S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

03/13/2020 - 06:24

లబోదిబో ప్రొడక్షన్స్ వారి అబ్బో అబ్బో
- షణ్ముఖశ్రీ - 8897853339
*
జయ: కొత్తదనం కొట్టొచ్చినట్లు కనబడుతోంది. ఆ ! అటు చూడు సెనక్కాయలవాడు వస్తున్నాడు. సెనక్కాయలు తింటూ కథా చర్చ మొదలుపెడదాం.
సెనక్కాయలవాడు: సెనక్కాయలండీ! సెనక్కాయలు!
వీరిద్దరూ సెనక్కాయలు తీసుకొని తింటుంటారు.
ఏ.వి.: వీడ్నీ మధ్య ఎప్పుడూ ఇక్కడ చూడలేదే! సెనక్కాయలు బాగానే ఉన్నాయ్

03/13/2020 - 06:23

నేడు రాయప్రోలు సుబ్బారావు జయంతి
*

03/12/2020 - 23:29

తే.గీ. శారదామాత కృప తోడ సద్వివేక
భావ సంపత్తి నొందితిఁ బ్రజ్ఞ మెఱయ
మనుజ గణములలోపాలు మాన్పునటుల
జూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

భావం: శ్రీ శృంగేరి శారదాంబ కృపారసం నాపై కురిపించటం వల్ల సద్వివేక భావ సంపదను ఎంతగానో పొందగలిగాను. ప్రజ్ఞాపాటవాలను కలిగియుండి మనుషులోని లోపాలను తొలగించగలిగేలా కర్మసాక్షివైన ఓసూర్యదేవా నన్ను దయతో చూడవయ్య ప్రభూ!

03/11/2020 - 22:52

లబోదిబో ప్రొడక్షన్స్ వారి అబ్బో అబ్బో
*
- షణ్ముఖశ్రీ - 8897853339
*
పాత్రలు - పాత్రధారులు

1. నిర్మాత కావాలనుకుంటున్నవాడు : జయరావు
2. స్నేహితుడు, సలహాదారుడు : ఏ. వి.రావు
3. హీరో : నో ఇస్ర్తి
4. హీరోయిన్: నో వస్ర్తి
5. సెనక్కాయలవాడు : పార్కులో
సెనక్కాలయలమ్మేవాడు

03/11/2020 - 22:46

తే.గీ. క్షమకు మించిన దే యలంకారమవని
లేదు దానితో వెలుగొందురే జనంబు
లట్టి వెలుగును శ్లాఘింతురనఘులంచుఁ
జూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

భావం: ఓర్పును మించిన అలంకారం ఎక్కడాలేదు. ఆ అలంకారంతోనే భూప్రజలంతా ఎంతగానో ప్రకాశిస్తారు. అట్టి క్షమాలంకార భూషితులే గొప్ప పుణ్యాత్ములని అంతా కొనియాడతారన్న సత్యాన్ని కర్మసాక్షివైన ఓ సూర్యదేవా ఈలోకానికి ప్రబోధించుము తండ్రీ.

03/10/2020 - 22:50

విఘ్నేశ్వరుని విడాకులు
*
- షణ్ముఖశ్రీ - 8897853339
*
విఘ్నే; ఏముంది మీవారు మరో పిల్లతో కాపురం చేస్తున్న సంగతి మీకు తెల్సిపోయింది.
మీన: నేను మిమ్మల్ని ప్రశ్నించానే కానీ అలా అని నేనేమీ చెప్పలేదే.
విఘ్నే: అయితే మీది అన్యోన్య దాంపత్యం అన్నమాట.
మీన; ఏం దాంపత్యంలేండి
విఘ్నే: ఏవిటమ్మా! అలా పథ్యం చేసిన మనిషిలా అయిపోయావ్

03/10/2020 - 22:45

తే.గీ. సంస్కరించుకుఁ దిరుగాడ సత్ఫలితము
లెన్నియోఁ గల్గు సందేహమేల? యటులఁ
గాని పక్షానఁ జెడిపోదురే! నిజమ్ము
చూడుమో కర్మసాక్షి!యోసూర్యదేవ!

03/09/2020 - 22:40

విఘ్నేశ్వరుని విడాకులు
*
మీన: మీ ధోరణి చూస్తుంటే మీరు నాటకాల్లో కూడా మంచి అనుభవం ఉన్నట్లుంది.
విఘ్నే: అవునవును. ఈరోజుల్లో నాటకాడాడేదే ప్లీడర్లు. ప్లీడరు గుమాస్తాలు. అయితే ఎక్కువగా పౌరాణికాలే ఆడుతుంటాం. రాగాలాపనకు అలవాటు పడ్డవాళ్లం.
మీన : ఆలాపన లేకుండా ఆడకూడదా.

03/09/2020 - 22:29

తే.గీ. కళలు దేశాభుయదయమును ఁ గాంచవలయు
నపుడు దాటికి స్థారకమబ్ము ఁ గాద
సార్ధకత లేని యవియేల? శంకయేల?
చూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

భావం: కళలు దేశాభ్యుదయానికి ఎంతగానో దోహదపడాలి. అప్పుడే ఆ కళలకు సార్థకత చేకూరుతుంది. సార్థకత ఏర్పడనపుడు ఆ కళలు నిష్ప్రయోజనములే అనడంలో అనుమానం లేదన్న సత్యాన్ని కర్మసాక్షివైన ఓ సూర్యదేవా! ఈ లోకానికి విశదీకరించుమయ్యా విభావసా! (సూర్యుడా)

03/08/2020 - 23:31

ఫాల్గుణ శుక్ల పూర్ణిమను ‘హోలికా’, ‘హోళికాదాహో’ అనే నామాలతో పేర్కొంటున్నది స్మృతి కౌస్త్భుం. ‘హుతాశనీ పూర్ణిమ’, ‘వహ్న్యుత్సవం’ అని అమాదేర్ జ్యోతిషీ; ‘లక్ష్మీనారాయణ వ్రతం’, ‘అశోక పూర్ణిమా వ్రతం‘, ‘శయన దాన వ్రతం’ చేయాలని పురుషార్థ చింతామణి; ‘శశాంక పూజ’ చేయాలని నీలమత పురాణం వివరిస్తున్నాయి. కొన్ని గ్రంథాలు ‘డోలా పూర్ణిమ’ అని చెపుతున్నాయి.

Pages