S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీవిరించీయం

05/06/2018 - 21:35

‘మాత్రలు యిస్తాను, పదిహేను రోజులు వాడండి. తరువాత ముఖ్యవిషయం- ఫర్‌గెట్ ఎవెరిథింగ్ ఎబౌట్ యువర్ హార్ట్.. ఎనిమిది వారాలపాటు రోజుకు మూడు గ్లాసుల పళ్లరసం, రెండు పూటలా కప్పు మజ్జిగ అన్నం తినండి. గో టు భిమిలి ఏ కామ్ ప్లేస్. మీ అడ్రస్ ఎవరికీ తెలియనివ్వకండి. మీ భార్యనూ తీసుకువెళ్లండి మీతో. టేక్ కంప్లీట్ రెస్ట్. నాలుగు వారాల తరువాత నా దగ్గరకు మళ్లీ రండి. మాత్రలు వేసుకోవడం మరచిపోకండి’- ఇదీ ప్రిస్కిప్షన్.

04/29/2018 - 22:50

ఛ..ఛ.. చదివించి ఉద్యోగం చేసుకోమంటే యింత బరితెగింపా? ఇదేం ఫారిన్ అనుకుంటున్నావా? లివింగ్ టుగెదర్లు చేస్తూ వుంటే చుట్టూ జనం వూరుకోవటానికి, మీ మామయ్య చెబుతోంటే తల ఎత్తుకోలేకపోయాం. ఎవరన్నా ఏమనుకుంటారన్న భయమన్నా లేకుండా యింత తెగింపా?’- ఈ మాటలు అంటున్న ఆడపిల్ల తండ్రి శ్రీహరి మొహం కోపంతో, అవమానంతో ఎర్రబడింది.

04/22/2018 - 22:08

‘ఇరవై వసంతాల క్రితం వరదల్లో కొట్టుకపోయి, చనిపోయిందనుకున్న తన నాలుగేళ్ల కూతురు బ్రతికి బట్ట కట్టడమేమిటి? అదే కూతురు ఈ విశాల ప్రపంచంలో ఎవరూ లేనట్టు తన కొడుకును ప్రేమించడమేమిటి? అందరి పేరెంట్స్‌లా కాకుండా తమ కులం, గోత్రం కూడా చూడకుండా సంస్కారంతో పెళ్లి చేయడం ఏమిటి? ఇవన్నీ ఏమిటి?’

04/15/2018 - 22:14

‘కడుపు నింపుకోవటానికి చిలువలు పలువలుగా సినిమాను వర్ణించి చాటింపు వేశాడు వాడు. ఒళ్లు గుల్లచేసుకుని కడుపుమాడ్చుకుని (సినిమా చూడటానికి తాపత్రయపడ్డాడు తాను). ఇదే రాములు తన రోజంతా గడిపిన కాలక్షయాన్ని గమనించి తెలుసుకున్న సత్యం.

04/08/2018 - 21:21

‘నారిగాడి చేత వౌనంగా తాళి కట్టించుకున్న ఆమెను చూసి ఎవరూ జాలిపడలేదు. మనసులోని హేళనను మాటలలో వెళ్ళగక్కారు. కనకానికి దగ్గరి సంబంధం నారాయణ. విరిసీ విరియని మనసులో వాడి చేయినందుకుని ఏడు అడుగులు వేసింది. నిజానికి నారాయణతో పెళ్లి ఆమెకు ఇష్టంలేదు. వాడు మంచివాడు అవడంవల్లను, ఆమె అంటే యిష్టం కావడంవల్లనో, పైసా కట్నం లేకుండా చేసుకున్నాడు. అది తనింట్లో దీపం వెలిగిస్తే చాలని మొహమటం లేకుండా ఊరంతా చాటాడు’.

