S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయిన్ ఫీచర్

10/01/2019 - 18:49

నీటిలో ‘వెలుగు’ ఉంది. నీటిలోనే ‘రసం’ ఉంది. అమృతము కూడా జలములలోనే వుంది. బ్రహ్మపదార్థం ఉంది. ఉదకములకు మూలమైన అగ్ని వెలుగునిస్తుంది. వెలుగుకు వెలుగయి, నెలవులకు నెలవైన పరంజ్యోతి ‘అన్నపూర్ణాదేవి’. మరోజన్మ లేకుండా, జన్మరాహిత్యాన్ని పొందించే జ్ఞానజ్యోతి- అన్నపూర్ణాదేవి. స్థూలంగా సేవిస్తే సాకారంలో, సూక్ష్మంగా భావించి ధ్యానించి ఆరాధిస్తే నిరాకారంగా సాక్షాత్కరిస్తుంది- జగన్మాత అన్నపూర్ణాదేవి.

09/30/2019 - 18:34

విధాత్రీ ధర్మాణాం త్వమసి సకలామ్నాయ జననీ
వమర్థానాం మూలం ధనదనమనీ యాంఘ్రి కమలే
త్వమాదిః కామానాం జనని కృతకం దర్ప విజయే
సతాం ముక్తేద్బీజం త్వమసి పరమ బ్రహ్మ మహీషీ
- శ్రీ శంకర భగవత్పాదులు

09/29/2019 - 23:02

సదా ఆనందంలో ఓలలాడుతూ, తన భక్తులకు చిన్మయానందాన్ని ప్రసాదించే ఆనందమయి ‘బాలాత్రిపురసుందరి’. ఈ విశాల కువలయమే, తల్లికి ఆలయం. మేధాశక్తికి మేరుపర్వతం లాంటిది, జగన్మాత. అర్చనకూ, అర్పణకూ, విద్యకు, అవిద్యకు, జగన్మాత అధీశ్వరి. పూర్వజన్మ సుకృతం ఉంటేనే అమ్మను సేవించాలనే బుద్ధిపడుతుంది. పంచభూతములు, జగన్మాత నుండే ఉద్భవించాయి. జగన్మాతను సేవిస్తే రోగ భయం ఉండదు, మృత్యభయం దరిజేరదు.

09/27/2019 - 20:17

బతుకమ్మ పండుగ వర్షాకాలం వెళ్ళిపోతుండగా, చలికాలం వస్తుండగా వస్తుంది. అంటే దక్షిణాయనం, ఆశ్వయుజ మాసంలో వస్తుంది. ఆశ్వయుజ మాసం అమావాస్య రోజున ఎంగిలి పూల అమావాస్యగా మొదలవుతుంది. తొమ్మిది రోజుల బతుకమ్మ ఆశ్వయుజ శుక్ల నవమి పండుగతో ముగుస్తుంది.

09/26/2019 - 18:56

పౌష్టికాహార లోపంతో ప్రతియేడు ఎందరో మహిళలు బాధపడుతున్నారు. ఒక్క మహిళలే కాదు బాలికలు, బాలురు, ఎదుగుతున్న పిల్లలు కూడా పౌష్టికాహార లోపంతో ఎదుగుదల లేక బలహీనంగా కనిపిస్తూ చిక్కి శల్యం అవుతున్నారు. ముఖ్యంగా గర్భిణీలు పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారు. ఇలా ఎందుకు జరుగుతుంది అని ప్రశ్నించుకుంటే, పేదరికం ఒక కారణమైతే, తెలిసీ తెలియనితనం మరో కారణం అని చెప్పవచ్చు.

09/25/2019 - 18:42

ఆమె మాట్లాడలేదు..
వినలేదు.. కానీ కష్టపడి డిగ్రీ పూర్తిచేసింది. ఉద్యోగం చేయాలనుకుంది. అలా అందరిలా ఉదయం పదింటికి వెళ్లి సాయంత్రం ఐదింటికి వచ్చే ఉద్యోగం చేయడం కాకుండా.. తనలాంటి వారికోసం ఏదో ఒకటి చేయాలనుకుంది. అందుకోసం ఏకంగా ఒక స్టార్టప్ సంస్థను ప్రారంభించింది ఆమె. ఇది దేశంలోనే మొట్టమొదటి బధిర స్టార్టప్ సంస్థ. ఇంతకూ ఆమె పేరు చెప్పలేదు కదూ.. రెమ్యారాజ్. వివరాల్లోకి వెళితే..

09/24/2019 - 18:57

ఈ మధ్య ఏ పేపర్ తిరగేసినా కూడా కుటుంబం మొత్తం ఆత్మహత్యలు చేసుకున్న వార్తలే కనబడుతున్నయి. అసలు కుటుంబం మొత్తం ఆత్మహత్యకు పాల్పడాల్సిన అవసరం ఏముంది. అంత బలమైన కారణాలు ఏమై ఉంటాయి అని ఆలోచిస్తే చాలా దిగ్భ్రాంతిగొలిపే వాస్తవాలు అగుపడతాయి.

09/23/2019 - 18:48

పిల్లల్లో ఎదుగుదలకు ఆహారం తరువాత నిద్ర అత్యంత అవసరం. అటు శరీర పెరుగుదల, మెదడు వికసించడం రెండూ దాదాపు నిద్రలోనే జరుగుతాయి. నిద్ర విషయంలో పెద్దవారిలాగే పిల్లలు కూడా ఎవరికి వారు ప్రత్యేకమే. నిద్ర తగినంతగా లేకపోతే పిల్లల్లో ఎదుగుదల సమస్యలతో పాటు ప్రవర్తనలో కూడా లేడా కనపడుతుంది. ఈ తేడా ఒక్కో బిడ్డలో ఒక్కో రకంగా ఉంటుంది. చంటి బిడ్డలు అయితే నిద్ర చాలనప్పుడు ఊరికే ఏడుస్తూ ఉంటారు.

09/22/2019 - 22:44

ఆధునిక ప్రపంచంలో ఆరోగ్యంపై అవగాహన, బాధ్యతను కలిగి ఉండాలి. ఆరోగ్యంగా ఉండటానికి ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకోవాలి. అందుకు యోగా బాగా ఉపయోగపడుతుంది. యోగాను మొదలుపెట్టి ఒక నెలో, రెండు నెలలో ప్రాక్టీస్ చేసి ఆపేస్తుంటారు. తర్వాత ఐదు, ఆరు నెలలు బ్రేక్ తీసుకుని తిరిగి ప్రారంభిస్తుంటారు. రోజూ ఉదయం నిద్ర లేచిన వెంటనే పరగడుపున యోగాను ప్రాక్టీస్ చేయడం వల్ల అనేక ప్రయోజనాలున్నాయి.

09/20/2019 - 19:20

క్రీడారంగంలో అద్భుతాలను నమోదు చేస్తున్న భారతీయ మహిళలు అంతర్జాతీయ వేదికలపైనా మన జాతీయ పతాకాన్ని రెపరెపలాడిస్తున్నారు. విభిన్న క్రీడల్లో వారు సాధిస్తున్న పతకాలే ఇందుకు నిదర్శనం. ఒకప్పుడు పురుషులకు మాత్రమే పరిమితమైన బాక్సింగ్, వెయిట్ లిఫ్టింగ్, క్రికెట్, పర్వతారోహణం వంటి సాహస క్రీడల్లోనూ యువతులు నేడు సత్తా చాటుకుంటున్నారు.

Pages