S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

10/23/2019 - 18:50

కంప్యూటర్ యుగంలో ఈమధ్య ఇ-షాపింగ్‌కు ఆదరణ బాగా పెరిగింది. ఇంటర్నెట్‌లో వస్తువులను కొనే పద్ధతి వచ్చాక వినియోగదారులు ఎంత వేగంగా కొంటున్నారో అంతే వేగంతో మోసపోతున్నారు. బాగా చదువుకున్నవారు సైతం జాగ్రత్తలు తీసుకోనందుకన మోసాలకు గురవుతున్నారు.

10/22/2019 - 18:47

ప్రస్తుతం ఎవరి చేతిలో చూసినా స్మార్ట్‌పోన్‌లు దర్శనమిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితులలో స్మార్ట్ఫోన్ మాత్రం ప్రతి ఇంటిలో కనీసం ఒక్కరి దగ్గరైనా ఉంటోంది. అదృష్టమో దురదృష్టమో కాని స్మార్ట్ఫోన్ నేడు మానవ దైనందిన జీవితంలో ఒక భాగమైంది. చేతిలోస్మార్ట్ఫోన్ వుంటే చాలు, అందలమెక్కేసినట్లుగా చెలరేగిపోతోంది యువత. ఒక్క యువతే కాదు స్మార్ట్ఫోన్‌కు దాదాపుగా ప్రతిఒక్కరూ బానిసలుగా మారిపోతున్నారు.

10/20/2019 - 23:16

సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతూ, నిత్య నూతన ఆవిష్కరణలు చోటు చేసుకుంటున్న తరుణంలో ప్రచార ప్రసార మాధ్యమాలలో విప్లవాత్మక మార్పులు క్షణక్షణం జరుగుతున్నాయి. వాటన్నిటి కన్నా ప్రస్తుతం నిరక్షర గ్రామీణుల నుండి నిరంతర పరిశోధకుల వరకు చేతిలో అందుబాటులోకి వచ్చాయి అధునాతన సెల్‌ఫోన్లు. వాటి ద్వారా ప్రధాన స్రవంతిలోని మీడియాను మించి సోషల్ మీడియా పని చేయడం సర్వత్రా కనిపిస్తున్నది.

10/18/2019 - 19:31

‘కార్యేషు దాసీ, కరణేషు మంత్రీ, రూపేచ లక్ష్మీ, క్షమయా ధరిత్రి..’ అంటూ స్ర్తి ఎలా ఉండాలో చెప్పారు. మరి పురుషుడు ఎలా ఉండాలో చెప్పలేదా.. ఇదీ కొందరి ప్రశ్న.

10/15/2019 - 18:24

అట్లతద్దె ఆడపిల్లల పండుగ. ఇది ప్రతి సంవత్సరం ఆశ్వయుజ బహుళ తదియ నాడు వస్తుంది. అంటే ఆశ్వయుజ పౌర్ణమి తర్వాత మూడో రోజు వస్తుంది. ఈ పండుగను పెళ్ళి కాని ఆడపిల్లల నుండి, పెళ్లి అయిన స్ర్తిల దాకా అందరూ కలిసి చేసుకునే పండుగ. ఈ పండుగను ‘చంద్రోదయ ఉమా వ్రతం’ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఈ రోజున చంద్ర కళలో గౌరీదేవిని ఆరాధిస్తారు. చంద్రోదయం అయ్యాక పూజను ముగిస్తారు.

10/13/2019 - 22:33

‘పక్కింటి విశ్వని చూడు.. ఉదయం ఐదున్నరకే లేసి బాస్కెట్ బాల్‌కి వెళ్లిపోతాడు. నువ్వు ఉదయం తొమ్మిదైనా నిద్రలేవవు. సెలవులు నీకేనా, ఎవరికీ లేవా?’ అంటూ పనె్నండేళ్ల ఆయుష్‌కి తండ్రి మేలుకొలుపు. ‘సోనాకు 9.8 మార్కులు వచ్చాయి. నీకూ వచ్చాయి 8.3.. అవీ ఓ మార్కులేనా.. ఎప్పుడు నేర్చుకుంటావు?’ అని వైష్ణవికి తల్లి మందలింపు..

10/11/2019 - 18:58

‘నవ్వుతూ బతకాలిరా తమ్ముడూ.. నవ్వుతూ చావాలిరా!’ అన్నాడు ఓ సినీ కవి. నిజంగా ప్రకృతిలో నవ్వగలిగిన వరం మనిషికి మాత్రమే ఉంది. నవ్వు నాలుగు విధాల చేటు అనుకుంటూనే ప్రస్తుతం మనసారా నవ్వటమనే ప్రక్రియను మనుషులు మరచిపోతున్నారు. ఎవరికివారు తాము చివరిసారిగా బిగ్గరగా నవ్విన సమయం, సందర్భం గుర్తుచేసుకునే ప్రయత్నం చేస్తే అది చాలాకాలం క్రితం జరిగిందని అర్థమవుతుంది.

10/10/2019 - 19:15

పర్యావరణం దెబ్బతింటున్నందున ప్రకృతి విపత్తులు పేట్రేగి పోతున్నాయి. ఇది కేవలం ఒక్క దేశానికి పరిమితం అయన అంశం కాదు. విశ్వవ్యాప్తంగా ప్రళయాన్ని సృష్టించగల సమతుల్యత లేని పర్యావరణమే ఇందుకు ప్రథమ కారణం. మానవాళి అడుగడుగునా అనుసరిస్తున్న ప్రకృతిపరమైన విధ్వంసంతో నిత్యప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తున్నాయి. భూభాగంపై నిత్యం పెరుగుతున్న జనాభా వల్ల కీడు జరుగుతోంది.

10/09/2019 - 19:59

ప్రపంచంలో మంచి రుచికరమైన, సురక్షితమైన, పోషకాలు సమృద్ధిగా కలిగిన, చవకగా దొరికే ఆహారం ఏదైనా ఉందా? అంటే- అది ‘గుడ్డు’ అని వెంటనే చెప్పేయవచ్చు. గుడ్డు చూడటానికి చిన్నగానే ఉంటుంది. అయినా ఇది సామాన్యులకు సైతం అందుబాటులో ఉంటుంది. ప్రతి సంవత్సరం అక్టోబర్‌లో రెండో శుక్రవారాన్ని ‘ప్రపంచ గుడ్డు దినోత్సవం’గా జరుకుంటారు.

10/07/2019 - 18:56

అమ్మలకమ్మవై యిల చరాచర సృష్టికి మూలకందమై
ఇమ్ముగ పెన్నిధున్నొపని, ఏడుగదై దయబ్రోచు లక్ష్మివై
క్రమ్మిన చీకటుల్‌దొలగ కాంతి పథమ్మును జూపు దివ్వవై
మమ్ము తరింపజేయుటకు మాత! నవాంశలు దాల్చి వచ్చితే!
1. శైలపుత్రి
శూలము నొక్కహస్తమున చొప్పడ, రెండవ హస్తమందునన్
గ్రోలగ దాల్చి పద్మమును రమ్యతరమ్ముగ, కానిపించు శం
పాలత భంగి భక్తుల కపారముదంబునన్ శైలపుత్రి గా

Pages