S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

10/13/2019 - 22:18

ఇక రామానుజల వారి (1017-1137) సిద్ధాంతము విశిష్ఠాద్వైతము. వారి సిద్ధాంతము ప్రకారము 1. పరమాత్మ, 2. జీవాత్మ, 3. ప్రకృతి. ఈమూడును నిత్యములు. సత్యములు.

10/13/2019 - 22:17

తే.గీ. అన్నమో రామచంద్రాయనంగలార్చు
వారికన్నమ్ము పెట్టిన ఫలమునెన్నఁ
చరమ యున్నమ్ముతోఁ దృప్తిఁ దలుపఁ తరమ!
చూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

10/11/2019 - 19:54

వేదములను విభజించి సమస్త లోకమునకు హితమొనర్ప వేదవ్యాసుడవతరించి ఈ భువిని పావనము చేశాడు. ‘కృష్ణద్వైపాయనం వ్యాసం సర్వలోక హితేరధమ్, వేదాబ్జ భాస్కరం వనే్ద శమాది నిలయం మునిమ్’, ‘విస్తారో విగ్రహో వ్యాసః’ (అమరం). విస్తారం అంటే విశేషముగా కప్పుకొనుట. విగ్రహః అంటే విశేషముగా గ్రహిచుట. ఆ విస్తారము శబ్ద సంబంధమైనపుడువిస్తరమనబడును (వాచాం విస్తరః).

10/10/2019 - 19:43

శ్లో॥ అనాహతాబ్జ నిలయా శ్యామాభావదన ద్వయా
దంష్ట్రోజ్జ్వలా క్షమాలాది ధరా రుధిర సంస్థితా॥
కాళరాత్య్రాది శక్త్యౌ ఘవృతా స్నిగ్ధౌదన ప్రియా
మహావీరేంద్ర వరదా రాకిన్యంబా స్వరూపిణీ॥
కొట్టకుండానే శబ్దం వచ్చే చోటు కావున అనాహతమని పేరు వచ్చింది. అంతఃకరణ అని కూడా అంటారు. శ్రీ చక్రంలో సర్వసౌభాగ్యప్రద చక్రావరణ లేక మన్వస్రము అంటారు. 14 కోణాములు కలిగినది. ఇది రుద్ర స్థానం.

10/07/2019 - 19:56

2019 సెప్టెంబర్ 27న ఢిల్లీలో 30 దేశాలకు చెందిన 50 మీడియా సంస్థలు 80 మంది పాత్రికేయులతో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ సర్‌సంఘ సంచాలకులు మోహన్‌జీ భాగవత్ రెండున్నర గంటల ఇష్టాగోష్టి కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమంలో మోహన్‌జీ భాగవత్ ‘‘హిందుత్వం అనేది భారతీయ సాంస్కృతిక విలువల సారాంశము; విభిన్న విశ్వాసాలున్న ప్రజలమధ్య సోదరభావాన్ని పెంపొందించటమే దాని లక్ష్యం.

10/06/2019 - 21:36

‘శమీ శమయతే పాపం
శమీ శత్రు వినాశనీ
అర్జునస్య ధనుర్థారీ

10/06/2019 - 21:34

భువనేశ్వరీమాత గొప్ప ఇల్లే మణిద్వీపం
బ్రహ్మలోకంపై సర్వలోక నివాసస్థానం మణిద్వీపం
త్రిలోకాలలో లోకం కన్నామించిన సుందరలోకంలేదు
అక్కడే చల్లగా సుఖంగామనుగడ బ్రహ్మాండాలన్నింటికీ

ఇనుప, కంచు, సీసం, ఇత్తడి, పంచలోహ
బంగారు,పుష్పరాగ రత్నపద్మరాగ వజ్ర ప్రాకారాల మధ్య
చింతామణి గృహం శ్రీదేవీ దివ్య మందిరం
శ్రీమాత శ్రీచక్రాకారంలో అమ్మవారి దివ్య ప్రకాశం

10/06/2019 - 21:28

తే.గీ. ఉట్టిఁ గట్టును కలకాల మూగ్గులాడఁ
బోరు! కోపతాపంబుల జోరుఁ జూపి
యేమి సాధింతురో గదా! యేమి ఘనత?
చూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

10/04/2019 - 18:49

త్రిమతాచార్యులలో మూడవ వారై, హనుమంతుడు, భీముడు, అనంతరం వాయుదేవునకు తృతీయ అవతారంగా భావించే మధ్వాచార్యులు ద్వైత మత బోధకులు. ఆయన సాంప్రదాయాలను పాటించే వారిని మాధ్యులు లేదా మధ్వమతస్తులు అంటారు.

10/03/2019 - 19:06

శ్రావణ భాద్రపదాలవి
ఏవో పలువిధములైన ఇబ్బందులు తె
చ్చే వర్షర్తువు ముగిసెను
ఈ వేల్టితో శరతువచ్చియిడు బహుసుఖముల్

ఎన్ని వత్సరాల్గడిచెనో ఎంచుటకయి
ఋతువులు వసంత శరతులన్ ఎంచురీతి
తెలుగు సంప్రదాయమునందు తెలిసినదియె
అట్టి శరతుకాలమున కాహ్వానమనెద

దేవీ నవరాత్రులలో
కోవెలలన్ దేవిపూజ కోలాహలముల్
దేవతలే దిగిరాగా
పావిత్య్రత పంచ శరతుప్రారంభమగున్

Pages