S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

07/08/2019 - 18:31

వాళ్ళు ఆ చెట్ల నీడలో నడుస్తోంటే, చల్లచల్లని గాలి వీచింది. పూలు కురిశాయి. పచ్చిక మేస్తోన్న జింక పిల్లలు పరుగుపరుగున వారి వద్దకేతెంచాయి. నెమళ్ళు పురులు విప్పి ఆనంద తాండవం చేశాయి.
మునికన్యలు వారికెదురు వచ్చి, వాళ్ళ కాళ్ళు కడిగి, మెత్తని పొడి వస్త్రాలతో తుడిచారు. కర్పూర హారతులతో ఆహ్వానం పలికారు. మధురమైన ఫలాలనీ, పానీయాల్నీ అందించారు.

07/08/2019 - 18:30

‘వ్యాసం వసిష్ఠ నప్తారం శక్తేః పౌత్రమ కల్మషం
పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిథిమ్’

07/07/2019 - 23:04

‘‘ఇదియె విష్ణుపదము నాకు! ఇదియె బ్రహ్మపదమును!
నేనే బ్రహ్మమ్మునౌచు- వెలుగుదునే నిచటను!’’

అనుచు రాజు సంతసించె
పాతాళము నేలుకొనుచు.

07/07/2019 - 23:02

నీవు ఇంద్రాది దేవతలు కలిసియే నా స్వయంవర ప్రదేశానికి విచ్చేయండి.
‘‘ఓ మనుజేశ్వరా! ఆ స్వయంవరములోనే, ఇంద్రాదిదేవతల సమక్షంలోనే పురుషశ్రేష్ఠుడవైన నిన్నునేను వరిస్తాను. అలాంటప్పుడు ఏ దోషము ఉండదుగదా? కాబట్టి నీవు ఏమాత్రము సంకోచించకుండా తిరిగి వెళ్ళగలవు అని నా ప్రార్థన’’అని పలికింది దమయంతి.

07/07/2019 - 23:00

పుణ్య మూర్తులఁ దిట్టంగఁ బుట్టినట్టి
బుద్ధిఁ గల్గిన వారితోఁ బుడమి తల్లి
కంటఁ గనే్నరు కాల్వలు గట్టెనకట
చూడుమో కర్మసాక్షి యోసూర్యదేవ
భావం: అయ్యో! పుణ్యమూర్తులైన పెద్దలను తిట్టే కు సంస్కృతి కల్గిన వారితో పుడమి తల్లి కార్చే కన్నీరు కాల్వలు గట్టిందే. కర్మసాక్షివైన ఓసూర్యదేవ! చూడవయ్య.
చిత్తమందునఁ దనభార్య చిత్తమందు
సంతతియుఁదాను నితరుల సరకు సేయఁ

07/05/2019 - 19:00

ఏమి కాంతి? ఏమి కాంతి? ఏమి కాంతియో అయ్యది?
ఏమి రాగమేమి రాగ? మేమి రాగమో అయ్యది?

తొడవులు మెరసిన యట్టుల ఒడలెల్లను మెరిసెను
తానే హరిపదములందు తొడవై భాసిల్లెను.

ఒక విద్యుత్ప్రవాహమ్ము- అణువణువున ప్రాకెను
ప్రత్యణువును పులకించుచు- వరదలెత్తి పోయెను.

కరముల పాదముల కడుగుకానీ రుూ లోకము
తలతో పాదమును కడుగు భాగ్యము బలికబ్బెను.

07/04/2019 - 18:34

అందుచేత నీ దౌత్యాన్ని మేము కోరుచున్నది. ఇది దేవతల మేలుకొరకైన కార్యం. నీవు దీనిని తప్పక నెరవేర్చితీరాలి!’’ అని దేవతలు పలుకగా
‘‘ఆయుధాలు ధరించిన భటులు బాగా కాపాడుచున్న రాజుగారి అంతఃపురం ఎలా ప్రవేశించటానికి వీలవుతుంది.’’అని నలుడు ప్రశ్నించాడు.

07/04/2019 - 18:33

బలితలపై మోపుటకై వామనుడెత్తెను పాదము
అది పాదమ్మన నొప్పునె? అభయామృతహస్తము.

ఒక కుంకుమ రాశి యనగ- ఒక పగడపు దీవి యనగ
ఒక మంగళహారతి యన- దివ్యాంగన చెక్కిలియన

ఒక ఎర్రని మణులరాశి- ఒక పెదవుల రాగమ్ము
ఒక దివ్వెల తోరణమ్ము- ఒక చందన సౌందర్యము

ఒక మణిమయ విలాసమ్ము- ఒక బంగరు కిరీటమ్ము
ఒక తేజోపుంజమ్ము- అనదోచెను పాదమ్ము.

07/03/2019 - 19:25

భూమండలంలోగల స్ర్తిలందరినీ దమయంతి తన రూప సంపదచే మించిపోయింది.

07/03/2019 - 19:24

‘ఆగుమాగు మోయి స్వామి! ఆగుమింక స్వామీ!
ఈ భక్తుని కరుణించగ ఇంతటి శ్రమయేల స్వామి?

ఇరుపదముల నిహపరముల నాక్రమించినావు స్వామి!
నా తలయే మూడవదగు అడుగు నిడుడు స్వామీ!

చీమకడకు కొండవోలె నీవు వచ్చినావు స్వామి!
చీమకు కైలాస శిఖర మేవిధి కనబడు స్వామీ!

నీ రూపును నేజూడగ సాధ్యవ్మౌ నాకెట్టుల?
నా కన్నులనావ లోన నీ కన్నుల జేరుటెటుల?’’

Pages