S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

01/25/2020 - 22:10

భారత గణతంత్ర దినోత్సవం
భారత రాజ్యాంగం అమలుకు
శ్రీకారం చుట్టినరోజు

భారత గణ తంత్ర దినోత్సవం
ప్రతి ఏటా రంగరంగవైభవంగా
జరుపుకునే జాతీయ పండుగిది

మన భారతం ప్రియభారతం
నవభారతం ప్రగతి భారతం

ప్రజాతంత్ర పాలనలో
మరో నూతనాధ్యయనం

జాతీయ సమైక్యతా సందేశం
సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య

01/25/2020 - 22:09

వాసవీ దేవి అగ్ని ప్రవేశం చేసి, నేటికి 1000 సంవత్సరాలు గడిచాయి. వాసవీ మాత మాఘ శుక్ల పక్ష విదియ శుక్రవారం శతభిష నక్షత్రం రోజున ప్రాయోపవేశం చేసినట్లు పురాణ కథనం. దుష్టులను శిక్షించి, శిష్టులను రక్షించడమే జగజ్జనని4కన్యక22 అవతారం. బ్రహ్మ, విష్ణు, మహేశ్వర త్రైమూర్త్య దేవతలకు మూల కారణమైన భువనేశ్వరీదేవిని వాసవీ కన్యకా పరమేశ్వరీ రూపమున పూజించడం సదాచార పరంపరగా కొనసాగుతున్నది.

01/25/2020 - 22:04

తే.గీ వంగుచున్నట్టి మొక్కల బాగుఁగోరి
చక్కగను దరిఁ జేతురాసక్తి తోడఁ
గన్నకొడుకులు చెడి పోవ ఁ గావఁ బోరె
చూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

01/23/2020 - 23:00

సారవంతమైన సుక్షేత్రంలో నాణ్యమైన రసాలపు విత్తనం పడితే.. అది మధుర రసఫలాలు అందించే మహావృక్షం కావటంలో ఆశ్చర్యం ఉండదు కదా.
అలాంటి కూచిపూడి సుక్షేత్రంలో, నాట్యకుటుంబాల్లో ప్రముఖులైన ‘పసుమర్తి’ వారింట ప్రభవం - ఓ సుకృతం!
నాట్య వేదాంతాలనాసాంతం ఆస్వాదించి, తాండవ లాస్య ప్రతీకలైన పార్వతీశ్వరుల పేరు దాల్చిన నాట్యఋషులు బ్రహ్మశ్రీ వేదాంతం పార్వతీశం గారి శిష్యరిక భాగ్యం పొందటం ఓ మహాద్భాగ్యం.

01/23/2020 - 22:57

హైందవ సాంప్రదాయంను అనుసరించి ప్రతి మాసానికి ఒక విశిష్ఠత ఉంది. మాఘ ఫాల్గుణాలు శిశిర రుతువులో ఉంటాయి. సంవత్సరంలో పదవ మాసమూ, హేమంత రుతువులోని రెండో మాసమూ అయిన పుష్యం తెలుగు వారికి శూన్యమాసం. సంవత్సరంలోని నాలుగవ మాసమూ, గ్రీష్మ రుతువులోని రెండవ మాసమూ అయిన ఆషాఢం కూడా తెలుగు వారికి శూన్యమాసమే. శూన్య మాసాలు శుభ శోభనాలకు పనికిరానివి.

01/23/2020 - 22:51

తే.గీ. తల్లడిల్లెడి వారల యుల్లములకు
దూరటయుఁ గల్గ ఁ జేయంగ నుంటి మనుచు
నొక్క యడుగైనఁ గదపరే యుర్వికేల?
చూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

భావం: అనేకానేక సమస్యలతో తల్లడిల్లిపోతున్న దీన జనాల మనసులకు ఊరట కలిగించడానికి మేమున్నామంటూ ఒక్క అడుగైనా కదపని వారు ఈ భూమికి ఎంతో భారమన్న సత్యాన్ని కర్మసాక్షివైన ఓ సూర్యదేవా! ఈలోకానికి ప్రబోధించు స్వామి.!

01/23/2020 - 00:10

నేడు ఉమర్ ఖయ్యామ్ జయంతి
*

01/22/2020 - 22:41

పుష్య కృష్ణ అమావాస్యను చొల్లంగి అమావాస్య అంటారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడకు దక్షిణంగా యానాం రోడ్డుమీద మూడు మైళ్ళ దూరాన ‘చొల్లంగి’ అనే గ్రామం ఉంది. గోదావరి ఏడు పాయలలో ఒకటైన ‘తుల్యభాగ’ ఇక్కడ సముద్రంలో కలుస్తుంది. జీవనదియైన గోదావరి పాయల్లో ఒకటి సాగరాన్ని సంగమించే చోటు కావడం వల్ల ఇక్కడ స్నానం చేస్తే, నదిలో, సముద్రం లోనూ ఏకకాలంలో స్నానం చేసిన విశేష ఫలం పొందుతారు.

01/22/2020 - 22:30

తే.గీ. పెద్దవారనుభవముల విస్మరించఁ
బోకుమవి దివ్య పథముల నీకుఁజూపు
నెల్లవేళల నినుఁగాయ నిలఁ గనంగ
జూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

భావం: పెద్దల అనుభవాలను తేలికగా కొట్టిపారేయరాదు. వారి వారి అనుభవాలు తేజోవంతమైన బ్రతుకు బాటలు నీకు చూపిస్తాయి. నినె్నల్లవేళలా కంటికి రెప్పలా కాపాడేవి పెద్దల అనుభవాలేనని కర్మసాక్షివైన ఓసూర్యదేవా! ఈలోకానికి ప్రబోధించు స్వామి.

01/22/2020 - 06:35

తే.గీ. బాహ్య సౌందర్యమది యేల? ఫలితమెన్న
శూన్యమగు ఁగానఁ జూడంగ సొంపు మీరు
నదియు నాత్మ సౌందర్యమ్ము ; హృదయ పద్మ
వికసితంబైన నద్దాని విలువ పేర్మి
చూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

Pages