04/01/2018 - 22:05

స్ర్తి పురుషుల మధ్య శృంగార భావము తప్పకయుండును. అది జంతువులనన్నింటియందు ఉన్నది. అసలీ శృంగార భావము లేకున్న సృష్టి జరగదు. ఇది ఈ సృష్టికి అవసరమయిన ప్రక్రియ... ఆస్తి వ్యవహారము వచ్చినది. సమిష్టి ఆస్తి కాక వ్యక్తుల ఆస్తి వచ్చెను. మాతృస్వామ్య వ్యవస్థతో మొదలయి నెమ్మదిగా పితృస్వామ్య వ్యవస్థ వచ్చెను.. ఆ కుటుంబ వ్యవస్థ పటిష్టపరచుటకే స్ర్తికి శీలమను ఆభరణము తొడగబడెను..

03/25/2018 - 21:29

‘అసలు చదువుకోకుండా కవిత్వాన్ని వెక్కిరించేవాళ్లు లేరూ! విద్య వేయి విధాలగు రావచ్చు. జ్ఞానం రావాలంటే సంస్కారం పరిపక్వం అవాలి. జ్ఞానం ఎంత ఉంటే అంత సహృదయం వుంటుంది. సహృదయులకే సత్య గ్రహణమూ సదభిప్రాయమూ వుంటాయి. మూకాభిప్రాయాలు మందికోసం. మంది బుద్ధికి స్థిరత్వం లేదు. చంచలానికి అంజలి చేసేకన్నా ముంజలమ్ముకోవడం మంచిది’ అంటాడు ‘రావు’ అనే మిలటరీ ఆఫీసర్. ఆయన చిలకపూడి జమీందారుకు తమ్ముడు.

03/18/2018 - 21:30

‘అలవాటు లేని నడక. అల్లంత దూరంలో చెరువు. ఆడదాని చెరువు. దానికాపేరు ఎందుకు వచ్చిందో తెలియదు. పాతికేళ్ల కిందట ఎట్లా తుమ్మలు పెరిగి, నీళ్లు ఎండి, విశాలంగా, కొంగల్తో, కాకుల్తో కళకళలాడేదో ఇప్పుడూ అట్లాగే. ఎంతోకాలం నుంచి తనకోసం ఎదురుచూస్తున్నట్లు ‘ఉత్తతోత’ అంటూ ఒక పిట్ట ఎగిరిపోయింది. కట్టకు దిగువ దూరంగా తుళ్లూరు కనబడుతుంది.

03/11/2018 - 21:08

‘‘అడపా తడపా పడ్డ తొలకరి జల్లుల మధ్య, కాలువలు కొత్త నీరోసుకుని నిండుగా వచ్చాయి. మొగి పొలాలకు దిగువ ఆకుమళ్లకి నీళ్లు వొదిలారు. మొగిమళ్లు అల్దాపల్టాగా తడుస్తున్నయ్. కొంగలు బారులు తీరి మునక్కుండా మిగిలి వున్న గడ్డల మీద కూర్చుని, నీటిలో తేలే పురుగుల్ని తింటున్నాయి. తెల్లటి ఎండా, నల్లటి భూమాత పనులు కొడుతున్న నీళ్లూ కొండలూ, గాలీ... అన్నీ ఒక విచిత్రమైన వాతావరణాన్ని కల్పించాయి.

03/05/2018 - 02:13

‘శంకరం సన్నగ వుంటాడు. చక్కు దవడలు, సూదిముక్కు, కళ్ళద్దాలు అతని రూపు. ఒక్క లుంగీ మీద వున్నప్పుడు అతని వెనె్నముక, పూసలు పూసలుగా స్పష్టంగా కనిపిస్తుంది. వాటిని తడిమి లెక్కపెట్టుకోవచ్చు. వనజాక్షి కాస్త లావుగా వుంటుంది. ముక్కు చిన్నది, కళ్లు పెద్దవి. ఆమె మీద అతడు బక్కగావుంటాడు. ఆమె చెంతనతను ఆడ కలెక్టర్ దగ్గర అష్టదరిద్రాలూ ఓడుతున్న బంట్రోతులా వుంటాడు’.

Pages