S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
మెయిన్ ఫీచర్
సిబియస్‌ఇ సిలబస్ ప్రకారం వివిధ పాఠ్యాంశాలను బోధిస్తున్నాం అని చెప్పుకునే స్కూళ్ళలోని ఒక రికగ్నైజ్డ్ స్కూలువారి ఒకటవ తరగతి తెలుగు వాచకం (Text Book)లో 5వ పుటలో ఒక రూపాయి నాణెం బొమ్మ పక్కన ‘బు’ అనే అక్షరంతో మొదలయ్యే పదమంటూ ‘బుక’ అని పేర్కొన్నారు. ఆ వాచక రచయిత్రి. వాచకం పేరు ‘ఆపిల్ తెలుగు భారతి- (1).
ఈ ప్రశ్నద్వయాన్ని ఇంకాస్త సాగదీయాలంటే ఏది దుర్భావ స్వేచ్ఛ? ఏది విషభావ స్వేచ్ఛ? అని కూడా కలపవచ్చు. రచయితనని తాననుకొనే వ్యక్తికి, అధవా ఇతరులు అంటున్న వ్యక్తికి, సమాజానికి ఉద్వేగం కలిగించకూడదు! హాని తలపెట్టకూడదు! అనే ఇంగితం ఉండాలి. దానినే వివేకమంటారు. వివేకం లేకపోతే తనకేకాక, తన పరిధిలో ఉండే సమాజానికి హాని లేదా ప్రకోపం సంభవిస్తుంది.
పర పీడనం మానేస్తే పుణ్యం వస్తుందనేది పెద్దల మాట. సమాజ జీవనంలో రుజువర్తనం అధిక సంఖ్యాకుల జీవన రీతి. కొందరు కథా నైపుణ్యాత్ములు, ప్రపంచ ప్రజలకు జంతువుల మీద కీటకాల మీద పెట్టి నడవడిక కథలు చెప్పారు. వారిలో ఆద్యుడు విష్ణుశర్మ మాస్టారు.
మహాసముద్రంలో అలలు రావటం సాధారణమైన విషయం. కానీ రూపురేఖల్ని మార్చేసేవిధంగా, చరిత్రను కొత్త పుంతలు తొక్కించేవిధంగా పెనుకెరటాలు తీరాన్నితాకి పాతస్వరూపాన్ని పాతిపెట్టే విధంగా ఈడ్చి కొట్టటం అంటే అది ఒక నవయుగమే అవుతుంది. తెలుగు సాహిత్య చరిత్రలో కరడుగట్టిన బూర్జువాతత్వాన్ని తుదముట్టించేందుకు కలాన్ని కత్తిలా వాడి, చీల్చి చెండాడి రుద్రవీణను వాయించిన అగ్నిధారాస్వరూపం, సాహస విప్లవ మహోదధి, కళాప్రపూర్ణ డా.
ఇటీవల తెలుగునాట ఒక గొప్ప పెద్ద నగరంలో పుస్తక ప్రదర్శనోత్సవాన్ని సందర్శించాను. చాలా విస్మయం, విడ్డూరం అనిపించిన విషయమేమంటే ఈ పుస్తక ప్రదర్శనా ఆవరణ ప్రాంగణంలో వివిధ పుస్తక విక్రయ అంగళ్ళలో పూర్తిగా ఒక అంగడి మొత్తానికి మొత్తం ఒకనాటి ఘనత వహించిన రచయిత గుడిపాటి వెంకట చలానికి కేటాయించి ఉంది. అంటే ఆ అంగడిలో ఇతర పుస్తకాలేవీ దొరకవన్నమాట. చలం పుస్తకాలే గంపగుత్తగా ప్రదర్శితమై ఉన్నాయి.
శ్రీశ్రీ సాహిత్య నిధి పేరుతో శ్రీశ్రీ సమస్త అక్షరాక్షర సృజన ప్రతిభను ఒకమారు చిన్నాపెద్ద, మరన్నీ చిరుచిరుపొత్తాలుగా తేవడానికి విజయవాడలో ఒక శ్రీశ్రీ సాహిత్య చైతన్యకారక సంస్థ పూనుకుంది. విజయవాడలో శ్రీశ్రీ ప్రింటర్స్ అనే ముద్రణాలయం కూడా ఉంది. మంచి అక్షర వ్యాపారమున్నూ చేస్తున్నది. వాళ్ళ ఇష్టం, వాళ్ళ కష్టం, వాళ్ళ మనోభీష్టం మనకెందుకు? ఎవరి కృషి వారిది? కృషి ఉంటే ఋషి కావచ్చని సినిమా పాట కూడా ఉంది కదా?
కొంతమంది పుట్టుకతోనే గొప్పవారవుతారు. మరికొందరు నిరంతర కృషిచేసి మహానుభావులవుతారు. ఇంకొంతమంది అనుకోని పరిస్థితుల్లో అదృష్టం కలిసివచ్చి గొప్పవారవుతారు. ఇందులో రెండో కోవకు చెందిన మహానుభావుడు విలియం షేక్స్‌పియర్. ఆంగ్ల నాటక, కవితా ప్రక్రియల్లో అతనికి అతనే సాటి. ఆంగ్లంలో రచనలు చేసినప్పటికీ అనేక ప్రపంచ భాషల్లోకి అనువాదమయ్యాయి.
నానృషిః కురుతే కావ్యమ్ అన్నారు ప్రాచీనులు. ఋషి అంటే క్రాంతదర్శి. సత్వగుణ స్వభావుడు. విశ్వమానవ కల్యాణాన్ని కోరేవాడు. విశ్వశ్రే్శయః కావ్యమ్ అన్నారు. ఇదీ ప్రాచీనుల సామాజిక దృక్పథం. కావ్య ప్రయోజనం నిశ్రేయస్సు.
చలంగారి మహాప్రస్థానం ముందుమాటల్లో ఒక ప్రఖ్యాత వాక్యం కొంత సవరిస్తే, ఈ వ్యాసం శీర్షిక అవుతుంది. జూన్ 15న శ్రీశ్రీగారి 35వ వర్ధంతి.
సర్వసాధారణ కష్టజీవుల జ్ఞానానికి అతీతమైన వ్యవహారంగా మేధావి వర్గాలు నిర్వహించే దోపిడి జరుగుతుంది. పాలకవర్గ రాజకీయాలు, వారికి అనుయాయులుగా మసలుతున్న మంది మాగాదులు, వ్యాపార వర్గాలు దోపిడీని దొరతనంగా భావిస్తూ అందినకాడికి ప్రజాధనాన్ని మింగిపారేస్తున్నారు. కోటాన కోట్లును నల్లధనంగా మార్చిపారేస్తున్నారు. మనిషిని ఆర్థిక అవతారంగా మార్చిపారేస్తు మానవీయతకు మరణ శాసనం రాసేస్తున్నారు.