S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయిన్ ఫీచర్

01/06/2020 - 23:16

పేదలు, మహిళలు, బాలికలకు అండగా నిలువాలన్నదే ఆలోచన.. ఆ ఆలోచనను ఆచరణలో పెట్టాలనే ఆకాంక్ష.. సమాజంలో అట్టడుగున ఉన్న వాళ్ల పట్ల అపరిమితమైన మమకారం.. ఇందుకోసం తాను ఎంచుకున్న మార్గంలో ప్రయాణం.. కడియం ఫౌండేషన్ బాసటగా ప్రయత్నాలు చేస్తోంది డా. కడియం కావ్య.

01/01/2020 - 22:54

మరో సంవత్సరాన్ని కాలగర్భంలో కలిపేసి నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టేశాం.. కొత్త ఆశలతో, కొంగొత్త కోరికలతో మరో దశాబ్దాన్ని మొదలుపెట్టేశాం.. ఈ కొత్త దశాబ్దంలోనైనా మహిళలపై వివక్ష తగ్గి మహిళలను పురుషులతో సమానంగా చూస్తారని ఆశ.. మహిళలను పూజ్యభావంతో చూసే పురిటిగడ్డ మన భారతదేశం. అలాంటి భారతదేశంలో నేడు ఆడబిడ్డల పుట్టుక కూడా ప్రశ్నార్థకంగా మారింది.

12/31/2019 - 22:58

కొత్త వసంతం.. కొంగ్రొత్త ఉత్సాహం.. అన్నీ శుభాలు జరగాలన్న కోరిక.. సమస్యలన్నీ తొలిగిపోతాయన్న విశ్వాసం.. మంచి జరుగుతున్న నమ్మకం.. అదృష్టం వరిస్తుందేమోనన్న ఆశ.. లక్ష్యాలు చేరుతామన్న ధీమా.. ఇలా కొత్త సంవత్సరం వస్తుందంటే ప్రతి మనిషికీ ఇలా ఏదో ఒక రూపంలో ఆకాంక్షలు ఉండటం సహజమే.. గడిచిన ఏడాదిలోని తప్పులను నెమరేసుకుని, నూతన సంవత్సరానికి కొత్త ప్రణాళికలను వేసుకోవడం మానవ సహజం..

12/30/2019 - 23:08

మీరు రెండు కప్పల్ని మింగాల్సి వస్తే ముందుగా పెద్దది మింగండి అంటాడు బ్రెయిన్ ట్రేసీ. ఇక్కడ కప్పలు అంటే నిజంగా కప్పలు కాదు.. సమస్యలు. ముందు ఒక పెద్ద సమస్యను పరిష్కరించుకుంటే.. ఆ అనుభవంతో రెండో చిన్న సమస్యను తేలిగ్గా పరిష్కరించుకోవచ్చు. చాలామంది తెలియక చిన్న సమస్యను ముందు చేపడతారు. దానికి ఎదురయ్యే ఇబ్బందులతోపాటు, పెద్ద సమస్యను ఎలా పరిష్కరించాలో అనే భయం పెరిగి చేసే పనిని మధ్యలో విడిచిపెడతారు.

12/29/2019 - 22:50

ప్రతి ఒక్కరిలోనూ శక్తి సామర్థ్యాలనేవి ఉంటాయి. వాటిని గుర్తించుకోవాలి. మిమ్మల్ని మీరు ఉన్నతులుగా తీర్చిదిద్దుకోవటం కోసం, మీ బలహీనతల్ని, సమస్యల్ని అధిగమించడం కోసం, మీ అంతర్గత శక్తులు పటిష్టం చేసుకోవడంకోసం, అంతిమవిజయం సాధించట కోసం మీ ఆలోచలను మార్చుకోవచ్చు. మంచి ఆలోచనలతో మనల్ని మనం మలచుకోవడంలోనే విజయం దాగివుంది. ఒక లక్ష్యంతో ఆలోచనలవైపు, ఆచరణవైపు అడుగులు పడితే విజయం మీ స్వంతం.

12/25/2019 - 23:56

ఆమె సప్త సముద్రాలను దాటింది..
ఏడు ఖండాలను చుట్టేసింది..
ప్రాచీన, ఆధునిక ప్రపంచ వింతలన్నింటినీ చూసేసింది..
నింగి, నేల, వాయు, జల మార్గాల గుండా అన్నింటిలోనూ ప్రయాణం చేసింది..
అలా..
ఇప్పటివరకు 169 దేశాలను చుట్టివచ్చిన ప్రపంచ యాత్రికురాలు, సాహస మహిళ ఆమె..
పేరు నోముల నర్మదారెడ్డి..

12/25/2019 - 05:08

చిందరవందరగా, అపరిశుభ్రంగా వున్న వంట గది విసుగు తెప్పిస్తుంది. చక్కగా సర్దుకున్న వంటగది చూడముచ్చటగా ఉండి మనసుకు హాయినిస్తుంది. దానికోసం వంటింట్లో సామాన్లు ఎలా సర్దుకోవాలో.. గదిని శుభ్రంగా ఉంచుకోవడం ఎలానో తెలుసుకుంటే సరి.

12/23/2019 - 23:19

మానవుడు స్వేచ్ఛాప్రియుడు. తన మాటలో తన బ్రతుకుబాటలో తనదైన స్వేచ్ఛను వినిపిస్తుంటాడు, తన పనుల్లో చూపిస్తుంటాడు. తన స్వేచ్ఛకు భంగంకలిగినచోట తన గొంతును వినిపించి, తన కార్యదక్షతను చూపి తన స్వేచ్ఛను కాపాడుకుంటాడు. తన స్వేచ్ఛకు సమస్యలు, సవాళ్లు ఎదురైనప్పుడు వాటిని సైతం అధిగమించి తన స్వేచ్ఛా ప్రయత్నాన్ని చాటుకుంటాడు.

12/19/2019 - 23:28

చుట్టూ మనుషులున్నా కొందరిని ఒంటరితనం వేధిస్తుంది. దాన్ని అధిగమించేందుకు వారు సామాజిక మాధ్యమాలను ఆశ్రయిస్తుంటారు. అయినా కూడా వారిని ఒంటరిగా ఉన్నామనే భావన వెంటాడుతూనే ఉంటుంది. అమ్మాయిల్లో అయితే ఈ ధోరణి మరింత అధికంగా ఉంటుంది. ఇంతకీ ఆన్‌లైన్ బంధాలు మనల్ని ఒంటరితనం నుంచి బయటపడేస్తున్నాయా లేక మనల్ని మరింత ఏకాకిని చేస్తున్నాయా? అని ఆలోచిస్తే..

12/18/2019 - 22:46

ధనుర్మాసం అంటే దివ్య ప్రార్థనకు అనువైన మాసమని అర్థం. ధనుర్మాసం తెలుగు సంస్కృతిలో ఒక భాగం. దేవాలయాల్లో ఆండాళమ్మ పూజ, తిరుప్పావై పఠనం, గోదా కల్యాణం ప్రసాదాలు మొదలైనవి ధనుర్మాసంలోనే నిర్వహిస్తారు. తిరుమలలో ధనుర్మాసం నెల రోజులు, సుప్రభాతం బదులు తిరుప్పావై గానం, సహస్ర నామార్చనలో తులసీ దళాలకు బదులు బిల్వ పత్రాలను ఉపయోగిస్తారు.

Pages