S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

02/12/2018 - 22:19

ఎన్నో పుణ్యతీర్థాలు, పుణ్యక్షేత్రాలు వుండే భారతదేశంలో 12 ద్వాదశ జ్యోతిర్లింగాలు స్వయంభూగా వెలిశాయి. తేజోవంతమైన ఈజ్యోతిర్లింగాలు ఎంతో మహిమాన్వితం కలిగి వున్నాయి. దేశం నలుమూలలా ఈ జ్యోతిర్లింగాలు వున్నాయి. ఆంధ్ర రాష్ట్రంలోనూ ఒక జ్యోతిర్లింగం వుంది.
సోమనాధ జ్యోతిర్లింగం

02/11/2018 - 20:58

అన్నం పరబ్రహ్మాస్వరూపం. మానవులు జీవించాలంటే అత్యవసరమైనవి కూడు, గుడ్డ, గూడు ఈ మూడు ఉంటేనే జీవితం సజావుగా సాగుతుంది. పిపీలికాది బ్రహ్మపర్యంతమూ ఏదో ఒక ఆహారం తినందే బతుకు సాగదు. మనసుకు మంచి ఆలోచనలుంటే మానసికానందం కలుగుతుంది. మంచి ఆహారం తింటే ఆరోగ్యమూ కలుగుతుంది.
సస్యలక్ష్మిగా, ధాన్యలక్ష్మిగా, పౌష్యలక్ష్మిగా అన్నపూర్ణగా భావించి పూజించడంలోని అంతరార్థం మిదే.

02/11/2018 - 20:47

‘‘ఆదిభిక్షువువాణ్ణి ఏమి కోరేది? బూడిదిచ్చేవాణ్ణి ఏమి అడిగేది’’ అంటాడో సినీ కవి. నిందాపూర్వకగా శివతత్త్వాన్ని చెప్పే శివస్తుతి అది. జీవుడికి నిజంగా ఏది అవసరమైనదో ఆ స్థాయిని, స్థానాన్ని, ఆ విభూతిని, ఆ యోగాన్ని అందించేవాడు, అందివ్వగలిగినవాడు ఆ పరమశివుడు.

02/09/2018 - 21:01

రామాయణ, భారత, భాగవతాలు జాతి సంపదలు. యావత్ జాతికి దిశానిర్దేశం చేసే మార్గదర్శకాలు. మనిషి ఏ రకంగా జీవించాలి, ఏ రకంగా జీవించకూడదో, జీవితాన్ని ఏ రకంగా మలచుకోవాలో, జీవితంలో ఎలా మసలుకోవాలో, జీవితాలను ఏ రకంగా తీర్చిదిద్దుకోవాలో అనే విషయాల్ని విపులంగా సోదాహరణంగా వివరిస్తాయి. జాతిని జాగృతపరుస్తాయి.

02/08/2018 - 22:13

‘‘ఆవేశం విడువు ఆలోచన తో నడువు’’అని పెద్దలు చెబుతుంటారు. ఆవేశం వస్తే కోపం వస్తుంది. కోపం వివేకాన్ని నశింపచేస్తుంది. తన కోపమే తన శత్రువు అని శతకకారుడు చెప్పాడు. ఏ పురాణాన్ని చూసినా ఆవేశంతో చేసిన పనులు అనర్థదాయకాలుగానే కనిపిస్తాయి. అదే ఆలోచనతో చేసినవి అర్థానే్న కాదు పరమార్థాన్ని కూడా కలుగచేస్తాయి.

02/07/2018 - 21:37

మానవుడు తన ధర్మాన్ని చక్కగా నిర్వహిస్తూ ఉత్తముడుగా తయారుకావాలి. ధర్మాన్ని ఆచరించకుండా ఎనే్నళ్లు బతికినా అది వ్యర్థ జీవిత మే అవుతుంది. అంతేకాదు జీవితాన్ని వ్యర్థంగా గడిపితే పశువులకు మనుష్యులకు తేడాలేకుండా పోతుంది. కనీసం మనకున్న దానిలో కాస్త దానంచేయాలి. ధనం లేకపోయనా చేతనైనంత సాయం ఏదో ఒక రూపంలో చేయాలి. ఈ లోకానికి వచ్చేటప్పుడు ఏమీ తేకుండా వచ్చినవాళ్లు వెళ్లేనాడు కూడా ఏమీ తీసుకొని పోలేరు.

02/06/2018 - 22:06

ఇల్వలుడు, వాతాపి అను ఇద్దరు రాక్షసులుండేవారు. వారిద్దరు బ్రాహ్మణ వేషాలు వేసుకొని దారిన పోయే పండితులను, వేదాధ్యయన పరులను భోజనానికి పిలిచేవారు. అతిథి పూజ చేస్తేగాని మేము భోజనం చేయమనే నిబంధన మాకు పెట్టుకున్నాము. రండి రండి అని పిలిచేవాళ్లు. వీళ్లు చెప్పేది నిజమనుకొని బాటసారులు భోజనానికి వచ్చేవారు.

02/05/2018 - 21:14

గురువు అనుగ్రహాలు జలజలజారే జలపాతంగా ఉంటాయి. తేటతేనియ తీయందనాల్లా ఉంటాయి. తేనెలూరే తేట తెలుగు పదాల రసగుళికల్లా ఉంటాయి. కలకూజిత కోకిల రాగాల శ్రావ్యందనాలు, ముగ్ధమనోహర స్నిగ్ధ సౌందర్యాలు, సుధారస మధుహేళమూ సమ్మిళితమైన శ్రావ్యమైన సమ్మోహన రాగాల దివ్య సంగీత విభావరిలా ఉంటాయి. గురువు ప్రసంగాలన్నీ ఆత్మానందాన్ని కలిగిస్తాయి. ఆధ్యాత్మిక అమరసుఖాన్ని అందిస్తాయి.

02/05/2018 - 21:09

లంకాధిపతి రావణుడు. ముల్లోక వీరుడు. అందరినీ జయంచే వీరుడు. దేవతలుకూడా రావణుని ధాటికి తట్టుకోలేక గజగజలాడిపోతారు. వానరులు, మానవులు తప్ప మరెవ్వరి చేతిలోనుమరణం రాకూడదు అన్న వరం కోరుకున్నవాడు. కాని లంకారాజ్యంలో పటిష్టమైన రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసుకొన్నాడు. అంటే

02/05/2018 - 21:00

మానవత్వం మచ్చుకైనా లేకుండా పోతుంది. మమతానురాగాలు, మనిషిలో కరవైపోతున్నాయ. ఎక్కడ చూసినా అన్యాయాలు, అక్రమాలు. నేటికాలంలో దోపిడి ఎక్కువైందిబలహీనులను బల వంతులు కొట్టి తింటున్నారు. ఇలా ఎందుకు? జరుగుతోంది. మనిషిలోని భూతదయ కనిపించకుండా పోతోంది. సొంతలాభం కొంత మానుకు పొరుగువాడికి తోడుపడవోయ్ అనే ని నాదం ఇచ్చినవారు మన మధ్యలేరని వారి నినాదానికి తిలోదకాలు ఇచ్చేసినట్టు కని పిస్తున్నారు.

Pages