S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయిన్ ఫీచర్

03/25/2019 - 22:27

ఆయన పేరు వినగానే సాహితీ లోకంలో అంతో యింతో పరిచయమున్న ప్రతివాడికీ వెంటనే ఒక నిండైన విగ్రహం, ఏమాత్రం అహంకారం గానీ, అనవసరపు అభిజాత్యం గాని లేని వ్యక్తిత్వం, నందివర్ధన పుష్పంకన్నా తెల్లనైన, అమాయకమైన నవ్వు, ‘అర, శ్రుతికన్నా పెంచకుండా మృదువుగా, మధురంగా మాట్లాడే నైజం, అన్నిటికన్నా మించి అపారమైన స్నేహ వాత్సల్యాలతో సాగించే సాధు భాషణం- యివన్నీ మన ముందు తళుక్కున ప్రత్యక్షవౌతాయి.

03/18/2019 - 21:58

కందుకూరివారు సైన్స్ కూడా రాశారా? - అనే ప్రశ్న ఎదురుకావచ్చు. అది ప్రశ్నించినవారి పొరపాటు కాదు. వీరేశలింగంగారు విజ్ఞాన సంబంధమైన రచనలు కూడా చేశారని పెద్దగా ప్రచారం లేదు. మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా ప్రహసనాలు రాశారు కనుక సైన్స్ రచయితగా పరిగణించి ఉండవచ్చు అని కూడా ఉజ్జాయింపులు వేసి ఉండవచ్చు. నిజానికి వారు తొలి తెలుగు సైన్స్ రచయిత కూడా! అందులో సందేహం లేదు.

03/11/2019 - 02:06

ఈ భూగోళంమీద మానవుడి మనుగడ మాసిపోకుండా ఉండాలంటే పర్యావరణాన్ని పాడుచేయకుండా ఉండాలి. ప్రకృతి సంపదను నాశనం చేయకుండా పరిరక్షించి భావితరాలకు అందించడమే భవిష్యత్తు తరాలకు నేటితరం వారసత్వంగా ఆత్మజ్ఞానంతో బహుకరించే వరంగా భావించాలి. ప్రకృతి సంబంధం లేకుండా మానవుడి ఉనికి మనలేదనేది సత్యం. పర్యావరణాన్ని ధ్వంసం చేస్తూ నూతన సమాజ నిర్మాణాన్ని కాంక్షించడం నేల విడిచి సాము చేసినట్లుగానే ఉంటుంది అనడం యధార్థం.

03/04/2019 - 23:56

తెలుగు సాహిత్యంతో అంతో యింతో పరిచయమున్న ప్రతి వ్యక్తికీ ‘నోరి’ అనే యింటి పేరు వినగానే వెంటనే తళుక్కున మదిలో ఒక బ్రాహ్మీమయమూర్తి, సదాచార సంపన్నుడు, పరిపూర్ణ జీవనుడూ, గొప్ప చారిత్రక నవలలను తెలుగు ధాత్రికి అందించిన శ్రీ నరసింహశాస్ర్తీగారే మెదులుతారు. ‘నోరి’వారు వృత్తిరీత్యా న్యాయవాది అయినా ప్రవృత్తిరీత్యా గొప్ప సాహితీవేత్త.

02/24/2019 - 21:30

1990 నుండి తెలుగు సాహిత్యంలో నూతన వెలుగులు ప్రసరించాయి. 1980-90 దశాబ్దం విప్లవ, స్ర్తివాద, సాహిత్య దశాబ్దం అని పిలుచుకుంటే 1990-2000 దశాబ్దం దళిత బహుజన, స్ర్తివాదం, సాహిత్య దశాబ్దం అని చెప్పవచ్చు. సామాజిక తాత్విక, సాహిత్య విమర్శ రంగంలో 1985 కారంచేడు ఉద్యమం నుండి అనేక మార్పులు జరిగాయి. కొత్త చూపు ప్రసరించింది.

02/17/2019 - 23:28

పఠాభి అనగానే ‘్ఫడేల్ రాగాల డజన్’తోపాటు ‘కయిత నా దయిత’ కూడా చెప్తారు. పన్‌చాంగమ్ సరే. నిత్య నూతన ప్రయోగాలను ఇష్టపడే తిక్కవరపు పట్ట్భారామారెడ్డిని కేవల ఛందోరీతుల బందోబస్తులను కాదని భాషారీతులను ఎలా వాడేడో చెప్పడంమీదే ఎక్కువ చర్చ జరిగింది.

02/11/2019 - 23:57

తెలుగులో పలువురి కవితల సంకలనంగా వచ్చి ఎక్కువ ముద్రణలు పొందిన కవిత్వ సంకలనం, బహుశా ముద్దుకృష్ణ 1935లో ప్రచురించిన వైతాళికులు. 1899 ఫిబ్రవరి 7న జన్మించిన ఆయనకు ఇది నూట ఇరవయ్యో జయంతి సందర్భం కూడా. తన కాలానికి ప్రతిబింబంగా, ప్రాతినిధ్య స్వరంగా ఒక సంకలనం ఉన్నప్పుడే, దాని చారిత్రక విలువ పది కాలాలు నిలబడుతుంది.

02/03/2019 - 23:55

అనగా ‘‘పుణికి తెచ్చిన తావుల పూలగుత్తి’’ యన్నమాట. ఎప్పుడో కొన్ని ఏళ్ళక్రితము ఆయా ఋతువులాగమించిన యప్పుడు రంగు కుంచె విదల్పున బొమ్మ కట్టిన అక్షరాత్మలు. నాజూకు లెన్నియో పోగుపడిన సొబగు చాయల మేల్కవనంపు సొంపులు నాదామృతమయమైన తెలుగు ఋతువులై తనివి స్వరములూదిన వైశ్వనాధీయ వివరనాళిక. వనె్నదిద్దించుకున్న వార్షిక భూషలు. ఒక్కటొక్కటెగా ఋతువులు నిలద్రొక్కుకునే కాలము కేవలము రెండు నెలలు.

01/21/2019 - 03:56

‘‘నకర్మణా న ప్రజయా ధనేన / త్యాగే నైకేన అమృతత్వ మానశుః’’ అన్నారు పెద్దలు.

01/14/2019 - 01:37

ఏది తేలిక మార్గమో దాన్ని ఎంచుకుని తద్వారా తరించటానికి ఏర్పరచుకున్న అనైతిక నేపథ్యాన్ని అనివార్య ప్రయోజకత్వంగా విశే్లషించుకుని బ్రతుకు సాగించటం స్వేచ్ఛా నాగరికత యొక్క వౌలిక స్వభావం. ముఖ్యంగా ఇది సాహిత్యంలోకి చొరబడ్డది. వావి, వరుస తర్కం ముందు తల వొంచుకు నిలబడ్డాయి. కోరుకున్నది పొందగలిగిన వయసు ఈ స్వేచ్ఛా ప్రవృత్తిని సామాజిక స్పృహే అంటుంది.

Pages