S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయిన్ ఫీచర్

09/02/2016 - 21:07

ఇంటి ముందు రకరకాల మొక్కలు పెంచుకుంటుంటాం. చాలామంది కొత్త మొక్కలు నాటేందుకు మక్కువ చూపుతున్నారు. గాలికి వివిధ ఆకృతుల్లో కత్తిరించిన మొక్కలు ఊగుతూ హోయలు పోతుంటే ఆ ఇంటికే అందాన్ని తెచ్చిపెడుతోంది. ముఖ్యంగా పడకింటి గది పక్కన మొక్కలు తలలు ఊపుతూ చల్లటి పిల్లల గాలులతో నిద్రలేపుతాయి. విభిన్నమైన రంగుల్లో కనిపించే సిలోసియా ప్లమోసాను పెంచుకోవటానికి నేడు మక్కువ చూపుతున్నారు.

09/01/2016 - 22:01

ఆరు పదుల వరకు కూడబెట్టడంలో ఉన్న తృప్తిని ఆరుపదులు దాటిన తర్వాత స్వంతానికి ఖర్చుపెట్టడం ద్వారా అందుకోవాలి. అవును, కాళ్లలో సత్తువ ఉన్నంతవరకు, కళ్లలో వెలుగు ఉన్నంతవరకు, మనసు త్రుళ్ళిపడుతున్నంతవరకు ప్రకృతిలో పరవశిస్తూ, ఆనంద జీవనం గడుపుతుండాలి. పుట్టిన నాటినుండి చివరిదాకా నాతో ఉండే నేస్తం నేనే!
అందుకే బ్రతికుండగానే బ్రతుకును పండించుకోవాలి!

08/31/2016 - 21:24

పిల్లల పెంపకంలో పెద్దల పాత్ర గురించి వాదోపవాదాలు, చర్చలు జరుగుతున్న వేళ..స్కూలు మానేసిన ఓ టీనేజ్ అమ్మాయి తన అమ్మ అందించిన తోడ్పాటుతో అందలమే ఎక్కింది. ఆ అమ్మాయి పేరు మాళవిక రాజ్ జోషి. అందరి పిల్లల వలే మాళవిక చిన్నప్పటి నుంచి బుద్దిగా స్కూలుకు వెళ్లి చదువుకోవటానికి ఇష్టపడేది కాదు. నాలుగేళ్ల క్రితం పాఠశాలకు వెళ్లటం మానేసింది. ఆమె కనీసం 10,12 తరగతులు సైతం చదవలేదు.

08/30/2016 - 19:39

సృష్టిలో తియ్యని పదం ‘అమ్మ’అనిపించుకోవటం. అలాంటి తియ్యనైన అమ్మతనాన్ని ఆస్వాదించాలనుకునే అతివలకు ఈ బిల్లు కన్నీళ్లను మిగులుస్తుంది. అమ్మతనాన్ని అంగట్లో సరుకుగా చేసి సరోగసీ వ్యాపారాన్ని మూడు పువ్వు లు ఆరు కాయలుగా సాగిస్తున్న ధనవంతులు, విదేశీయుల ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన బిల్లుపై అద్దెకడుపు అమ్మలు సైతం పెదవి విరుస్తున్నారు.

08/27/2016 - 22:04

ప్రేమించుకోవడం నేటి ఫ్యాషన్. ప్రేమని అడ్డుపెట్టుకుని సరదాలు తీర్చుకోవడం కూడా నేటి ఫ్యాషన్. సినిమాలు, పాశ్చాత్య ఛానెళ్ళు ప్రభావం యువతీ యువకులపై వుందనడంలో సందేహం లేదు. ప్రేమించే వయసు రాగానే తొందరపడిపోవడం, వెంటనే ఎవరో ఒకళ్ళకి మనసిచ్చేయడం, ఆనక ఎన్నో బాధలు.
**

08/26/2016 - 20:56

చిత్తశుద్ధి, అకుంఠిత దీక్షతో పనిచేస్తే మహిళలు ఏ రంగంలోనైనా పురుషులకు ధీటుగా రాణించగలరు అని నిరూపించారు కర్ణాటకకు చెందిన జెస్సికా లారెన్స్. వస్త్ర ప్రపంచంలో (వ్యాపారంలో) పురుషాధిక్యత ఎక్కువ. అటువంటి వస్త్ర వ్యాపారంలో జెస్సికా నేతృత్వంలో వున్న గార్మెంట్స్ కంపెనీలకు ధీటుగా లారెన్స్ క్లాతింగ్ అనే సంస్థను విజయవంతంగా నిర్వహిస్తున్నారు.

08/25/2016 - 21:54

ఈ మధ్య కాలేజీల్లో జరిగే వేడుకలకు అమ్మాయిలు అదిరేటి డ్రెస్సులే వేసుకోవటం లేదట. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్లు చక్కటి చేనేత చీరలు ధరించి హుందాగా హొయలొలికిస్తున్నారు. అమ్మాయిల మనసు ఆకట్టుకునేలా.. చేనేత వస్త్రాలు రకరకాల డిజైన్లలో వస్తున్నాయి. చేనేతలో ప్రసిద్ధి చెందిన ఇకత్ చీరలు ధరించి, పైన బ్లేజర్ వేసుకుని అమెరికాలో జరిగిన ఓ వేడుకలో భారతీయ అమ్మాయిలు కనువిందు చేశారట.

08/24/2016 - 21:13

..............
వసుదేవ సుతం దేవం కంస చాణుర మర్ధనమ్
దేవకై పరమానందం కృష్ణం వందే జగద్గురమ్
.............

08/23/2016 - 21:06

ఆడపిల్ల విజిల్ వేస్తే కసురుకుంటాం. పోకిరితనానికి ప్రతీకగా భావిస్తాం. ఆ ఈలతోనే ప్రపంచ ప్రఖ్యాతురాలయ్యింది శే్వతా సురేష్. ఈనెల 15 నుంచి 17 వరకు జపాన్‌లో జరిగిన ప్రపంచ ఈలపాటల పోటీలలో రెండు ప్రథమ బహుమతులను గెలుచుకొని ఈలపాటలో తనకు తానే సాటి అనిపించుకుంది 24 ఏళ్ల శే్వతా సురేష్. పలు ప్రపంచ దేశాల నుంచి వచ్చిన విజల్ నిపుణుల ముందు తన విద్యను ప్రదర్శించి సెభాష్ అనిపించుకుంది.

08/20/2016 - 22:30

దిల్‌సే సినిమాలో ఛయ్యా..్ఛయ్యా అంటూ షారూఖ్‌ఖాన్, మలైకా అరోరాఖాన్ కలసి రైలుపై వేసిన చిందులు ఆనాడు యువతను ఉర్రూతలూగించాయి. మైహునా..పెహ్లానషా అంటూ అందరి నోళ్లలో ఇప్పటికీ నానుతున్న ఈ పాటలకు కొరియోగ్రాఫర్‌గా పనిచేసి ప్రేక్షకుల హృదయాలను సొంతం చేసుకున్న ఫరాఖాన్ నేడు బుల్లితెర ప్రేక్షకులను అలరించనున్నది. ఇప్పటికే బాలీవుడ్‌లో సెలబ్రిటీ అయిన ఫరాఖాన్ బుల్లితెరపైకి వస్తే ఇమేజ్ దెబ్బతింటుందని భయడపటం లేదు.

Pages