S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

06/18/2019 - 18:27

దేవుడే దొంగను పోయి దొంగతనము చేయుమని ప్రేరేపించును; మరియు దొంగనుగూర్చి జాగ్రతపడుమని గృహస్థుని ఆతడే హెచ్చరించును. సర్వమునకు ఆతడే కర్త.
పదునెనిమిదవ ప్రకరణము
బ్రహ్మసాక్షాత్కారము
మనస్తత్త్వము: బ్రహ్మసాక్షాత్కారము

06/17/2019 - 22:37

సర్వవస్తువులును నారాయణుని వివిధ రూపములు, వాని యనంత విభూతులు.
892. భగవానుడిట్లనును: ‘‘కాటువేయు పాము నేనే. విషము తొలగించు మాంత్రికుడను నేనే; శిక్షల విధించు దండనాధికారిని నేనే, ఆ శిక్షలను నెఱపు కింకరుడను నేనే.’’.

06/17/2019 - 22:36

సాకారదైవము ఘనీభవించిన సచ్చిదానంద రసమని చెప్పవచ్చును. జలాంతర్భూతమగు మంచుగడ్డ జలమున నిలిచియుండి పిమ్మట దానిలో కరగిపోవునటుల నిర్గుణ బ్రహ్మాంతర్భూతమగు సాకారదైవము బ్రహ్మమునుండియే వెలువడి, అందు నెలకొని యుండి, మఱల అందే లీనమై, అదృశ్యమైపోవును.

06/13/2019 - 18:34

ఇదియంతయు గనిపట్టుచుండిన యొకడు రంజకుని యొద్దకు వచ్చి యిట్లనెను: ‘‘మిత్రుడా, నాకేరంగునందును ప్రీతి లేదు. నీయభిరుచిని దెలిసికొని నాబట్టకు నీ యిచ్చవచ్చిన రంగు వేయించుకొనుటయే నాయభీష్టము’’. భక్తుని యభీష్టము నుసరించి సాకారుడుగా గాని, నిరాకారుడుగా గాని భగవానుడు వానికి సాక్షాత్కరించును.

06/12/2019 - 19:47

866.బ్రహ్మమునకు జీవజగత్తులకునుగల సంబంధము అనులోమ విచారమునకును విలోమ విచారమునకును గల సంబంధము వంటిది. జీవ జగత్తులను విడిచి పరబ్రస్మము వైపునకు మరలినచో, నీ వ్యక్తిత్వము బ్రహ్మమున లయించును. ఇదియే సమాధి. బ్రహ్మజ్ఞానముతో- ఈ దివ్య వ్యక్తిత్వముతో- నీవు బయలుదేరినచోటికే మరలితివా,

06/11/2019 - 19:05

ఇట్లే సగుణబ్రహ్మము వినా నిర్గుణ బ్రహ్మమును నిర్గుణ బ్రహ్మము వినా సగుణ బ్రహ్మమును చింతింపజాలము.

06/10/2019 - 22:09

ఈ దృష్టాంతమును వివరించునెడల, సమాధి స్థితిలో గోచరించు బ్రహ్మమే ఇందులకు మూలమైన పాలు, సగుణ నిర్గుణ స్వరూపమగు బ్రహ్మమే ఇందలి వెన్న, ఇరువదినాలుగు తత్త్వములతో గూడిన ప్రపంచమే మజ్జిగ.

06/10/2019 - 22:08

బ్రహ్మము వీనికన్నింటికిని అతీతము. ప్రపంచమందలి కీడుమేళ్లు బ్రహ్మమునకు కీడుమేళ్లు కావు. మంచి చెడుగులకు సంబంధించు మనయొక్క నీతి నియమములను బ్రహ్మమునకు అనువర్తింపజేయజాలము, వానినిబట్టి బ్రహ్మము యొక్క స్వభావమును ఎంచదగదు.
840. జ్ఞానాజ్ఞానములు, పుణ్యపాపములు, ధర్మాధర్మములు- వీని కన్నిటికిని బ్రహ్మము అతీతము. అయ్యది సమస్త ద్వంద్వాతీతము.

06/07/2019 - 19:02

ప్రతులకు
7-8-51,్ఫ్లట్ నెం. 18, నాగార్జున సాగర్‌రోడ్, హస్తినాపురం, సెంట్రల్ కాలనీ, ఫేజ్ -2
హైదరాబాద్- 500079

06/06/2019 - 19:29

సచ్చిదానందమయునందు చిత్తము లయమందకుండునంతవఱకు నరుడు భగవత్ప్రార్థనమును సంసారమున కర్మమును- రెంటిని గూడ చేయవలసి యుండును. కాని భగవానునియందు చిత్తము లయమందినవాడిక నే కర్మమును చేయనక్కరలేదు. ఉదాహరణమునకు సంకీర్తనమును గైకొందము. ‘‘నితాయ్ అమార్ మత్తాహతి’’ (మత్తగజము నా నిత్యానందుడు) అనుకీర్తనము నొకడు పాడనారంభించును. మొదట పల్లవిని పాడునపుడు గాయకుడు రాగతాళాది వివరములనన్నిటిని గూర్చియు శ్రద్ధవహించును.

Pages