S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

03/07/2018 - 21:24

చతుర్విధ పురుషార్థాలలో ధర్మం మొదటిది. మనస్సు-ఆత్మలను ఉత్తమ సంస్కార రూపంతో ఉంచే గుణమునే ‘్ధర్మము’ అంటారు. శృతి, స్మృతులచే విధింపబడిన క్రియను ధర్మాచరణమని అంటారు. భారతదేశం కర్మభూమి- ధర్మభూమి గనుక ధర్మానికి పెద్దపీట వేయడం జరిగిందని, పురాణాలు- ఇతిహాసాలలో కన్పిస్తుంది.

03/07/2018 - 00:03

‘‘క్రూరమైన మొగలారుూల, షాహీల దుష్ప్రవర్తనలతో హిందూ సమాజం దుర్భర జీవితాలను గడుపుతున్న సమయంలో, గో, బ్రాహ్మణుల రక్షణ కరువైన వేళ, పవిత్ర మాతృమూర్తుల కన్నీళ్ళు మహానదులై ప్రవహిస్తున్న వేళ’’లో మనుషుల్లో భగవంతుని చూడమని చెప్పిన గీతాచార్యుడే ‘పరిత్రాణాయ సాధూనాం, వినాశాయచ దుష్కృతాం’ అను గీతా వాక్కును నిజం చేస్తూ ‘శివాజీ’గా అవతరించాడా అన్నట్టు అఖిల భారతావనికి రక్షణగా శివాజీ జన్మించారు.

03/05/2018 - 21:03

ఆళ్వారు మహారాజు: బాబూజీ మహారాజ్! నాకు విగ్రహారాధన యందు విశ్వాసము లేదు. నా గతి యేమగును? అని నవ్వెను.
వివేకానంద స్వామి: మీరు హాస్యమునకు మాట్లాడుచున్నట్లున్నారు.

03/02/2018 - 21:00

శ్రీమద్భాగవతము -శ్రీ దేవీ భాగవతముల రెండింటిని వేదవ్యాస మహర్షి రచించారు. ఒక దానికి శ్రీమత్ అని మరొకదానికి శ్రీదేవి అని చేర్చబడ్డాయి.్భగవతం అన్న పదం రెండింటిలోను ఉంది. శ్రీమద్భాగవతం విష్ణుకథలతో నిండి ఉంటుంది. శ్రీదేవీ భాగవతం శ్రీదేవిని గూర్చిన కథలతో ఉంటుంది. రెండూ భక్తి ప్రధానములే.

02/27/2018 - 21:01

‘‘నేనూ-నాదీ’’ అనే అహంకారాన్ని సమూలంగా ప్రక్కన పెట్టగల్గిన వాడికే ‘‘గురుతత్వం’’ సమగ్రంగా అవగతమయ్యేది.

02/26/2018 - 21:34

రాయల వంశజుడైన సదాశివరాయలు ఆస్థాన పండితుడైన తిమ్మన భట్టు, భార్య గోపమ్మ, వీరిద్దరూ పరిస్థితుల ప్రాబల్యంతో తన గురువులు, తంజావూరులో ఉంటున్న నరేంద్ర తీర్థులకు శరణాగతులయ్యారు. శిష్యుని పరిస్థితి తెలుసుకుని ఆ దంపతులను ఆదరించారు. నరేంద్ర తీర్థులు తంజావూరు ప్రభువులతో తనకు గల పలుకుబడి కారణంగా తిమ్మన భట్టుకు ఆస్థానంలో కవిగా కొలువు ఇప్పించారు. అక్కడ ఆ దంపతులకు వెంకటాంబ, గురురాజులు జన్మించారు.

02/23/2018 - 22:34

భారత దేశంలో ఎన్నో మతాలు, మరెన్నో కులాలున్నాయి. ఒక్కోక్కరు ఒక్కో దేవుని రూపాన్ని ప్రార్థిస్తుంటారు. ఈ ప్రార్థనలో చాలారకాలున్నాయి. చాలామంది వారి కోర్కెలు తీర్చమని దేవుని స్తుతిస్తుంటారు. విద్యార్థులు నాకు పరీక్షలో ఉత్తీర్ణత రావాలనో ప్రథమ శ్రేణి రావాలనో మొక్కుతారు. ఈతి బాధలు దూరం చేయమని సంసారులు ప్రార్థిస్తుంటారు. డబ్బులు కట్టకట్టలుగా రావాలని పిసినారులు ప్రార్థిస్తుంటారు.

02/22/2018 - 22:21

‘‘పుస్తకాలనే దీపాల వెలుగులోనే - మనోమాలిన్యమనే చీకటి తొలుగుతుంది’’ అని మన భారత రాజ్యాంగ నిర్మాత డా. బి.ఆర్.అంబేద్కర్ తన అమూల్యమైన అభిప్రాయాన్ని వెల్లడించినట్లు, హస్త్భూషణమనదగిన పుస్తకం విలువ అక్షరాలలో నిక్షిప్తం చేయాల్సినంత గొప్పది. పుస్తక పఠనం అనేది ఆరోగ్యకరమైన ఒక మంచి అలవాటు. ఆ అలవాటు ద్వారానే మన ఆలోచనల పరిధి పెరుగుతుంది.

02/22/2018 - 00:54

శ్రీ చక్ర ఆవిర్భావం: ఉండేది బ్రహ్మమొక్కటే. ‘‘ఏకమేవాద్వితీయం బ్రహ్మ’’ ‘‘ఏకం సత్ విప్రా బహుదా వదంతి’’ అని ఆర్ష వాఙ్మయం చెబుతోంది. ఒకే సత్యాన్ని పండితులు అనేక పేర్లతో అనేక రూపాలుగా భావిస్తూ పిలుస్తూ వచ్చారు. ఈ బ్రహ్మము సత్, చిత్, ఆనంద స్వరూపములు కలది. అది చలనము లేనిది, నిశ్చలమైనదైనప్పటికీ, చేతనమను బీజమును తనయందే కలిగి ఉండుట దానిలోని విశేషము. అనగా ఒక సంకల్పము, ఒక స్పందన కలిగినదని అర్థము.

02/22/2018 - 00:49

భగవంతుడు అనంత కరుణాంతరంగుడు. భక్తులు ఏమడిగినా ఠక్కున నిండుగా దండిగా, మెండుగా ఇచ్చేస్తాడు. దయా సింధువు. భక్తులకు ఎప్పుడూ ఏదో ఒకటి ఇద్దామనే దయతో నిండి ఉంటుంది ఆయన హృదయం. అయితే భక్తుడు భగవంతుడ్ని అడగాలి. అడగగలగాలి. ఏమిటి అడగారో తెలుసుండాలి. భగవంతుడ్ని ‘‘వరం’’ అడగటమూ ఒక కళే. ఎందుకంటే ఏమి అడగాలో తెలియాలంటే మనకి ఏమి కావాలో పూర్తిగా తెలిసి ఉండాలి.

Pages