S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయిన్ ఫీచర్

08/26/2018 - 21:58

అమ్మతనంతోనే అసలైన పరిపూర్ణత వస్తుందని భావిస్తుంది మహిళ. అందుకే మరణానికి కూడా సిద్ధబడి బిడ్డను కంటుంది అమ్మ. తన శరీరాన్ని చీల్చుకు పుట్టిన బిడ్డను కళ్లారా చూసుకుని అప్పటివరకు పడిన కష్టాన్ని మరిచిపోయి మురిసిపోతుంది తల్లి. అందుకే పెళ్ళైంది మొదలు సంతానం కోసం ఎదురుచూస్తుంది. మహిళే కాదు ఆ ఇంట్లోని వారు కూడా పెళ్ళైంది మొదలు కొత్తతరం కోసం ఎదురుచూస్తారు. అమ్మాయి శుభవార్త ఎప్పుడు చెబుతుందా?

08/24/2018 - 19:08

కొంతమంది పండితులు శ్రావణ పూర్ణిమనాడు రాజాస్థానాలకు, జమీందారుల దగ్గరకు వెళ్లి వేదాశీర్వాదాన్ని చదివి వారి దగ్గర నుంచి పారితోషకాలను పుచ్చుకునేవారు. వారిని శ్రావణీకులు అనేవారు. ఈ శ్రావణీకులే రాజరిక వ్యవస్థ ఉన్నకాలంలో గోవులను, మునులను, బ్రాహ్మణులను, సర్వ జనులను కాపాడి శాంతిని కూర్చవలసిందిగా రాజుల నుదుట బొట్టుపెట్టి తీపి తినిపించి రక్షణ మంత్రాన్ని పఠిస్తూ రాజుల దక్షిణ హస్తానికి రక్ష కట్టేవారు.

08/23/2018 - 19:15

‘‘సూర్యోమరీచి మాదత్తే సర్వస్మాద్భువనాదధిః
తస్యాః సాక విశేషేణ స్మృతం కాల విశేషణమ్’’
అన్నదాత, ఆరోగ్యప్రదాత అయిన సూర్యభగవానుని కిరణముల పరిపాక విశేషము వలన రాత్రింబవళ్ళు, దినము, వారము, పక్షము, మాసము ఋతువులు ఆయనములు సంవత్సరములు మొదలగు కాల భేదములు ఏర్పడుతున్నాయని యజుర్వేద తైత్తిరీయ ఆరణ్యకం పేర్కొంది.

08/22/2018 - 20:07

పిల్లలను అప్పుడప్పుడూ కాదు ఎప్పుడూ పట్టించుకోవాలి. వారిది చిన్న మనసు. ఉత్తిగనే మనసు చిన్నబుచ్చుకుంటారు. బుంగమూతి పెట్టేసుకొంటారు. నన్ను పట్టించుకోవడం లేదని ఫిర్యాదులు కూడా చేస్తుంటారు. ఇవన్నీ చిన్నప్పుడు మామూలే అనుకొంటే పొరపాటు. ఇవే పెద్దయ్యాక పిల్లల్లో వ్యక్తిత్వ లోపాలుగా పరిణమిస్తాయి. మా అమ్మ చిన్నప్పుడు నన్ను బాగా చూసుకొనేది కాదు అని పెద్దయ్యాక పక్కవారికి చెబుతుంటారు.

08/21/2018 - 20:31

ఆహార విషయంలో జాగ్రత్తగా ఉండాల్సింది ముఖ్యంగా మధ్యతరగతి మహిళలే. సాధారణంగా భారతీయ స్ర్తి తనింట్లో అందరికీ వడ్డించి వారంతా కడుపునిండా తిన్న తరువాత తాను తింటుంది. ఇక్కడే అసలు ఇబ్బంది పడుతోంది. మిగిలింది తినడమో లేక అసలు మిగలేదు ల్లే మంచినీళ్లు తాగి పడుకుందాం అనుకొనేవారు ఎక్కువగా ఉన్నట్టు కొన్ని సర్వేలు చెబుతున్నాయి.

