S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

07/13/2019 - 22:41

మెరపుల కొరడాల్ని ఝుళిపిస్తున్నాయి!... పిడుగుల్నీ, వడగళ్ళనీ, వర్షధారల శరపరంపరల్ని కురిపిస్తున్నాయి. ఒక యుద్ధవాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. రుధిరాన్ని క్రుమ్మరించినట్లుగా, కుండపోతగా వర్షిస్తున్నాయి!... యజ్ఞానికి విఘ్నం కల్పింప జూస్తున్నాయి!
అప్రయత్నంగా తన చేయి ధనుర్బాణాలపై బడింది. లక్ష్మణున్ని నిద్రలేపాడు.

07/13/2019 - 22:40

తన స్వయంవర మహోత్సవమునకు వచ్చిన పెక్కు రాజులను చూచుటయందలి నేడు కచేత పరాకు వహించి యుండెను. అందువలన ఆ కాశీరాజునకు భేదము గలిగించినది. అంత సరస్వతీదేవి దమయంతిని వేరొక్క నరదేవోత్తముని చూపి ఇట్లన్నది.
అయోధ్యాపతి

07/11/2019 - 22:43

దమయంతీ! శాంతి, దాంత్యాది గుణసంయమనములకు విశ్రాంతి ధామమైన (విశ్రమించునట్టి ఇల్లు గృహము) ఈ ‘‘అవంతి’’ పతియందు (ఈ మాళవ దేశపతి యందు- ఉజ్జయిని రాజధాని) నీ అంతరంగమందు అనురాగము మొలచెనేని- ఈ ఉజ్జయిని వద్దనున్న ‘‘శిప్ర’’అనే నదియందు జలవిహారము ఒనరించుటకు వీలగును. ‘‘మహాకాళము’’ఉజ్జయిని యందలి శివక్షేత్రము. ఇందలి వృషభ ధ్వజుడైన పరమశివుని భుజింపుము ఇది ఒక పుణ్య అవకాశము.

07/11/2019 - 22:35

ఎంత విచిత్రం?... నిజానికి ప్రతిమనిషీ ఒక యజ్ఞపురుషుడే!...అతనిలోనూ ఒక నిరంతర యజ్ఞ ప్రక్రియ!... అది ఆగితే ప్రాణం ఆగినట్లే!... ప్రాణం ఆగిపోతే సృష్టి స్తంభించినట్లే!... నిజానికి చలనమే జగత్తు!... విశ్వమే ఒక మహాయజ్ఞశాల!...జీవితమే ఒక యజ్ఞం!... ఎంత చిత్రాతిచిత్రం!...
ఇంతలో ఒక తార రాలిపోయింది ఒక గగన కుసుమంలా!... మళ్ళీ నిశితంగా పైకి చూశాడు.

07/11/2019 - 22:26

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం:
డా పాలకోడేటి జగన్నాథరావు 9490620512
*

07/11/2019 - 22:25

ఆషాఢ శుద్ధ ఏకాదశిని ‘‘మహా ఏకాదశి’’యని, ‘‘ప్రథమైకాదాశి’’యని వ్రతోత్సవ చంద్రిక పేర్కొంటున్నది. చాతుర్మస్య దీక్షా దినాల ఏకాదశులలో మొదటిది కావడం చేత ‘‘తొలి ఏకాదశి’’గా నామాంతరం గలదియైనది. ప్రథమైకాదశి అను సంస్కృత నామాన్ని బట్టి, తెలుగువారు తొలి ఏకాదశిగా వ్యవహరిస్తున్నారు. ఉత్తరాయణం కంటె దక్షిణాయనంలో పండువలు, పబ్బాలు అధికం.

07/10/2019 - 18:43

తిథులన్నింటిలోను ఏకాదశి తిథి చాలా పవిత్రత చేకూరింది. దీనికి కారణం ఒకసారి మహావిష్ణువు మురాసురుడు అనే రాక్షసుడితో పోరుకు సిద్దమయ్యాడు. అతడు చ లా బలవంతుడు. అతడితో యుద్ధం చేస్తూ కొంత తడువు గరుడవాహనారూఢుడైన మహావిష్ణువు పడు కున్నాడట. అపుడు ఆయన శరీరం నుంచి ఒక అద్భుత సౌందర్యవతి వెలువడింది. ఆ స్ర్తిమూర్తి మురాసురునితో యుద్ధం చేసి విజయం సాధించింది. యుద్ధం తరువాత మహావిష్ణువు మేల్కాంచాడు.

07/10/2019 - 18:40

ఎంత వైవిధ్యభరిత మీ సృష్టి!...
ప్రతి నక్షత్రమూ ఒక మహాగ్నిగోళమే! భూమికి అనేక రెట్లు! అనేక పిల్ల నక్షత్రాలు!... ప్రతి పిల్లనక్షత్రమూ ఒక సూర్యుడే!... ప్రతి సూర్యుడూ ఒక వీరుడే!... విశ్వకల్యాణ మహాయజ్ఞంలో ఒక సమిధే!...

07/09/2019 - 19:34

చేత ఢమరుక మ్రోగంగఁ జెలువ మీర
సకల భయములు దొలగిపోసాగునయ్య
అభయమిచ్చెడి సంకట హర హర భవ!
పాహిమాం పరమేశ్వరా! పార్వతీశ!
భావం: శంకరా! నీ చేతియందు అందంగా ఢమ
రుక మ్రోగితే మాలోని భయాలన్నీ తొల
గిపోతాయి. అభయమిచ్చెడి వాడవే కాదు
సకల పాపాలను హరించే వాడవు నీవే హరహరా!
శివశివా! యనఁజిత్తాన ఁచింత తొలగు
హరహరా! యన హర్షాన నడ్డుదొలగు

07/09/2019 - 19:31

ఆ పూట సాత్వికాహారాన్ని మాత్రమే స్వీకరించి, మునుల మధ్య మునుల వలె ఉండిపోయారా సోదరులు.
ఆ దినమే శుభదినమని యజ్ఞదీక్షను గ్రహించి, వౌనవ్రతంలో మునిగాడు మహర్షి.
పూలు రాలిన వేదికపై పూలలా ముడుచుకొని, ఆ రాత్రి అక్కడే విశ్రమించారు ఆ రామలక్ష్మణులు.
మహాస్వప్నం

Pages