S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయిన్ ఫీచర్

03/07/2018 - 00:13

‘యథార్థవాది లోక విరోధి’ అన్నారు. యథార్థం చెబితే అందరికి విరోధి అవుతాడు. నలుడు, హరిశ్చంద్రుడు వంటి మహానుభావులు తమ జీవితాలను సత్యానికే అంకితం చేశారు.నిజం నిర్భయంగా చెప్పగలగడం అందరికీ చేతకాదు. సత్యాచరణ కత్తిమీద సాము వంటిది. సత్య రక్షణ చేయడంలో కొన్ని సమయాల్లో సంకట పరిస్థితి ఎదురవుతుంది. సత్యాన్ని పలికే వారికి తాత్కాలికంగా అగ్నిపరీక్షలు, విపత్కర సమస్యలు తారసిల్లినా వారికి సాధ్యం కానిదిలేదు.

03/05/2018 - 01:48

పవిత్రతలేని భక్తి ఉండదు- ‘భక్తి’ లేక పవిత్రత సిద్ధించదు. ఈ రెండూ ఒకదానికొకటి ప్రత్యామ్నాయమైన చర్యలు. వీటిలోని అంతర్భావన అంత సులభగ్రాహ్యం కాదు. అయినా సరే ఈ రెంటినీ గుర్తించి గౌరవించే మానవుల జీవితమే ధన్యవౌతుంది! పరమేశ్వరుడు మన మానవ శరీరాన్ని చాలా గొప్పగా నిర్మించాడు. సర్వజీవులూ సమానమే అని భావించినా- మానవ శరీర నిర్మాణంలో నున్నంత విలక్షణ లక్షణం మరే ఇతర ప్రాణికోటిలోనూ మనకు కన్పడదు.

03/02/2018 - 21:02

‘‘కామకలావిలాస’’ కర్త తమ గ్రంథమునందు

03/01/2018 - 22:43

‘‘్భషణ వికాస శ్రీ్ధర్మ పుర నివాస, దుష్ట సంహార నరసింహ దురితదూర’’ అనే మకుటంతో భక్తాగ్రేసరుడు శేషప్ప రాసిన నరసింహ శతక పద్యాల మాధుర్యాన్ని ఆస్వాదించని తెలుగువాడుండడంటే అతిశయోక్తి లేదు.

03/01/2018 - 01:24

ఒక్కోమనిషిలో ఒక్కోజ్ఞానం ఉంటుంది. జ్ఞానమనేది కేవలం పాండిత్యం వల్ల రాదు. అనుభవం వల్ల రాదు. పూర్తి ఏకాగ్రతతో పాటుగా నేర్చుకోవాలన్న జిజ్ఞాస వల్లే జ్ఞానం వస్తుంది. ఒక ఊరిలో రచ్చబండ దగ్గర ఒక పండితుడు రోజు పురాణ కాలక్షేపం చేసేవాడు. ఊరిలోని అందరూ ఆ పురాణం విని ఆనందిస్తూ ఉండేవారు. కాని ఆ ఊరిలోని ఒక సామాన్య రైతు పురాణం వినడానికి వచ్చేవాడు కాదు. అందరూ తెలివి లేనివాడు అని అతనిని అనేవారు.

02/27/2018 - 21:00

జైముల దక్షిణకాశీగా శ్రావణ బెళగళ ప్రసిద్ధి గాంచింది. శ్రావణ బెళగళలో ఇంద్రగిరి లేదా వింధ్యగిరి అని పిలువబడే కొండపై కొలువుదీరి బాహుబలి గోమఠేశ్వరుడు వున్నాడు. వింధ్యగిరి కొండపై అనేక కట్టడాలు మధ్య 58 అడుగుల ఎత్తు, 26 అడుగుల వెడల్పున బాహుబలి లేదా గోమఠేశ్వర మహామూర్తి విగ్రహం 72వేల 574 కిలోల బరువు కలిగి గిరిపై నిర్మించబడింది. ఈ భారీ విగ్రహం నెలకొల్పడానికి 12 సంవత్సరాల సమయం పట్టింది.

02/26/2018 - 21:38

దృఢమైన శరీరం ఉన్నప్పటికీ పూర్వం యుద్ధంలో శత్రువులతో పోరాడవలసిన వీరులు తమ శరీరానికి ఉక్కు కవచాలను, తలకు శిరస్త్రాలను ధరించేవారు. దీనివలన శత్రువుల నుండి ప్రయోగింపబడే శస్త్రాల బారి నుండి రణరంగంలో రక్షణ లభించేది. కర్ణుడు పుడుతూనే సహజ కవచ కుండలాలతో పుట్టాడు. అయినప్పటికీ అర్జునుని మించినవారు ఉండకూడదని ఇంద్రుడు మారువేషంలో వచ్చి వాటిని దానంగా స్వీకరించిని సంగతి అందరికీ తెలిసినదే.

02/25/2018 - 22:31

అంబరీషుడు ఒక మహారాజై ప్రజలను కన్నబిడ్డల్లాగా పాలిస్తున్నాడు. అతడు సకల సద్గుణ సంపన్నుడు. అంతకు మించి పరమ భాగవతోత్తముడు. విష్ణ్భుక్తికే జీవితాన్ని అంకితం చేసినవాడు. ఇతని భక్తికి మెచ్చి శ్రీమహావిష్ణువు దివ్య చక్రాన్ని ప్రసాదించాడు. అంబరీషుడు ఏకాదశీవ్రతాన్ని తాను ఆచరించడమే కాకతన రాజ్యంలోని వారందరిచేత వ్రతాన్ని ఆచరింపచేసేవాడు. ఏకాదశీవ్రతం తరువా త అంబరీషుడు నియమనిష్టలతో ద్వాదశీ వ్రతాన్ని ఆచరిస్తాడు.

02/23/2018 - 22:31

మనం వెతికే దేవుడు, మనం చూడాలనుకుంటున్న దేవుడు, మనం పూజలు చేస్తున్న దేవుడు కేవలం దేవాలయాల్లో మాత్రమే కాక నీలో, నాలో, ప్రతి అణువులో, దయార్ద్ర హృదయం కల ప్రతివారిలో, నలుగురికి మేలు చేయాలనే సంకల్పం ఉన్న ప్రతి ఒక్కరిలో ఆ దేవుడు ఉన్నాడు. అందుకే దేహానికి మించిన దేవాలయం లేదు. అంతరాత్మకు మించిన దేవుడు లేడు. నిస్సహాయునికి చేసే సేవలో పరమాత్ముడుంటాడు. మన వేద విజ్ఞానం చాలా గొప్పదని చెప్పవచ్చు.

02/22/2018 - 22:17

ఆశ్వలాయన మహర్షి: ఈయన ‘అగతత్వాలహరి’ అను గ్రంథమును రచించెను. ఈ గ్రంథమునందు వివిధ రకములైన వ్యవసాయ పద్ధతులు, వృక్ష సంపద గురించి వివరించారు.
అత్రిమహర్షి: ఈయన ‘నామార్థకల్పము’ అనుగ్రంథమును రచించెను. ఈ గ్రంథము నందు 84 లక్షల శక్తులు, వాటి నామములు, నామోత్పత్తులు, నామార్జనములు చెప్పబడ్డాయి.

Pages