S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

03/19/2020 - 05:13

తే.గీ బుద్ధి కొరవడ దుర్మార్గపుం బనులకుఁ
బూనుకునువారలధికులై పుడమినంతఁ
బట్టి కుదిపేయు వారలఁబట్టి కఠిన
శిక్షలను వేయ మున్ముందుఁ జేయఁబోరు
చూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవా!

03/18/2020 - 21:53

తే.గీ వెతలనొందెడి వారికీవేగ బంధు
వన్నను స్నేహితుడవన్న వరమువన్న
నట్టివారికి సకలమ్ము నరయనీవె
చూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!
భావం:ఎన్నో బాధలు పడేవారికి బంధువువన్నా, స్నేహితుడవన్నా, అలాంటివాళ్ల పాలిటి వరానివన్నా ఒక్కమాటలో చెప్పాలంటే అంతా నీవే అయిన ఓ కర్మసాక్షీ! సూర్యదేవా! ఆదుకవయ్యా ప్రభూ!
తే.గీ ఎన్నియో సమస్యలతోడ నెల్లజనులు

03/17/2020 - 23:23

లబోదిబో ప్రొడక్షన్స్ వారి అబ్బో అబ్బో
- షణ్ముఖశ్రీ - 8897853339
*
ఏ.వి.: మాక్కూడా చాలా ఆనందంగా ఉంది. వెదకబోయిన తీగ కాలికి తగిలినట్లు మీరు దొరకడం మా అదృష్టం. మా సినిమా ఆరంభమైనట్లే.
హీరో: మీ సినిమా ఆరంభం కావడం మంచిదే కానీ ఇంతటితో మమ్మల్ని వదిలేయండి. మీ సినిమాలో మమ్మల్ని మాత్రం హీరో, హీరోయిన్స్ చేయకండి. ఆ బాధలు మేం పడలేం. మమ్ముల్ని ఇలా బతకనివ్వండి.

03/17/2020 - 23:22

నమ్రత్వేనో న్నమన్తః పరగుణ కథనైః
స్వాన్గుణాన్ఖ్యాపయంతః
స్వార్థాన్యం పాదయంతో వితత పృథు
తరారంభయత్నాః పరార్థే.....
క్షాన్యైవాక్షేప రూక్షాక్షర ముఖర
ముఖాన్దుర్జనాన్ దుఃఖయంతః
సంతస్సా శ్చర్య చర్యా జగతి బహుమతాః
కస్వ నాభ్యర్చనీయాః

03/17/2020 - 23:17

తే.గీ. సూర్యదేవర! నీ నామ శూలఘాత
ములకు ఁ గులాశే 3వైరసుమూక2 లొక్క
పెట్టునం జోద్యముంగాదు విశ్వమందుఁ
జూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

భావం: కర్మసాక్షివైన ఓ సూర్యనారాయణమూర్తీ! స్వామీ! నీ నామమనే శూలఘాలకు వైరసు మూకలన్నీ ఒక్కసారిగా కూలిపోతాయనడంలో ఆశ్చర్యపడవలసిన దంటూ ఏమీ లేదుగా ప్రభాకరా!

03/16/2020 - 22:49

లబోదిబో ప్రొడక్షన్స్ వారి అబ్బో అబ్బో
*
- షణ్ముఖశ్రీ - 8897853339
*
సెనక్కాయ: (తనలో) దొంతూ దొందేలే ! సెనక్కాయలండీ సెనక్కాయలు.
ఏ.వి: నవ్వితే నవ్వాడులే! ఎప్పటికైనా నవ్విన నాపచేను పండదా. ఏంటీ!

03/16/2020 - 22:48

అనేక సంవత్సరాలుగా మానవ హక్కులకు దూరంగా ఉంచబడిన పీడిత జనులను విముక్తిచేయడానికి డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ తన జీవితం చివరి వరకు కృషిచేస్తే, ఆయన వారసత్వాన్ని అందిపుచ్చుకుని మరణించేవరకు పోరాడిన గొప్ప యోధుడు కాన్షీరామ్. పీడిత జనులను పాలకులుగా చూడాలనుకున్న అంబేద్కర్ కలలను నిజం చేసినవాడు కాన్షీరామ్.

03/17/2020 - 00:05

తే.గీ హెచ్చుతగ్గులు మనకేల? హీనమవియు
నవయవములన్ని దేహికి నవసరమ్మె;
దేని ప్రాశస్త్యమద్దానికేను సుమ్మి
చూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!
భావం: హెచ్చుతగ్గులు అనే భేదభావం ఎంతో హీనమైనది. అవయవ ప్రాశస్త్యం అనేది దేహానికి ఎంతో అవసరం కదా! దేని ప్రాశస్త్యం దానికున్నపుడు ఈ రకమైన భేదభావాలు సరికావని కర్మసాక్షివైన ఓ సూర్యదేవా! ఈ లోకానికి ప్రబోధించు స్వామీ!

03/14/2020 - 23:26

లబోదిబో ప్రొడక్షన్స్ వారి అబ్బో అబ్బో
*
- షణ్ముఖశ్రీ - 8897853339
*
జయ: అయితే పాత వాసనలున్న నేను కూడా నీదారికి రాందే సినిమా తీయలేనంటావ్. మరైతే అర్జంటుగా రచయితను చూడు.
ఏ.వి.: ఓ రచయితను చూశాను. అతనేమన్నాడో తెలుసా?
జయ: ఏమన్నాండేంటి?

03/14/2020 - 23:21

తే.గీ. చెడు గుణంబులు మనదరిఁ జేరకుండ
నప్రమత్తతయుం గల్గి నడచుకొనగ
వలయు లేనిచోఁ దలవంపు భారమగును
చూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

భావం: చెడుగుణాలు మనలో కలగకుండా ఎంతోఅప్రమత్తతో నడచుకోవాలి. చెడుగుణాలు కానీ మనలో చేరితే అంతకుమించిన తలవంపు భారమై జీవితాలు దుర్బరవౌతాయని కర్మసాక్షివైన ఓ సూర్యదేవా! ఈలోకానికి తెలియుజేయుమయ్యా దినకరా!

Pages