08/20/2018 - 22:33

సంతోషమే సగం బలం. మనిషి ఆరోగ్యం గా ఉండాలంటే మొట్టమొదట సంతోషంగా ఉండాలి. సంతోషం ఎక్కడ ఉంది అన్న ప్రశ్న వస్తోందా? అయతే ఇదిగోండి మీకు సంతోషం పంచే వస్తువులు- సంతోషం అనేది ఎక్కడో ఉండదు. మీలోనే ఉంటుంది. దాన్ని కాస్త బయటకు తీయాలి అంతే. మీ మనసు ఏదోగా అనిపిస్తే కాసేపు మీ పిల్లలతో పిచ్చాపాటి మాట్లాడండి. మీ పిల్లలు కాకపోయనా చుట్టుపక్కల పిల్లలతోనైనా కాసేపు గడపండి.

08/20/2018 - 07:16

**కొందరికి ఫిట్స్ వస్తుంటాయి. ఇలాంటివారు ఫిట్స్ కోసం మందులు వాడుతుంటారు. వీరు గర్భధారణ చేయవచ్చా లేదా అనుకొంటారు. ఇందులో ఏమీ అనుమానం అక్కర్లేదు. ఫిట్స్ ఉన్నప్పటికీ గర్భధారణకు ప్లాన్ చేసుకోవచ్చు. కాకపోతే కొన్ని జాగ్రత్తలు పాటించాలి. వైద్యులను ముందుగానే సంప్రదించి ఫిట్స్‌కు వాడే మందుల మోతాదును తగ్గించుకుంటే చాలు. అట్లాకాకపోతే హోమియో మందులు వాడితే ఫిట్స్ పూర్తిగా తగ్గుతుంది అంటారు.

08/17/2018 - 19:55

ఆటపాటల విషయంలోనో, చదువుల విషయంలోనో, మరింకో విషయంలోనో పిల్లల్లో గొడవలు మామూలే! కానీ ఇటీవల కొంతమంది పిల్లల్లో హింసాప్రవృత్తి పెరుగుతోంది. ఇలా ఎందుకు జరుగుతోంది అని ఆరా తీస్తే.. పిల్లల్లో కోపం తెచ్చుకునే స్వభావం వాళ్ల వయసుపై, పరిసరాలపై ఆధారపడి ఉంటుందని తేలింది. 2014లో ఇండియన్ జర్నల్ ఆఫ్ సైకలాజికల్ మెడిసిన్‌లో ప్రచురించిన ఒక పరిశోధన పత్రం ఆధారంగా బాలికలకన్నా బాలల్లో కోపం ఎక్కువగా ఉంటుందట.

08/16/2018 - 20:25

అంతా క్షేమమేనా! మొన్ననే నేను నా పుట్ట్టినరోజు. జరుపుకున్నాను. చాక్లెట్లు, బిస్కెట్లు పంచిపెట్టే వయస్సు ఎప్పుడో దాటిపోయిందిలెండి. నాది చాలా పెద్ద కుటుంబం, నా పుట్టినరోజు వేడుక ప్రతి ఇంట్లో జరుపుకుంటారు. నేనంటే అందరికీ అంత ఇష్టం, భక్తి. నాకిప్పుడు డెబ్భై ఒక్క ఏళ్ళు. ఎంతోమంది పెద్దల త్యాగఫలం వలన నేను ఊపిరి పోసుకున్నాను. నేను బతికి బట్టకట్టడానికి ఓ తల్లికాదు, ఎంతోమంది తల్లులు ప్రాణత్యాగం చేసేరు.

08/15/2018 - 23:53

అసిడిటీ, మలబద్ధకం, ఫైల్స్, కొలైటిన్, అల్సర్స్ , కిడ్నీసమస్యలు, అలర్జీ, సొరియాసిస్, మొటిమలు, ఎగ్జిమా అనేకానేక చర్మరోగాలు చాలామందిని పీడిస్తుంటాయి. రోగాలు వచ్చిన తరువాత మందులు వేసుకోవడం కన్నా రోగాలు రాకుండా చేసుకోవడం మేలు. ఇలా ఆలోచిస్తే మనం తినే ఆహారమే మనకు ఆరోగ్యాన్నిస్తుంది. ఒక్కోసారి మనం తీసుకొన్న ఆహారం మనకు అనుకోని అనారోగ్య సమస్యలను కూడా తెస్తుంది.

Pages