S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయిన్ ఫీచర్

07/04/2019 - 18:37

జగన్నాథుని లీలలు కనుగొనడం ఎవరికీ సాధ్యంకాదు. రూపం, నామం, బంధం ఇవేమీ లేని పరమాత్మ భక్తుల కోసం రూపాన్ని సృజించు కుంటాడు. నామాన్ని ధరిస్తాడు. ఇంకా భక్తులకోసమే బంధాలను కూడా కలిగించుకుంటాడు. కేవలం భార్యాభర్తగానే కాదు అన్నగా, తమ్మునిగా, అక్కగా, చెల్లిగా, మామగా, తాతగా కూడా పరమాత్మ ఎన్నో బంధాలను ఏర్పరుచుకుని వాటిలోని మర్మాన్ని మానవులకు ఎరుకపరుస్తుంటాడు. అంటే

06/20/2019 - 19:17

‘‘దేవుడు కేవలం ఒక కల్పన’’అని మీరు తెలుసుకున్న వెంటనే వాడిని మీరు వదిలేస్తారు. మీరు భయపడినా, భయపడకపోయినా వాడిని మీరు మళ్ళీ వెనక్కి తీసుకోరు, తీసుకోలేరు. ఎందుకంటే, వాడితో పనిముగిసింది.
ఇప్పుడు భయపడడమొక్కటే మీ ముందున్న మార్గం. కాబట్టి, నిశ్శబ్దంగా అందులోకి ప్రవేశించండి. అప్పుడే మీరు దాని లోతును తెలుసుకోగలరు. అప్పుడు అది అంత లోతుగా ఉండదు.
ఒక కథ చెప్తాను:

06/19/2019 - 18:23

నిజానికి, దేవుడు లేడు. ఆయన ప్రతినిధులు మాత్రమే ఉన్నారు. వారిది చాలా విచిత్రమైన వ్యాపారం. మతం అన్ని వ్యాపారాలకన్నా అతి విచిత్రమైన వ్యాపారం. అక్కడ మతాచార్యుడు, బిషప్, కార్డినల్, పోప్, మెస్సయ్యల్లాంటి పరంపరానుగత మధ్యవర్తులుంటారే కానీ, వారిపై ఎలాంటి ఉన్నతాధికారి ఉండడు.

06/18/2019 - 18:23

దేవుణ్ణి వదలాలంటే చాలా భయంగా ఉందన్నావు. బండరాయి లాంటి ఆ దేవుడి కింద నీ భయాన్ని అణచిపెట్టావు. ఆ బండరాయిని తొలగించిన వెంటనే నీ భయం అదృశ్యమవుతుంది. అప్పుడు దేవుడు కేవలం కల్పన అని తెలుస్తుంది. ఏ ప్రార్థనలు పనిచెయ్యవు. దానితో దేవుడిపై ఉన్న నమ్మకం పోతుంది. ఒకసారి నమ్మకం పోతే అది మళ్ళీ తిరిగిరాదు. కాబట్టి, భయం కలిగినప్పుడు దానిని ఎదుర్కోవాలో కానీ, దానిపై దేవుడి ముసుగు వేసినంత మాత్రాన ఆ భయం పోదు.

06/17/2019 - 22:40

అంతా మనకళ్ళముందే జరుగుతూ ఉంటుంది. అందుకే మనం ఆ వైపునుంచే చూస్తాం. తరువాత ఏం జరుగుతుందో మనకు తెలియదు. దానిని ఊహకు వదిలేశాం. అందుకే స్వర్గం, నరకం లాంటి అనేక రకాల పిచ్చి ఊహలు పుట్టుకొచ్చాయి. అతడు చనిపోతున్నాడని మనం భావిస్తాం. కానీ, అతడు మళ్ళీ జన్మిస్తాడు. అది అతనికి మాత్రమే తెలుసు. కానీ, మరణించిన అతడు మళ్ళీ వెనక్కి వచ్చి ‘‘బాధపడకండి. నేను చనిపోవట్లేదు. మళ్ళీ పుట్టబోతున్నాను.

06/17/2019 - 22:38

ఎలాంటి ఆశలు, అవసరాలు లేకుండా, పూర్తి సంతృప్తితో చాలా హాయిగా, సౌకర్యంగా జీవిస్తున్న ప్రపంచంనుంచి మరో ప్రపంచంలోకి గెంటివేయబడిన శిశువుకు అది మృత్యుసమానమైన అనుభవమే. అది వాడికే తెలుస్తుంది. కాబట్టి, వాడిలా ఆలోచిస్తేనే అది సత్యమని మీకు తెలుస్తుంది.

06/14/2019 - 19:53

భారతీయ సంప్రదాయంలో కుటుంబ వ్యవస్థ అనాది నుండి ప్రాముఖ్యత కలిగి వుంది. తల్లిదండ్రుల ప్రేమకు గుర్తు పిల్లలు. తల్లి ఇల్లు, పిల్లల లాలన చూసుకుంటే తండ్రి కుటుంబం కోసం సంపాదన బాధ్యత తీసుకుంటాడు. అందుకే మాతృదేవోభవ తర్వాత పితృదేవోభవ అన్నవి ఉపనిషత్తులు. అమ్మా అని ఎవరినైనా పిలవొచ్చు కానీ నాన్న అనే పిలుపు మాత్రం నాన్నకే సొంతం. అమ్మ ప్రేమకు మారుపేరైతే నాన్న నిండైన బాధ్యతకు మరో రూపం.

06/13/2019 - 18:33

అందుకే వైద్యుడు ఆ పసికందును తలక్రిందులుగా పట్టుకుని పిర్రలపై గట్టిగా కొడతాడు. వెంటనే వాడు ఏడుస్తూ ఊపిరి పీల్చడం ప్రారంభిస్తాడు. భలే ప్రారంభం. భలే స్వాగతం.

06/12/2019 - 19:46

దానివల్ల మీరు కోల్పోయేదేముండదు. మహా అయితే మీ సంకెళ్ళు. మీ చిరాకు, మీ విసుగు, ఎప్పుడూ మీలో ఉండే ఏదో కోల్పోయిన భావనలు పోతాయి.

06/11/2019 - 19:04

నా దృష్టిలో అది ఆత్మహత్య కాదు. అతడు తన జీవితాన్ని రెండువైపుల చాలా తీవ్రంగా వెలిగించి సంపూర్ణంగా జీవించాడు.
‘‘మీరేమో మనం ఎలాంటి వారమైనా మనని మనం అంగీకరించాలంటారు. అంతర్గత ఆనందాన్ని కోల్పోతున్నట్లు తెలుసుకున్న నేను ఈ జీవితాన్ని అంగీకరించలేకపోతున్నాను.
ఇప్పుడేం చెయ్యాలి?’’అని నువ్వు నన్ను అడిగావు.

Pages