S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయిన్ ఫీచర్

08/16/2018 - 20:09

కాశీ విశాలాక్షి అన్నపూర్ణ అనే నామాలతో విశ్వనాధస్వామి సహచర్యంతో నిత్యం జ్ఞానాన్ని, అన్నప్రసాదాన్ని భక్తులకు అందించే జగన్మాత దర్శనం అలౌకిక ఆనంద ఆధ్యాత్మిక వరం అని భక్తుల ప్రగాఢ విశ్వాసం.

08/14/2018 - 20:18

ప్రయాగ వద్ద బాంద్రా జిల్లాలో రాజాపురము పేరుగల గ్రామం ఉన్నది. అక్కడ ఆత్మారామ్ దూబే పేరుగల ప్రఖ్యాత పండితుడు సరయూ నదీ పరీవాహక ప్రాంతంలో నివసిస్తూండేవాడు. క్రీ.శ.1554 సం. శ్రావణ శుద్ధ సప్తమిన 12 నెలలు గర్భంలో వున్న పిదప ఈయన జన్మించారు.

08/13/2018 - 19:33

శ్రావణ మాసం వచ్చిందంటే చాలు స్ర్తిలు ఎంతో ఉత్సాహంగా కనిపిస్తారు. ఈ మాసంలో వచ్చే ప్రతి మంగళవారమూ, శుక్రవారమూ అత్యంత ప్రీతికరంగా మహాలక్ష్మీ అమ్మవారిని సేవించుకునే సుదినాలు. ఈ మాసంలోనే మంగళగౌరీ వ్రతాన్నీ, వరలక్ష్మీ వ్రతాన్నీ ఆచరిస్తారు. లక్ష్మీ భర్త విష్ణుమూర్తిది శ్రవణా నక్షత్రం. ఆ విధంగానే కృష్ణపరమాత్మ జన్మించిన మాసం శ్రావణమాసం.

08/12/2018 - 21:05

త్రినేత్రుడైన పరమేశ్వరుని మానస పుత్రిక శ్రీ మాతా మానసదేవి. ఆమెను మనసారా పూజిస్తే భయంకరమైన కాల సర్ప దోషాలు కూడా తొలగిపోతాయి. ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లోని బిల్వపర్వతంపై వెలసిన ఆమె యుగయుగాలుగా భక్తులను తన చల్లని చూపులతో సంరక్షిస్తున్నారు. ఆమె దయ వుంటే చాలు ఏమైనా సాధించవచ్చని కోట్లాదిమంది భక్తుల నమ్మకం. సర్పాలకు మానవులు తెలిసిగానీ తెలియక గానీ చేసిన పాపాలను అమ్మను స్మరిస్తేనే పోగొడుతుంది.

08/08/2018 - 18:55

నైతిక జీవితంలో మానవుడు తన కర్తవ్య కర్మల ద్వారా హృదయంలోని మాలిన్యాన్ని కడిగి దైవప్రార్థనవైపు తన దృష్టిని మరల్చడానికి ప్రయత్నించాలి. ఈ ప్రయత్నంలో అలసిపోకుండా కొంత శక్తిని బలాన్ని తనకు చేకూర్చమని ఆ దైవానే్న ప్రార్థించాలి. ఇందుకు వేదమంత్రాలను పఠించాలి. వేద మంత్రాలలో వున్న మహత్తరశక్తి మనిషిని సన్మార్గంలో నడిపించగలదు. వేదపఠనం ద్వారా విశేషమైన ఆధ్యాత్మిక సంపద లభిస్తుంది.

08/07/2018 - 19:35

‘‘మనుషులు నిరంతరం ఆశాపాశలతో కాలచ్రకంలో ఇరుక్కుని ఉంటారు. నేడు ఆధునిక యుగంలో ప్రతి ఒక్కరూ వారి, వారి, జీవనక్రమంలో పూర్తి నిమగ్నమైనా భగవంతుని గురించి తన పరలోకం గురించి ఆలోచించే వ్యవధే లేనట్టు ఉంటున్నాడు.
‘‘ఉదయం లేచిన దగ్గర నుండి నిరంతర ం లౌకికమైన వ్యాపకాలే! చిన్నా పెద్దా తేడాల్లేకుండా వయస్సు తారతమ్యం కాని, పేద, ధనిక అన్న వ్యత్యాసం కాని లేనట్టు అంతుపట్టని కార్యక్రమాలలో సతమతమవుతుంటారు.

08/06/2018 - 19:35

బిల్వపత్రంతో ఆ సదాశివుని పూజించితే మూడు జన్మల పాపం సంహారమవుతుందని శివపురాణం వచిస్తుంది.
బిల్వపత్ర నమస్తేస్తు శివపూజసాధన
మూలతో భవరూపాయ మధ్యతో మృడరూపిణే
అగ్రతః శివరూపాయ మధ్యతో మృడరూపిణే
స్కందే వేదాన్తరూపాయ తమరాజాయతే నమః

08/05/2018 - 21:25

ఆలోచన, మాట, చేత ఈ మూడింటి సమాహారంగా చేయగలగడం ఒక్క మనిషికి మాత్రమే భగవంతుడిచ్చిన గొప్పవరం. ఈ త్రికరణాల్లో స్పష్టత, సత్యత, శుద్ధత లేకుండాపోతోందని అందరూ అనుకోవడం జరుగుతుంది. మరి అనుకుంటున్న వారిలో ‘త్రికరణశుద్ధి’ ఉందనుకోవచ్చా?

08/03/2018 - 19:21

‘నీవు నాకిపుడు మంచి స్నేహితుడివి. నేటి నుండి మనము కష్టసుఖాలను సరిసమానంగా పంచుకొందాము’ అంటూ శ్రీరామచంద్రమూర్తి, సుగ్రీవుడూ హనుమంతుడూ లక్ష్మణుడూ చూస్తూ వుండగా ప్రతిజ్ఞగావించారు. రాముడూ సుగ్రీవుడూ అగ్ని చుట్టూనూ ముమ్మారు ప్రదక్షిణం చేసి కలకాలము స్నేహితులుగా వుంటామని, ఒకరికొకరు చేతులను తమ చేతుల్లోకి తీసుకుని కౌగలించుకున్నారు.

08/02/2018 - 18:58

మానవలోకంలో మానవులకు, జంతువులకు, వస్తువులకు భగవానుడు కొన్ని ధర్మాలను నిర్దేశించాడు.
వినయము, సహనము, ఆచారము, పరాక్రమము మానవునికి సంస్కారం అందించే సాధనాలు. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలను నిర్జించి, పరమాత్మ పట్ల భక్తిని కల్గించటానికి ఉపకరణాలు. తనకు నచ్చని అంశాలను పరులమీద రుద్దకుండా చేయటం ధర్మం. తనదారిలో ఎవరి మాట వినకుండా ముందుకు నడవడం అధర్మం.

Pages