S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

02/04/2020 - 23:23

తే.గీ. కబురులేవియు నింపవు కడుపు నచుఁ
గదలిపోవలె జనులు లో కానఁగాంచఁ
గరగిపోయెడి కాలానఁ గబురులేలఁ
జూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

02/03/2020 - 23:05

శోభ, విలాసము, గాంభీర్యము, లాలిత్యము, మాధుర్యము, స్థైర్యము, తేజస్సు, ఔదార్యము, సౌకుమార్యము- అన్నీ ఒక రాశిగా పోస్తే- లలితా పరమేశ్వరీ రూపం. భవ భయ బాధలను తొలగించి, భవాన్ని విభవంగా రూపుదిద్దగల మహాశక్తి స్వరూపిణి శ్రీ లలితా పరమేశ్వరి.

02/03/2020 - 23:03

తే.గీ. నిలుపుకొనవలె మాటను ఁ దలుపఁ దప్ప
కూడదెన్నడు దప్పిన ఁగువలయాన
బ్రతికియుండిన భూదేవి బాధపడును
చూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

భావం: ఆడిన మాట నిలుపుకోవాలే గానీ, ఎన్నడూ తప్పకూడదు. ఆడినమాట తప్పి బ్రతుకీడ్చే వారిని కూడా మోయాల్సి వస్తుందని భూదేవి ఎంతగానో బాధపడుతుందని కర్మసాక్షివైన ఓ సూర్యదేవా! మాట తప్పడమంటే మహాపాపానికి ఒడిగట్టడమే నని చెప్పు తండ్రీ!

02/02/2020 - 23:30

ఒకసారి ధర్మరాజును భీష్ముడు తమ రాజ్యంలో వెతికి ఎక్కడైనా చెడు గుణాలతో ఉన్న వాడు ఉంటే తీసుకొని రా అని పంపించాడట. ధర్మరాజు రోజంతా తిరిగితిరిగి ఉత్తిచేతులతో వచ్చాడట. ఏమిటి అని అడిగితే ఎవరినీ చూసినా వారిలో ఏదో ఒక మంచిగుణమే కనిపిస్తోంది. నాకు చెడ్డవాళ్లు అనే వాళ్లు నాకు కనిపించలేదు అని చెప్పాడట. అట్లానే ఈసారి దుర్యోధనుడిని పిలిచి నీకు ఎవరైనా మంచివాళ్లు అని అనిపిస్తే తీసుకొని రా అని చెప్పి పంపించాడట.

02/02/2020 - 23:25

తే.గీ. శ్రీనిథుల ఁ గోరెదరు చూడరేబవళ్లు
శ్రీలు సర్వస్వమనియోతురేల? జనులు
శ్రీల మోహానఁబడినంత ఁ జిక్కులొదవుఁ
జూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

02/01/2020 - 22:09

34బ్రహ్మ స్వరూప ముదయే మధ్యాహ్నేతు మహేశ్వరః
అస్తకాలే స్వయం విష్ణుః త్రరుూ మూర్తి దివాకరః22

02/02/2020 - 22:05

మాయణాచార్యులు వారి శ్రీమతి సనాతన ధర్మాన్ని ఆచరించేవారు. వారికి సాయణులు, మాధవుడు, భోగనాథుడు అనే ముగ్గురు కుమారులు కలిగారు. వారికి జాతక కర్మలు చేయించారు. కాలానుక్రమంగా శాస్త్భ్య్రాసానికి కూడా శ్రీకారం చుట్టారు. మాయణాచార్యుల దగ్గరకు ఎక్కడెక్కడి నుంచో విద్యార్థులు శాస్త్ధ్య్రాయనానికై వచ్చేవారు.

01/30/2020 - 22:44

తే.గీ. వ్యసనముల బారినంబడి యధికమైన
ఘోరయిక్కట్ల పాలయి కూలి పోవ
నేమి సాధింతురో గదా! నిలువలేకఁ
జూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

01/29/2020 - 22:52

‘‘చంద్రికా చంద్రవదనా తీవ్రా మహాభద్రా మహాబలా భోగదా భారతీ భామా గోవిందా గోమతీ శివా’’ అని ‘‘వాగేశ్వరీ, వాగ్వాదినీ, మహాసరస్వతి, సిద్ధసరస్వతి, నీలసరస్వతి, ధారణ సరస్వతి, నకులీ సరస్వతి, పరాసరస్వతి, బాలాసరస్వతి’ అనే రూపాలుకలిగిన శ్రీ సరస్వతీ దేవిని ఆరాధించిన వారికి సకల విద్యలూ కరతలామలకం అవుతాయ.

01/29/2020 - 22:50

‘గాంధీజీ లాంటి వ్యక్తి ఈ భూమిపై రక్తమాంసాలతో నడిచాడంటే భవిష్యత్తు తరాలవారు నమ్మరేమో!’’అంటూ ప్రసిద్ధ శాస్తవ్రేత్త అల్బర్ట్ ఐన్‌స్టీన్ వ్యాఖ్యానించాడు. నేడు గాంధీజీ బొమ్మ కరెన్సీ కాగితాలకే పరిమితం అవడం చూస్తుంటే ఆ వ్యాఖ్యలు నిజమేనని అనిపించక మానదు. గాంధీజీని ‘అర్ధనగ్న ఫకీరు’’ అని ఇంగ్లాండు మాజీ ప్రధాని విన్‌స్టన్ చర్చిల్ పరిహసించినా కృంగిపోలేదు.

Pages