు రాగల పత్రికలు ఈనాటి వరకూ లేవంటే, ఆనాటి ఆ పత్రికా సంపాదకుల కృషి ఎంత విలువైనదో మనం గ్రహించాలి.

07/18/2019 - 19:13

పైగా ఆ నల మహారాజు సకల వేద ధర్మాలను క్షుణ్ణంగా తెలిసినవాడు. సదా ధర్మమార్గంలో నడుచుకొనడమే అతని వ్రతం. నాలుగు వేదాలను అతడు అధ్యయనం చేశాడు కలీ! అంతేగాదు నలుని గృహంలో జరిగే యజ్ఞాల్లో దేవతలు నిత్యతృప్తులై ఉంటారు. అహింసా నిరతుడైన నలుడు సత్యసంధుడు. సత్యానే్న పలుకుతాడు. ధృడచిత్తుడు. దృఢ వ్రతుడు.

07/17/2019 - 18:48

నా తల్లిదండ్రుల పూజాఫలం నాకు ఈ గొప్ప అదృష్టాన్ని ప్రసాదించింది’’ అని పాదాభివందనం కావించింది. ఇద్దరూ ఒకటయ్యారు.
వివాహానంతరం నల మహారాజు కొంతకాలం విదర్భలోనే ఉన్నాడు. భీమరాజు అనుమతితో తన నిషధ నగరానికి పయనమయ్యాడు. రాజ్యాన్ని చేరాడు.

07/16/2019 - 18:48

వందిమాగదులు నలుని గొప్పదనాన్ని ఎలుగెత్తి పలుకటానికి లేచి నుంచున్నారు.
భీమరాజు మొగాన ఆత్రుత కనపడుచున్నది.
సభాస్థలిలో పైభాగాన ఉన్న రాణీ, ఆమె దాసీజనం ముందున్న మేలి తెరను కొద్దిగా తొలిగించి తదేక దృష్టితో చూస్తున్నారు.
రంగురంగు వస్త్రాలంకరణలతో చేత ఆయుధాలు ధరించియున్న రాజభటులు అప్రమత్తులై నిలబడి చూస్తున్నారు.

07/15/2019 - 19:36

అంత సరస్వతీదేవి నా రాజసమూహంబును దాటి వచ్చిన భోజరాజకన్య అయిన దమయంతిని నిషధ రాజ పంచకంబు చెంతకు కొనిపోయెను. నలుని రూపములోనున్న లోకపాలురను చూపించెను.
అదే సమయంలో దమయంతి ‘ఒకే ఆకృతిగల ‘ఐదుగురు వ్యక్తులను నలమహారాజు రూపంలో చూచింది. ఆశ్చర్యపడింది. ఆ అయిదుగురిలో ఎవరిని చూచినా దమయంతికి నలుని లాగానే తోచింది. అపుడు దమయంతి తన మనసులో విచారించింది. బాగా ఆలోచించింది. తన బుద్ధితో ఇలా తర్కించుకొన్నది.

07/14/2019 - 22:18

ధర్మం గురించి చెప్పాలంటే మొట్టమొదట రాముని పేరే వస్తుంది. పితృవాక్య పరిపాలన గురించి చెప్పాలన్నా రాముని పేరే జ్ఞప్తికి వస్తుంది. ఆ రాముడు ఎవరంటే త్రేతాయుగంలో సుమారు అరవై ఏండ్లు పిల్లలు లేరని తపించిన వారికి అమూల్య సంతానంగా లభించిన రాముడు. రామునితోపాటుగా లక్ష్మణ భరత శత్రుఘు్నలు పుట్టారు.

07/10/2019 - 18:44

గ్రీష్మఋతువు పగటివేళలో ఈ సురారస స్వరూపమైన సముద్రముయొక్క తీరమునందలి అడవులలో ఈతనితో కలిసి, ఏలకి తీగల యిండ్లలో (యాలకుల) విహరింపుము. శాల్మముల సమూహమునందుగల ‘‘ద్రోణచలము కూడా నీకు విహారస్థానము కాగలదు. ఈతని వరించి సుఖింపుము’’ అని అనగా
దమయంతి ఒక్కింతయైనను మనసుపడకుండుట చూచి ఆ విరించిపత్ని ముందుకు సాగి దమయంతికి మరొక రాజశ్రేష్ఠుని చూపి

07/09/2019 - 19:38

ప్రఖ్యాతమైన యైశ్వర్యముగల భూలోక స్వర్గము. ఈతని వరింపుము. ఇంద్రుని భార్య శచీదేవి యంతటి భాగ్యశాలివగుదువు. మంచినీళ్ళచేత చల్లని నేలగల మఱ్ఱిచెటుట చాలులో విహరించవచ్చును.

07/08/2019 - 18:35

ఆ ఆహ్వానాన్ని అందుకొన్న భూపతులందరూ దమయంతిపై కోరికతో మదనపీడితులయ్యారు.

07/05/2019 - 19:02

ఆ మాటలు విన్న దమయంతి తొల్లి హంస చెప్పిన నాటి నుండి నలునిపై తన వలపు నిలుపుకొని కృంగికృశిస్తూ ఉన్నట్టిది ఇప్పుడు నలుడినే కనులారా చూచింది. కానీ నలుని మాటలను విన్న తరువాత మిక్కిలి దుఃఖించింది. అయినా దుఃఖాన్ని దిగమ్రింగుకొని చిరునవ్వుతో నలునికి నమస్కరించి...
రాజోత్తమా! మానవ మాత్రురాలైన నేనెక్కడ? దేవతలైన ఇంద్రాదులెక్కడ? నేను వారిని సదా నమస్కరించి అర్చిస్తాను గదా?

Pages