S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

06/14/2019 - 19:46

చదువుకున్నట్టి వారిని సరకుగొనక
భజనఁ చేతురు చవటల పంచఁ జేరి
బుద్ధియై పోయెఁ జూడంగ బురదపాలు
చూడుమో కర్మసాక్షి! యోసూర్యదేవ!

భావం: చదువుకున్న జ్ఞానవంతులను ఏ మాత్రం లెక్కచేయకుండా చదువుకోని సంపన్నులైనట్టి వారి చుట్టూ భజనపరులుగా చేరుతూ ఉంటారు. అలాంటి వాళ్ల బుద్ధి కాస్తా బురదపాలైపోయిందికదా. కర్మసాక్షివైన ఓ సూర్యదేవా! చూడవయ్య!

06/13/2019 - 18:23

నిదురనైన మేల్కొనుచును సేదదీరె రాముడచట
నిదురకె కావలి యనంగ మేల్కొనె సౌమిత్రి యచట.

‘మినుకు మినుకు’మను తారక కునికి నటుల కునికె వౌని
అది కునుకో మెలకువయో అరయునొక్క విపినమ్మే.

‘తెలతెల్లగ తెలవారెను-దిక్కుల సింగార మొలికె!
దివ్య కార్యములు సేయగ-లేలెమ్మా! నరసింహమ’’!

అనుచు లేపె కౌశికుండు
లేచిరి సోదరులు

06/13/2019 - 18:21

ప్రతులకు
7-8-51,్ఫ్లట్ నెం. 18, నాగార్జున సాగర్‌రోడ్, హస్తినాపురం, సెంట్రల్ కాలనీ, ఫేజ్ -2 హైదరాబాద్- 500079
============================
వేగముగా ఎవరో తరుముచున్నట్లు అస్పష్టముగా ఉచ్చరించినచో ఫలితముండదు, ధ్యానము కుదరదు. అట్లే మంత్రముపై శ్రద్ధపెట్టక, యథాలాపముగా, స్వరబద్ధత లేకుండా మనసు మంత్రముపై నిలుపక మంత్ర జపము చేయుటవలన ఏకాగ్రత కలగదు సరిగదా విపరీత పరిణామములేర్పడును.

06/12/2019 - 19:45

నదలు వరదలవుచు వారి పదములనే చేరెనో!
పరవళ్ళనుదేలి వారి పదములు పయనించెనో!

ఒక పరి మునితో సమముగ- ఒక పరి మున్ముందున
ఒక పరి వెనుకనె వత్తురు- వివిధ గతులు వారివి.

తార వెంట రవిచంద్రుల తీరు వారు సాగిరి!
వినువీధుల సాగినట్లు వౌని వెంటనే గిరి!

భూత భవితముల నడుమను వర్తమాన మేగినటుల
నడిచె వౌని వారి నడుమ ఒక వెలుగుల పుంజమటుల.

06/12/2019 - 19:41

భగవంతుడి నిర్ణయాలు, మనుషుల కర్మ ఫలాలు కలిసింది మానవ జీవితం. జీవితంలో కొన్ని సుఖాలు మరికొన్ని దుఃఖాలు ఉంటా య. దుఃఖం కలిగినపుడు వెంటనే భగవం తుడిని స్మరిస్తారు. ఈ కష్టాలు దాటించమని మొక్కుబడులు మొక్కుకుం టారు. అదే సుఖాలు కలిగినఫుడు భగవంతు డిని అనుకొనే వారు బహు తక్కువ మంది ఉంటారు. స్థిత ప్రజ్ఞత కలిగిన వారు మాత్రమే ఇదంతా భగవంతుని అనుగ్రహం అనుకొం టారు.

06/11/2019 - 19:03

కొడుకు మీది ప్రేమతోడ కర్తవ్యము మరచితిని
ముదిమియందు మునిగి నేను- మూర్ఖుడనై పోతిని.

నే తండ్రిని రామునకు- నా తండ్రియొ మరి యొక్కరు
కాని మీరొ లోకమ్మన తండ్రులకే తండ్రులు.

మీ బిడ్డను మీ వెంటను- అనుపుటకభ్యంతరమే!
మీ యిష్టం వచ్చినప్పుడు- అంపుడి నా సమ్మతమే!’’

అనగా విని ఆ మహర్షి- అమితానందమ్మందెను
అభయహస్తమును బట్టెను- ఆశీస్సుల నిచ్చెను.

06/11/2019 - 18:59

దశమి తిథితో సంబంధ పడి మనకు రెండు పెద్ద పండువలు ముఖ్యమైనవి. ఒకటి జ్యేష్ఠ శుద్ధ దశమి కాగా, మరొకటి విజయ దశమి. రెండూ పదిరోజులు పర్యాప్తమయ్యే పాడ్యమి తిథులతో ప్రారంభమై, దశమితో ముగిసే పర్వాలు. జ్యేష్ఠ మాసారంభంలో శుక్ల పక్ష ప్రతిపద నుండి దశమి వరకు గంగోత్సవాల పేరుతో నవరాత్రులు ఆచరించడం, ‘‘దశపాపహర దశమి’’గా దశమిని, అనంతరం ‘‘నిర్జల ఏకాదశి’’ని అనుసరించడం సనాతన సంప్రదాయం.

06/10/2019 - 22:04

భగవంతుని తత్వం తెలుసుకొంటే మనిషి మాయలో పడిపోడు. ఎవరిపైనా రాగద్వేషాలు కాని, మమతానురాగాలు కానీపెంచుకోడు. ఈ లోకంలో కనిపించేదంతా అశ్వాశతమని శాశ్వతమైంది కేవలం భగవంతుడని పురాణాలు, వేదాలు ఘోషిస్తున్నాయి.

06/10/2019 - 22:03

అతడొసగును అస్తమ్మ్రుల- అతడొసగును శస్తమ్మ్రుల
అతడు తెలుపు రహస్యముల- రాముండౌ లక్ష్మణుండు.

తన సర్వమ్మిచ్చి తాను- శూన్యవౌట కెంచె వౌని
రామునిలో తన్నుతాను చూచుకొనగ నెంచె వౌని.

ఇది విద్యాభ్యసమ్మని అనువుమతని మునితోడను
నీకె కాదు లోకాలకు కల్యాణమ్మగును.

రామాయణ రచన సేయ నెంచెగాని వాల్మీకి
రాముని రచనను సేయగ నెంచె కౌశికుండు.’’

06/10/2019 - 22:01

‘‘ఏమిటోయి నరోత్తమ! ఏమిటి నీ తీరులు?
రాజునంచు విస్మరించి పామరువలె పలుకులు?

ఏమనెనో కౌశికుండు?- ఏమనెనో వింటివే?
అక్షర లక్షలు మాటలు- అర్థమెంతొ కంటివే?

వృక్షమ్మే చేయిచాచి- ఫలము నడిగి కొనినట్టుల
క్షేత్రమ్మే చేయి చాచి- అన్నమడిగి కొనినట్టుల.

నోరు విడిచి మేఘమ్మే- నీరమడిగి కొన్నట్టుల
అంప మంచు నీ కొడుకును- అడిగె కాదె వౌని?

Pages