S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీవిరించీయం

09/16/2018 - 22:19

మనకు తెలుగులో అనేక రకాల కథలు- ప్రణయం, ప్రళయం, సాంసారికం, సమానత్వం- మున్నగు వాటిని వివరించి చెప్పేవి వున్నాయి గాని ప్రాంతీయత సంతరించుకున్న ఇతివత్తాలతో కూడిన కథలు తక్కువ. అమరావతి కథలు (శంకరమంచి సత్యం), గోదావరి కథలు (బి.వి.ఎస్.రామారావు,) కృష్ణాతీరం కథలు (పోలవరపు కోటేశ్వరరావు) వంటి కొన్ని వేళ్లమీద మాత్రమే లెక్కించగల కథా సంపుటాలు కనిపిస్తాయి.

09/02/2018 - 22:42

కళింగాంధ్ర కథలు పేరుతో చాగంటి సోమయాజులు గారు చాలా సంవత్సరాల క్రితం కొన్ని కథలు సేకరించి ప్రచురించారు. ఆ పుస్తకం అనేక పునర్ముద్రణలు కూడా పొందింది.

07/01/2018 - 22:08

‘షెడ్డులోపల పరిస్థితి చూస్తే లోపలెవరో ఆడ మనిషి ముఖంమీద పైట చెంగు కప్పుకుని గచ్చుమీద వళ్లు తెలియని నిద్రపోతోంది. రేకుల పైకప్పుకోసం ఉపయోగించిన ఇనుప పైపులతోబాటు ప్రత్యేకంగా యేర్పాటుచేసిన మరికొన్ని పైపులకూ గోడల చుట్టూ యేర్పాటుచేసిన పెద్ద పెద్ద చిలక్కొయ్యలకు యాదగిరి గుడిలో వేళ్లాడగట్టిన కొబ్బరికాయల మాదిరిగా తెల్లగుడ్డలు వేళ్లాడ గట్టిన వందలకొద్దీ మట్టిముంతలు కన్పించాయి..

06/24/2018 - 21:42

‘ఆమె ముఖంలో ఎలాంటి భావం కనబడడం లేదు. ఏడ్చి ఏడ్చి ఏడ్చి కన్నీళ్లు కూడా కరువయినట్లు బాధపడి, బాధపడి మనసు మొద్దుబారినట్లు, మెదడుమీద బండెడు బరువుమోపితే ఆలోచన కోల్పోయినట్లు, దేన్నిచూసినా చలనం లేని దానిమల్లే ఆమె వుంది. లచ్చమ్మ దుకాణంముందు నిల్చుని ఆ స్ర్తి.... ఆమె ముఖాన బొట్టులేదు. ముక్కుకు ముక్కుపుల్ల మాత్రం వుంది. మాసిపోయిన పూల పూల చీర కట్టుకుంది. అది అడ్డదిడ్డంగా వుంది.

06/17/2018 - 21:32

‘ఎంత గాఢ నమ్మకం మీ అందరికీ నేను జీవితంలో చాలా కష్టపడ్డానని. ఆనంద్ రోజుకు పదిసార్లయినా అంటాడు- మా అమ్మ కష్టపడిందని! శ్రీ్ధర్ చనిపోయాడని తెలిసినప్పుడు మొదటిసారిగా షాకింగ్‌గానే అనిపించింది. కాని నేను వెంటనే తేరుకున్నాను. నన్ను నేను కష్టపెట్టుకోగూడదనీ, ఒకరు సానుభూతి చూపేటట్లుగా వుండగూడదనీ అనుకున్నాను.

06/10/2018 - 21:27

‘అంజనమ్మ కూతురు పార్వతి. ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకుకు జన్మనిచ్చిన పార్వతి అర్థాంతరంగా పాము కాటుతో తనువు చాలించింది. కూతురు చావుకు వచ్చిన అంజనమ్మ పిల్లల్ని చూసుకోవడం కోసం వుండిపోవలసి వచ్చింది. అంతవరకు హంసాపురంలో చిన్నకొడుకు దగ్గర వుండేది’- ఆచార్య ఎం.కె.దేవకి రాసిన ‘జంతువు’ అనే కథానికకు భూమిక యిది.

06/03/2018 - 22:16

‘పుట్టింటికి వెళ్లి డబ్బు తీసుకురమ్మనమనీ, లేదంటే వదిలేస్తాననీ శారదని అప్పుడప్పుడూ బెదిరించేవాడు. అభిమానవతి అయిన శారద పుట్టింటికి ససేమిరా వెళ్లనని మొండికేసింది. అలా అయితే విడాకుల పత్రం మీద సంతకం చేయమని వేధిస్తున్నాడనీ, తనకి చనిపోవడంకంటే మరో మార్గం లేదనీ చివరిసారిగా కలిసినపుడు శారద మా ఆవిడతో చెప్పింది..’- ఈ మాటలు శారద పొరుగింటి ఆసామీ నోటినుంచీ జారుతాయి.

05/27/2018 - 21:26

‘తన ధ్యేయం ఒక్కటే. కొడుకును తన పనులు తను చేసే స్థాయికి తేవడం. దీనికోసం ఎన్ని సుఖాలనయినా త్యాగం చేయటానికి సిద్ధపడ్డాడు ఆనంద్. అతనితోపాటు అతని భార్య జయశ్రీ. కాలచక్రగమనంలో మరో రెండు సంవత్సరాలు దొర్లిపోయాయి. గిరీష్‌లో మార్పు రాలేదు. కాకపోతే వెస్టరన్ మ్యూజిక్ మాత్రం వినేవాడు. అతని గదిలో ఇరవై నాలుగు గంటలూ టేప్ రికార్డర్ పనిచేస్తూ వుండాలి. ఆగితే అతనికి కోపం వస్తుంది.

05/21/2018 - 20:54

‘విజయపురి రాజావారికి సంక్రమించిన సంపత్తి అంతా ఇంతా కాదు.. జమీందార్లకుండే సహజ వ్యసనాలతోపాటు పులివేటలు, తెల్లదొరలకు విందులు, విదేశీ యాత్రలు, గుర్రపు పందేలు అంటే విజయపురి రాజావారికి అపరిమితమైన మోజు. అవసరాలకుగాను ఓ మామిడితోటను అమ్మకానికి పెట్టారు. ఈ అమ్మకం విషయంలో ఎస్టేట్ సూపర్‌వైజర్ శివరావుగారు రామచంద్రయ్య అనే కొనుగోలుదారును తీసుకువచ్చి పరిచయం చేశాడు’.

05/13/2018 - 21:55

‘ప్రభుత్వోద్యోగం నిర్వహిస్తున్న మనిషి తన బాధ్యత తీర్చుకోవడంలో మామూలు ప్రజానీకంతో కర్కశంగా వుండనక్కరలేదు. సరళంగా, సజావుగా మాట్లాడుతూనే తన ధర్మాన్ని నిర్వహిస్తూ ఇతరులకూ నియమ నిషేధాలు మనసుకు అర్థం అయ్యేట్లుగా చెప్పవచ్చు’- అన్న విషయాన్ని ప్రస్తావిస్తూ గుండు సుబ్రహ్మణ్య దీక్షితులు గారు రాసిన కథానిక ‘‘్భరత మహిళా జోహార్’ సరళ జీవనాన్ని గురించి హితోపదేశం చేస్తుంది.

Pages