S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయిన్ ఫీచర్

07/20/2018 - 18:49

సామెతలు -19:5 - ‘అబద్ధములాడువాడు తప్పించుకొనడు’

07/19/2018 - 19:05

అమ్మలగన్న అమ్మ ఆషాఢమాసంలో ప్రతివీధిలోను ప్రతి గ్రామంలోను కొలువై తన కన్న బిడ్డలతో పూజలందుకొంటుంది. ఆ పూజలందుకోవడంలో ఆతల్లి ఆనందిస్తుంది. తన బిడ్డలకు సంతోషాన్నిస్తుంది. ఆ తల్లికి పూజలందించుకునే పండుగే తెలంగాణలో బోనాలుగా ప్రసిద్ది చెందింది.

07/18/2018 - 19:33

ఆషాఢమాసం వచ్చిందంటే చాలు ఎల్లెడలా అమ్మఆరాధనలు కనులపండుగగా కనిపిస్తాయ. అందులోను తెలంగాణ లో అమ్మ ఆరాధనలు జాతర్లుగాను, ఉత్తససాలుగా మరింత వేడుకగా జరుగుతుంటాయ. ఆషాఢమాసం ఆదివారం నాడు ఏ తల్లి దేవాలయం చూసినా బోనాలెత్తుకు వచ్చే ఆడపడచ లు వారి వెంట పోతురాజులు, వారి వెంట ఫలహారపు పండ్లు తండోపతండాలుగా వస్తుంటాయ.

07/17/2018 - 18:49

మహాభారతంలో కౌరవ పక్షాన వున్నవారిలో ఎందరో విజ్ఞులున్నారు. అట్టివారిలో మనం ప్రత్యేకంగా పేర్కొనదగిన ఒక పాత్ర సంజయుడి పాత్ర. సమ్యక్ యోజుయతీతి సంజయః అని సంస్కృత వ్యాఖ్యానం. అనగా చక్కగాఆలోచన చేయగల సమర్థుడు, సమయోచిత బుద్ధికలవాడని అర్థం. భారతంలోని సంజయుడు అన్ని విధాలా సార్థక నామధేయుడు.

07/15/2018 - 22:03

విశ్వశాంతికి ప్రపంచంలోని మహానుభావులు నిరంతరం కృషి చేస్తున్నారు. సమాజం శాంతియుతంగా ఉంటే ప్రజల జీవనం సాఫీగా కొనసాగుతుంది. ప్రపంచంలో అభివృద్ధి చెందిన అమెరికా, రష్యా, చైనా, బ్రిటన్, జర్మనీ తదితర దేశాల ప్రజలైనా, పేదరికంతో ఉన్న నేపాల్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనీస్తాన్ లాంటి దేశాల్లోని ప్రజలైనా ప్రశాంతంగా, స్వేచ్ఛగా జీవించేందుకే ఇష్టపడతారు.

07/09/2018 - 22:01

భారతీయ సాంప్రదాయంలో ఉదయాన్ని నిద్రలేవగానే మున్ముందుగా భూమాతకు వందన మాచరించి, కన్నతల్లి పాదాలకు నమస్కరించి, గోశాలలో ఉన్న గోమాత పృష్ఠ భాగాన్ని కనులకద్దుకుని భక్తిని ప్రకటించడం విధిగా పేర్కొనడం జరిగింది. పలు పుణ్యక్షేత్రాల్లో సుప్రభాత సేవా కాలంలో గోమాతను స్వామివారి సన్నిధిలోనుంచిన తరువాతనే తలుపులు తీస్తారు. అంటే భగవంతునికే భగవత్స్వరూపం గోమాత.

07/01/2018 - 21:52

నిందకు భయపడి శ్రీరాముడు తనను అడవుల్లో వదిలేసి రమ్మన్నాడని సీతాదేవిని గంగాతీర భూముల్లో విడిచిపెట్టి లక్ష్మణుడు వెళ్లిపోయాడు. లక్ష్మణుడు చెప్పిన మాటలకు సీత నిర్ఘాంతపోయింది. లక్ష్మణుడు వెళ్లిపోయిన తర్వాత పరిపరివిధాల ఆవేదన చెందింది. అయోధ్యలో వున్నపుడు శ్రీరామునితో తన అనుభవాలను జ్ఞాపకం చేసుకొని కుమిలి కుమిలి ఏడ్చింది. శ్రీరాముడు తనను ఒడిలోకి తీసుకొని హృదయంమీదికి చేర్చుకున్నాడు.

06/17/2018 - 21:11

దేవాలయం గురించి ప్రతివారికి తెలుసు. దేవాలయంలో ఉండేవాడు దేవుడు. దేవాలయాన్ని దేహంతో పోల్చారు ప్రాచీన ఋషులు. దేహమే దేవాలయం అన్నారు. ఆ మాటే శ్రీకృష్ణపరమాత్మ భగవద్గీత క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగంలో ‘ఇదం శరీరం కౌనే్తయ క్షేత్ర మిత్యభిధీయతే’.

06/14/2018 - 00:18

భిన్న సంస్కృతులు, సంప్రదాయాలు, భాషలు, ధర్మాలు, ప్రజల కేంద్రస్థానమై, అఖండ మరియు అవిభాజ్యమైన సంస్కృతికి మూలాధారమైన భారతావని ప్రాచీన కాలంనుండీ వ్యవసాయ ప్రధాన దేశం కావడం, గ్రామీణులలో అధిక సంఖ్యాకులు రైతులే కావడం, ఎడ్లు మరియు నాగళ్ళతో విడదీయరాని బంధం, అనుబంధాన్ని ఏర్పరచుకోవడం మన దేశానికే ప్రత్యేకం. ఆంధ్ర దీపికా నిఘంటువును బట్టి ‘‘ఏరు’’ అనగా సర్వావయవములు గల నాగలికి ఎడ్లను పూనినది అని అర్థం.

06/12/2018 - 21:46

మాతృపితృ సహస్రేభ్యో పి హితైషిణా వేదేనోపదిష్టమ్’
‘‘ప్రపంచంలోని వేలాది తల్లిదండ్రులకన్నా కూడా మన హితాన్ని సమధికంగా కోరేది- వేదం! ఆ వేదం చేసిన ఉపదేశమే హితం!’’ అని ఆదిశంకరాచార్యులవారు అన్నారు.
వేదం అంటే, ‘విచారణే’ (విచారణ చేయుట) ‘సత్తాయామ్’ (ఉండుట) ‘జ్ఞానే’ (తెలిసికొనుట) ‘లాభే’ (పొందుట) అని అనేకార్థాలున్నాయి.

Pages