S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయిన్ ఫీచర్

03/18/2019 - 19:10

అపుడు తల్లిదండ్రుల యెడ ఋణవిముక్తుడగును. భగవద్విషయమున దన కడ్డుతగులునెడ మాత్రమే ఎవ్వడైనను తల్లిదండ్రులయెడ అవిధేయుడై వర్తింపవచ్చును. దానిచే వానికి పాపము రాదు. ఇందులకు ఉదాహరణముగా ప్రహ్లాదుడు తన్ను తండ్రి యెంత వలదనినను హరినామ స్మరణచేయుట మానలేదు. మఱియు ధ్రువుడు తల్లి నిరోధించినను తపమొనర్చుటకై అడవులు కేగుట మానలేదు. ఇందు వారు చేసినది తప్పిదము కాదు.
ప్రార్థన: శ్రద్ధ్భాక్తులు

03/17/2019 - 22:36

శక్తిసాధనయనగా మాటలుగాదు, మహాకఠినమైన-ప్రమాదకరమైన- సాధనలతో గూడుకొనియున్నది. జగజ్జనని సఖిననుభావముతో నేను రెండు సంవత్సరములు సాధనచేసినాను, ఐనను నాది పుత్రభావము- శిశుభావము; నాకేవనిత పాలిండ్లైనను నా తల్లి పాలిండ్లవలెనే తోచును.

03/15/2019 - 19:23

తారకమంత్రమగు ప్రణవము సామాన్యశబ్దముకాదు, సాక్షాత్ పరబ్రహ్మస్వరూపము. అటులనే పవిత్రతను భక్తినిగోరుకొనుట క్షుద్రమగు లౌకిక వాంఛలతో బోల్పదగదు.
స్ర్తిలయెడ నుండవలయు మనోభావము
435. స్ర్తిలందఱును జగన్మాతయొక్క అంశములేకావున ఎల్లరును వారిని తల్లులవలె భావింపవలయును.

03/14/2019 - 18:28

శ్రీసింధూజా హృదయ వల్లభ! పావనాంఘ్రే!
భక్తార్తినాశ! భవభంజన! భాగ్యదాయిన్
క్షీరాబ్దివాస! మధుసూధన నిర్మలాత్మన్
శ్రీ ఖాద్రినాథ నృహరే తవసుప్రభాతమ్
అంటూ శ్రీ లక్ష్మీనరసింహస్వామి నామస్మరణతో పునీతమవుతున్న సుప్రసిద్ధ క్షేత్రం కదిరి..

03/13/2019 - 19:36

‘‘కామక్రోధాదులు ఎప్పుడు లోబడును?’’అని యొక రడుగగా, శ్రీగురుదేవుడిట్లు సమాధానమొసగెను: ‘‘కామక్రోధాదులను సంసారపరముగా-్భగపరముగా- నడపుచున్నంతవఱకు అవి నీకు శత్రువులుగనే యుండును. వానిని భగవంతుని వైపునకు మఱల్చితివేని, అవియే నీకు పరమాప్తవర్గమగును.

03/12/2019 - 20:47

అనేకులు వినయము చూపనెంచి, ‘‘నేను బురదలో పొరలాడు వానపాము వంటివాడనండి!’’అనుచుందురు. ఈ రీతిని తాము పురుగులమని భావించుకొనుచు కాలక్రమమున నిజముగా వారు పురుగులవలెనే ఆత్మబలహీనులయ్యెదరు. దైన్యమును నీ మనస్సున జొరనీయకుము. దైన్యమనునది, నిరాశయనునది, పురోగమనమునకు ప్రబల శత్రువు. భావనననుసరించియే సిద్ధియు గలుగుచుండును.
417. మానముకలవాడే మానవుడు, ఇతరులందఱును మానవమాత్రులు.

03/11/2019 - 20:12

అక్షరాభ్యాసము నాటినుండియు- చిన్ననాటినుండియు- సహనము నలవరచుకొనవలయునని మనకివి తెలుపుచున్నవి. మానవులకు సహనమే ముఖ్యమైన సుగుణము.
405. ఆ కమ్మరివాని దాగలిని జూడుము,- దానిని సమ్మెటతో నెట్లు కొట్టుచున్నారో కనుము! ఐనను ఇసుమంతయు అది కదలుటలేదే? శాంతిని, ఓరిమిని మానవులీ దాగలినుండి నేర్చుకొందురుగాక!

03/10/2019 - 22:47

‘‘్భషణ వికాస శ్రీ్ధర్మ పుర నివాస, దుష్ట సంహార నరసింహ దురితదూర’’ అనే మకుటంతో భక్తాగ్రేసరుడు శేషప్ప రాసిన నరసింహ శతక పద్యాల మాధుర్యాన్ని ఆస్వాదించని తెలుగువారుండరంటే అతిశయోక్తి లేదేమో.

03/08/2019 - 20:15

‘‘ఒక్క క్షణములో బస్మమైపోవును’’అని విద్యార్థి సమాధానము చెప్పెను. అంత గురుదేవుడిట్లు బోధించెను: ‘‘ఆ విధముగనే నీలో ఆధ్యాత్మికశక్తి చాల దుర్బలముగా నున్నప్పుడు విచక్షణ లేకుండ, అడ్డమైన వారి చేతినుండియు తినుచుండిన యెడల అ రవంతశక్తియు కూడ అణగిపోవచ్చును. ఇదియే ఇందున్న ప్రమాదము. కాని ఆ శక్తియే ప్రబలముగానున్నప్పుడో, నీవు ఎట్టి ఆహారముతిన్నను బాధలేదు.’’

03/07/2019 - 19:50

ఆ కసాయివాడు దానిని క్రూరముగా గొట్టుటవలన ఆవు వానిని తిప్పలు పెట్టసాగెను. దానిని తోలుకొనిపోవుట వానికి బహుదుర్ఘటమైనది. అట్లు చాలసేపు శ్రమపడి మధ్యాహ్నమునకు ఎట్లో ఒక గ్రామము చేరుకొనెను. చాల అలసిపోయి సమీపమున నున్న యొక ధర్మసత్రమునకు వెడలి అచట నీయబడు సదా వృత్తిలో పాల్గొనివాడు. తృప్తిగా తినుటచే బాగుగా తేఱుకొని సులభముగా ఆవును వధశాలకు జేర్పగలిగినాడు.

Pages