S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

02/17/2020 - 22:30

బంధం అనేది మిథ్య అని అందరికీ తెలుసు. ఈ జగత్తు మిథ్య. జగన్నాథుడే నిత్యమూ సత్యమూ అనీ తెలుసు. కానీ మనస్సు ఏ బంధంలోనైనా చిక్కుకుంటే దాన్నినుంచి విడివడడమనేది చాలా కష్టం. అందులో పుత్రవ్యామోహం, కళత్ర వ్యామోహంలో మనుషులు చిక్కుకుంటేనే సంసారం సాగరం అయిపోయింది. గుదిబండగా మారిపోతుంది. దాన్నుంచి ఎంతకీ బయటకు రాలేరు.

02/17/2020 - 22:23

తే.గీ. ఎదుటి వారభిప్రాయాల నెఱిగి వాటి
నెంతయో గౌరవించని నిన్ను గౌర
వించవలెనని ఁ దలచుట నెంచ ఁ దగదు
చూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

02/17/2020 - 00:08

ప్రపంచంలో ఎన్ని విలువైన వస్తు సంపదలున్నా అవి ఏవీ కాలం ముందు ఎందుకూ సాటిరావు. ప్రపంచాధినేతలైనా, కోట్లకు పగడలెత్తిన సంపన్నులైనా కాలాన్ని తాము అనుకున్న రీతిలో సాగించలేరు. అందుకే ఓడలు బండ్లు అవుతాయ. బండ్లు ఓడలు అవుతాయ. ఎవరి కర్మానుసారం వారికి కాలం వారి జీవితాన్ని నడుపుతుంది.

02/17/2020 - 00:06

కోరికలు అనేవి మానవునిలో సహజంగా కలుగుతుంటాయ. కాని, కోరికలను నశింపచేసుకోవాలని గీత చెబుతుంది. ఈ కోరికలను జయించడం అంత సులభం కాదు. చివరకు తపస్సుకు ఉపక్రమిం చిన వారు కూడా కోరికలను పూర్తిగా త్యజించడం లేక పోయన వాళ్లు కనిపిస్తారు. కాని ఈ కోరికలను దూరం చేసుకోవలన్న ఈ ప్రయత్నం నిరంతరం వ్యాపకం కావాలి.లేకపోతే కోరికలనేవి అక్షయపాత్ర లాగా ఒకదాని తర్వాత పుడుతూనే ఉంటాయ.

02/16/2020 - 23:55

తే.గీ. ధెర్యమందింప నిలువని తనువదేలా?
ప్రేమగనుఁ బల్క రించని పెదవదేల?
మంచిపనులనుఁ జేయని మనుగడేల?
చూడుమో కర్మసాక్షి!యోసూర్యదేవ!

02/15/2020 - 22:08

పురాణాల్లో, ఉపనిషత్తుల్లో, కావ్యాల్లో, ప్రబంధాల్లో ఇలా వేటిలోనైనా భగవంతుని ఆరాధన, లేక భగవంతుని అనే్వషణ, భగవంతుని గురించి కథలు ఏవో ఒకటి ఏదోఒక చోట వస్తూనే ఉంటాయ. రామాయణ కథలేని కథలే లేవు అంటారు. ఎన్నో వేల యేండ్ల క్రితం వచ్చిన మహాభారతం లో ఇప్పటి కలియుగ నైజం కూడా కనిపిస్తూనే ఉంటుంది. కలియుగం లో కనిపించేవన్నీ విషయాలు మన కు భారతంలో ముందే కనిపిస్తాయ అంటారు. ఇది అంతా ఎందుకు అంటే ఉన్నది భగవంతుడు ఒక్కడే.

02/15/2020 - 22:05

తే.గీ. పచ్చిమిరపనుఁ గారమ్ము వదలిపోయె
బెండలో జిగురుండదీ వింతఁ గనుమ
నాటి రుచులను ఁ గనరాని నాళ్లు వచ్చెఁ
జూడుమ కర్మసాక్షి! యో సూర్యదేవ!

భావం: పచ్చిమిరపకాయలు కారంగా ఉండడం లేదు. బెండకాయల్లో సహజ సిద్ధమైన జిగురుండడం లేదు. ఆనాటి రుచులు కనబడకుండా పోయేరోజులొచ్చేసాయి. కర్మసాక్షివైన ఓసూర్యదేవా!స్వామీ చూస్తున్నావుకదయ్యా ఈ విడ్డూరం!

02/15/2020 - 22:13

ఓ అజ్ఞాన రాశీభూతమా!
ఓ ఆలోచనా తత్పరా...
నీవు సౌందర్యారాధకుడవని భ్రమిస్తున్నావా...
ధవళకాంతివనవిహారం
చేయాలనేది నీది ఉత్సుకతా...
నీ ఎదరొదలో వేదనా గాథలా...
చిమ్మచీకట్లా.... మధురగీతులా..
ఏవి ఎందున్నాయ...?
నీలో ఉన్నధి నిశాంధకార నిర్నీతి
నీలో అస్కన్నము కావాలి తేజోరాశి
నికనైన వదిలించు మలిన ఆలోచనా పరంపర
ఉంకించు నిక శే్వతాంబరవీధిన

02/13/2020 - 23:50

మనస్సును, బుద్ధిని నియంత్రించి కామాన్ని జయించాలి. కామ శత్రు విజయమే కైవల్యం. ఆత్మానందం పొందటమేగమ్యం. కైలాసం పోనవసరం లేకుండా ఆ ఆనంద చిన్మయ స్థితిని అనుభవించవచ్చు ఇక్కడే.

02/12/2020 - 22:41

‘సర్వధర్మాలనూ వదిలివేసి ననే్న శరణు పొందు’- అని గీత చెబుతోంది. వదలటం అంటే ఈశ్వరార్పితం చేయమని చెబు తున్నారన్నమాట. కర్మను ఈశ్వరునికి అర్పితం చేస్తే చేస్తున్న కర్మ ధర్మబద్ధమా కాదా అన్న ప్రశ్న ఉదయించదు. భగవత్పరమైన కర్మ ఎప్పుడూ ఆమోదయోగ్యమే అవుతుంది. ‘్ధర్మాలను విడిచిపెట్టు’ అనటంలో ‘విచ్చలవిడిగా ప్రవర్తించు’ అని అర్థంకాదు. నిష్క్రియత్వంతో అనీ కూడా కాదు.

Pages