S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయిన్ ఫీచర్

07/22/2018 - 22:21

ప్రతి ఒక్కరూ రేపటి నుంచి ఎలాగైనా వ్యాయామం చేయాలనుకుంటారు. కానీ చేయరు. ఆరోగ్యకరమైన ఆహారపదార్థాలను తీసుకుంటామని చెబుతారు కానీ తీసుకోరు. ఇలా ప్రతిరోజూ వ్యాయామాలను వాయిదా వేస్తూ పోతే బరువు పెరిగిపోతారు. శరీరం కదలకుండా పోతుంది. పెళ్లికి ముందు ఫిట్‌గా ఉండే ప్రతి ఒక్కరూ పెళ్లయి పిల్లలు పుట్టాక ఉద్యోగం, పిల్లలు, ఆలస్యంగా పడుకోవడం, ఆహారనియమాలు పాటించకపోవడంతో లావయిపోతారు.

07/20/2018 - 19:07

అన్నదమ్ములు పెళ్లిళ్లు చేసుకొని ఎవరి దారిన వారు వెళ్లిపోయారు. ముగ్గరక్కలూ ఏదో గంతకు తగ్గ బొంత అని పెళ్లిళ్లు చేసుకొని తిప్పలు పడుతున్నారు. శైలజ అమ్మనాన్నలను చూడాల్సిన బాధ్యత మీద పడింది. ఇంటర్ చదివేకాలంలోనే కష్టాలు చవి చూడడం ఆరంభించింది. అందుకే శైలజ ఇంటర్‌తో చదువుకు పుల్‌స్టాప్ పెట్టేసి బట్టల కొట్టులో సేల్స్ గర్ల్‌గా చేరింది.

07/19/2018 - 19:29

కుపుత్రోజాయేత క్వచిదపి కుమాతా న భవతి .. అంటే ఏమిటి అనుకొంటున్నారా... ఏమీ లేదండీ.. ఎక్కడైనా మంచి కొడుకు ఉండక పోవచ్చు.. కాని చెడ్డ తల్లి మాత్రం ఉండదు అని అర్థం అండీ...
నిజమే కదా. ఈకాలంలో వీధికో వృద్ధాశ్రమాలున్నాయి అంటే చెడు అమ్మలు ఉన్నట్టా లేక చెడ్డ పిల్లలున్నట్టా చెప్పండి... సరే.. అసలు విషయానికి వద్దాం..

07/18/2018 - 19:50

పిల్లలు పుట్టిన క్షణం నుంచి ఇతరులను అనుకరిస్తుంటారు. వారికి మొదటి గురువు తల్లే. తల్లిని అనుకరించడం తల్లి మాట వినగానే నవ్వడం, కాళ్లు చేతులు ఆడించడం లాంటివి మాటలు రాని సమయంలోనే చేస్తుంటారు. అటువంటి పిల్లలు వయస్సు పెరుగుతున్న కొలది తల్లిదండ్రల నుంచి ఇరుగు పొరుగు, స్నేహితుల వల్ల వారి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకుంటూ ఉంటారు. ఈ వ్యక్తిత్వ నిర్మాణంలో ఉపాధ్యాయులు కూడా ప్రధాన భాగం అవుతారు.

07/17/2018 - 19:20

పాతకాలం నాడు అయితే ఉద్యోగం చేయాలనుకొన్నవారు ముందుగా ఏదొక డిగ్రీ పాస్ కావాలి. ఆ తరువాత ఉద్యోగానే్వషణలో పడేవారు. కాని నేడు అలా కాదు. అంతర్జాల మహిమతో ప్రపంచం అంతా అరచేతిలోకి వచ్చేసింది. ఎక్కడ చూసినా ఎనె్నన్నో కొత్తకొత్త విషయాలు ప్రతి నిముషమూ తెలుస్తునే ఉంటున్నాయి.

07/16/2018 - 19:30

కొత్తగా కాలేజీలకు వెళ్లే అమ్మాయిల్లో కాస్త బెరుకు మరికాస్త ఉత్సాహం ఉంటుంది. ఉత్సాహానికి తగ్గట్టుగా డ్రస్సులు, బ్యాగ్స్, వారి స్టైల్ ఇవన్నీ చక్కగా నప్పాయి అని వారు అనుకుంటే చాలు ఇక బెరుకు గిరుకు లేకుండా ముందుకు దూసుకెళ్తారు.

07/15/2018 - 22:45

టెక్నాలజీ పెరిగింది. నాగరికత పెరిగింది. మానవుడు చంద్రమండలంలో ఇల్లు కట్టుకోవాలని చూస్తున్నాడు. కాని మనిషిలోని రావణాసురుని ఆగడాలు మాత్రం తగ్గడం లేదు. ఎక్కడ చూసినా నరకాసురులు, రావణాసురులే కనిపిస్తున్నారు. చిన్న పెద్దా తేడాల్లేదు. వావివరుసలు అసలే లేవు. తండ్రి, అన్న, మామ, బావ, ఇలా ఏ సంబంధం ఉన్నవారైనా సరే ఆడపిల్లల్ను చూడగానే చొంగ కార్చేవారే ఎక్కువ కనబడుతున్నారు.

07/13/2018 - 19:53

రోజురోజుకు పుట్టగొడుగుల్లా మినరల్ వాటర్ ప్లాంట్లు వెలుస్తున్నాయి. నిబంధనలను పాటించకుండా వాటర్ ప్లాంట్ల నిర్వాహకులు యథేచ్చగా స్వచ్చమైన నీటి పేరుతో దోపిడీ చేస్తున్నారు. ప్రజల అమాయకత్వాన్ని, అవసరాన్ని గుర్తించి అక్రమాలకు పాల్పడుతూ సొమ్ము చేసుకుంటున్నారు. చెట్టు పేరు చెప్పి కాయలు అమ్మినట్లుగా సాధారణ నీటినే మినరల్ వాటర్‌గా పేర్కొంటూ ప్రజల వద్ద నుంచి పైసలను దండుకుంటున్నారు.

07/12/2018 - 20:07

పిల్లలు ఎదుగుతున్నప్పుడు కొత్త స్నేహితులు ఏర్పడుతుంటారు. నేటి ఆధునిక టెక్నాలజీని వారు త్వరగా అర్థం చేసుకొంటూ ముందుకువెళ్తుంటారు. అట్లాంటపుడు వారి చేతుల్లో ఎప్పుడూ ఫోను ఉంటుంది. వాట్స్‌అప్‌లోనో , ట్విట్టర్, ఫేస్ బుక్ ఇలాంటివాటిల్లో వారు తలమునకలైనట్టే ఉంటారు.

07/11/2018 - 20:28

వేర్వేరు ప్రదేశాల్లో వేర్వేరు సంప్రదాయాల్లో ఇరవై యేళ్లు పెరిగిన వివాహం అనే ఒక ప్రక్రియతో ఒక్కటై ఒక కుటుంబంగా ఏర్పడుతారు. అప్పటిదాకా ఇద్దరు వ్యక్తులు వారి వారి సొంత ఆలోచన్లతో ఉంటారు. ఎవరి జీవిత ద్యేయాలు వారికుంటాయి. ఎవరి గోల్స్ వారికుంటాయి. కాని, పెళ్లి అనే తంతుతో వారిద్దరి అభిరుచులు, అభిప్రాయాలు ఒక్కటి పోతాయి. నిన్నటి దాకా నేను అనేవారు కాస్త మేము అంటారు. మేము మాది అనే భావన వస్తుంది.

Pages