S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

02/20/2018 - 22:08

భారతీయ జాతీయతపై రామకృష్ణ పరమహంస ప్రభావం అపారం. హిందూమతంలోని మూఢనమ్మకాలు, అధిక సంప్రాదాయాలను కొంతవరకు తొలగించి, హిందూమతాన్ని ఇస్లాం, క్రైస్తవ మతాల సవాళ్లకు ధీటుగా నిలబెట్టిన మహనీయుడు రామకృష్ణుడు. అన్ని మతాల సారాన్ని ఆమూలాగ్రంగా ఆస్వాదించడం లక్ష్యంగా అవిరళ కృషి చేసి సిద్ధి పొందిన తాపసి ఆయన.

02/19/2018 - 22:21

అంతా భ్రాంతి యేనా అని ఏదో పాట ఉందికదా. నిజమే. అంతా భ్రాంతినే. మనమనడమే భ్రాంతి. మనమెవరము. శ్రీరమణులు నేను అంటే ఎవరో కనుగొను అసలు నిజం తెలస్తుంది అన్నారు. నేను అనేదేమిటో కనుగొనాలంటే మనకొక గురువు కావాలి. గురువులేనిదే ఆత్మ విద్య అలవడదు అని వేదం - గురోర్దర్శనం ముక్తిః అన్యథా ముక్తిర్నాస్తి అంది. అక్కడ నుంచి మొదలుపెడితే జాతి మత కుల వర్ణ విభాగాలన్నీ కూడా ఒక్కటే చెబుతున్నాయి. గురువు కృపా మహిమ కలవారు.

02/19/2018 - 22:20

ఇపుడు మనం చూసే విజ్ఞానమంతా కూ డా ఇంతకుముందు మన ఋషులు దర్శించి మనకు వేదంలో నిక్షిప్త పరిచిన సమాచారమే. ప్రతి కొత్త వస్తువుఆనవాలు తరచి చూస్తే మనకు ఋషుల వచనంలో వారు సిద్ధాంతరీకరించిన సూత్రాల్లో నిబడీకృతమై ఉంది. ఉదా: జలంలో అగ్ని ఉంది అని శాస్తవ్రేత్తలు కనుగొన్నారు. నిజమే. దానికి మూలం ఏమిటి అని ఆలోచిస్తే ‘అపోరాగ్ని’అన్నారు. అంటే నీటినుండి అగ్ని వచ్చింది.

02/19/2018 - 22:16

కేశవ
1.కేశవుని నామమే మనఃక్లేశహరము
పరమ పావన మాశ్రీత భక్త జనుల
కల్పవృక్షము పన్నగ తల్పు జూపు
అంజనము జపింయించుడీ కంజధరుని

నారాయణ
2.జీవనాధార మిలలోని జీవతతికి
నరయ నారాయణుండని నమ్మి హృదిని
నిముసమైనను మరువక నీరజాక్షు
దలచుచుండిన దాపుని నిలచి గాచు

02/19/2018 - 22:12

‘ఎవరెక్కువ’అనే మీమాంస ఇప్పటిదికాదు. ఎన్నాళ్లనుంచో ఎందరి మధ్యనో నలుగుతూనే ఉంది. ఎవరికి వారు మేమే అధికులం అని లౌకిక ప్రపంచంలో విర్రవీగే వారున్నారు. అన్నీ శాస్త్రాలు, పురాణాలు చదువుకున్న పండితుల మధ్య కూడా అహంకారం చోటుచేసుకొని మేమేక్కువ అనే అపోహ ఉంది.

02/16/2018 - 20:50

ఘనులంతా మొట్టమొదట గడ్డిపరకల కోసమూ తపించిన వారే. రామకృష్ణపరమహంస కూడా చిన్నతనంలో దారిద్య్రాన్ని చవిచూసినవారే. వారు పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీజిల్లా కామర్పుకూర్ అనే కుగ్రామంలో సాంప్రదాయ కుటుంబంలో క్షుధీరామ్, చంద్రమణీదేవి అనే దంపతులకుపుత్రుడయ్యారు. రామకృష్ణపరమహంస చిన్నప్పడు గదాధరుడు. ఈ గదాధరునిగా ఉన్నప్పుడు ఏ విషయాన్నైనా పరిక్షించి కాని నమ్మేవారుకారట.

02/15/2018 - 21:16

పుత్రుడంటే పున్నామ నరకం నుండి రక్షించువాడని అర్థం. కొడుకు మాత్రమే వంశాన్ని ఉద్ధరిస్తాడు. పుత్రసంతతి లేకపోయినా బిడ్డ కొడుకు శ్రాద్ధకర్మలు చేయడానికి అర్హుడే. బిడ్డ కొడుకుని ‘దౌహిత్రుడు’ అంటారు. ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువమంది కూతుర్లు ఉన్నట్లయితే పెద్ద కూతురు కొడుకు చేత కర్మకాండలు జరిపించాలి. ఇలా కర్మకాండలు చేసినవారికి ఆస్తిలో కొంత భాగం ఇవ్వవలసి యుంటుంది.

02/15/2018 - 21:00

బోధాయన మహర్షి: ఈయన ధాతు సర్వస్వమను గ్రంథమును రచించెను. ఈ గ్రంథము లోపలి రకముల ధాతువులను తయారుచేయు విధానము, ఆయా ధాతువులు లభించు గనులు, గనుల నుండి తీసిన ముడి ధాతువును శుద్ధి చేయు విధానము, గంధకము తయారుచేయు విధానము, అనేక రకముల విషయములు, వాటి దోష నివారణ పద్ధతులు, పాదరసోత్పత్తి మొదలగు విషయములు కలవు. వివరణాచార్యులు- ఈయన ‘లోకసంగ్రహము’ అను గ్రంథమును రచించెను.

02/14/2018 - 21:59

పిల్లలంతా ఒకటే. వారిలో హెచ్చుతగ్గులుండవు. పిల్లల్ని భగవంతుని రూపంగా భావిస్తాం. వారంతా కలసి మెలసి ఉంటారు. కాని, వారిలో తరతమ భేదాలను పెద్దలే సృష్టిస్తారు. పెద్దవారు చెప్పిన మాటలు విని పిల్లలు వారిలో వారు ఘర్షణకు దిగుతారు. మరలా వారికి పెద్దలే సర్దిచెబుతుంటారు.

02/13/2018 - 21:20

శివదర్శనం ముక్తిదాయకం. శివనామం కళ్యాణ కారకం. ‘శం’ అంటే మేలు అని అర్థం. ‘కర’ అంటే కూర్చువాడని అర్థం. ఎల్లరకూ మేలుచేయువాడు కాబట్టి ‘శంకరుడయ్యాడు’. శివ శబ్దం మంగళం, శాంతి, శుభం, క్షేమం అనే అర్థాలనిస్తుంది. ‘శివ’ శబ్దంలో, ‘శం’ అంటే నిత్య సుఖము, ఆనందము. ‘ఇ’ కారము పరమ పురుషుడు. ‘వ’కారము- అమృత స్వరూపిణి అయిన ‘శక్తి’. ఈ ముగ్గురి సమ్మేళనమే అనగా ఆనందమయమైన శివశక్తి సంయోగమే శివ శబ్దార్ధము.

Pages