S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

05/26/2019 - 20:42

విళ్ల... ఈ పేరుకు ఒక ప్రత్యేక పుట లేకుండా తెలుగు అచ్చు చరిత్రను మనం ఎంత మధించినా అది అసంపూర్ణమే. తెలుగు బీజాక్షర జగతిని అచ్చుల్లో అందంగా ముస్తాబుచేసి తెలుగు జాతి అరచేతుల్లో పెట్టిన మహానుభావుల్లో వావిళ్లవారు అత్యంత ముఖ్యులు. నేడు తెలుగు అచ్చుపుస్తకం చదువుతున్న ప్రతి తెలుగువారికీ ప్రాతఃస్మరణీయులు వావిళ్ల రామస్వామి శాస్ర్తీగారు.

05/20/2019 - 22:47

మనిషితోపాటే కథ పుట్టింది. జీవితం ఎన్ని మలుపులు తిరిగితే సాహిత్యం కూడా అన్ని మలుపులు తిరగక తప్పదు. తెలుగు జీవితాన్ని అంటిపెట్టుకొని ఎన్నో మెలికలు తిరిగిన సాహిత్య ప్రక్రియ తెలుగు కథానిక అంటారు పురాణం సుబ్రహ్మణ్యశర్మ, వాకాటిగార్లు. దిద్దుబాటుతో తొలి కథకు శ్రీకారంచుట్టిన మహాకవి గురజాడ మొదలు వర్తమాన కథకులవరకు వందలాది కథకులు వేలాది కథలను తెలుగు దేశానికి అందించి తెలుగుతేజాన్ని దశదిశలా వ్యాపింపజేశారు.

05/14/2019 - 02:01

తెలుగువాడుగా పుట్టడమే గొప్పదనంగా భావించక నిండైన తెలుగుదనంతో ఆదర్శవంతమైన జీవితం నెరపిన మహానుభావుడు కీ.శే.హోసూరు కె.ఎస్.కోదండరామయ్యగారు. బహుముఖమైన గొప్ప మూర్తిమత్వం వారిది. 1968వ సంవత్సరం చిత్తూరులో జిల్లా రచయతల తొలి సమావేశాలలో ముఖ్యఅతిథిగా పాల్గొని కోదండరామయ్య ప్రసంగించారు. హోసూరు ప్రాంతపు తెలుగువారు ప్రవాసాంధ్రులు కారు. స్థిర నివాసాంధ్రులని పేర్కొంటు అచటివారి సమస్యల్ని ఏకరువుపెట్టారు.

05/06/2019 - 02:36

రవీంద్రుని శతవార్షిక జయంతి వత్సరములో ఆయన ప్రతిభ అనేక విధాల ద్యోతకం చేయడానికి అన్ని దేశాలలోను ప్రయత్నము జరిగినది. భారతదేశంలో అన్ని ప్రాంతాలలోను సంవత్సరంపాటు, కవి రవీంద్రుని స్మృతిచిహ్నంగా ఎన్నో భవనములు నిర్మించారు. ఉత్సవములు జరిపారు. ఉపన్యాసాలు చేశారు. నాటకములు వేయించారు. నవగీతాలు ఆలాపించారు. ఆయన గ్రంథావళిని వివిధ భాషల లోనికి అనువాదం చేయించారు.

04/29/2019 - 22:26

ఓమందూరు రామస్వామిరెడ్డిగారు దక్షిణ రాష్టమ్రుగా విభజింపబడని కాలంలో దక్షిణ ఆర్కాటు, దిండివనం నగరమునకు సమీపమునగల ఓమందూరు గ్రామంలో 1895 ఫిబ్రవరి 1న జన్మించారు. మాతృభాష తెలుగు అయినప్పటికీ ప్రాంతీయ ప్రభావంచే బ్రిటిష్‌వారు నెలకొల్పిన వాల్టర్ స్కడ్డర పాఠశాలలో చేరి తన విద్యాభ్యాసం కొనసాగించి పట్ట్భద్రులై న్యాయశాస్త్రం అభ్యసించి అఖండ ప్రతిభా పాటవాలను ప్రదర్శించారు.

04/22/2019 - 22:11

భారత స్వాతంత్య్ర సంగ్రామంలో పాల్గొని, ఉమ్మడి మద్రాసు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పరిపాలనా దక్షతతో బాధ్యతలను నిర్వర్తించి, రాజనీతి కుశలతను ప్రదర్శించి, ఒరిస్సా గవర్నరుగా ఉన్నత పదవులను అలంకరించి రాజపాళయ తెలుగు రాజవంశస్థుల గరిమను ప్రపంచానికి చాటిన రాజకీయవేత్త కుమారస్వామి రాజు.

04/15/2019 - 23:16

అంతర్వాహిని
పేజీలు: 145 వెల: రూ.100
ప్రతులకు:
దాస్యం సేనాధిపతి,
ఎంఐజి-2-90, హౌసింగ్‌బోర్డ్ కాలనీ
కరీంనగర్- 505001. సెల్: 9440525544
*

04/08/2019 - 22:06

అన్నింటా పురుషాధిక్యమే యుండిన ఆ కాలంలో విద్య, వైద్య, రాజకీయం, సాంఘిక రంగాలలో ముందడుగు వేసి, మహిళా లోకానికి అపారమైన సేవలందించిన బహుముఖ ప్రజ్ఞాశాలి, బహువిధ సేవకురాలైన డాక్టర్ ముత్తులక్ష్మిరెడ్డి గుఱించి తమిళనాట తెలియని వారుండరు. సాంఘిక సంస్కరణోద్యమంలో కూడా పాల్గొని రాణించిన మహిళా నాయకమణి ముత్తులక్ష్మి. ముత్తులక్ష్మి 1886 జూలై 30న పుదుకోటలో జన్మించారు. తండ్రి నారాయణస్వామి, తల్లి చంద్రమ్మ.

04/01/2019 - 21:54

సౌజన్యంబను మేకతోలు మెయినాచ్ఛాదించుకొన్నట్టి రుూ
రాజుల్ రాజులె? దొంగ బెబ్బులులు; వీరా? మా శ్రమ స్వేద పా
థోజాలంబు హరియించువారు; కృతియిత్తున్ మెచ్చి గైకోగదే!
నీ జిహ్వాగ్రములన్ ధనంజయుడ! రాణింపన్ జిరస్థాయిగన్‌॥

04/01/2019 - 21:53

ఆరుద్రలో అడ్డెడు చల్లిన పుట్టెడు పండుననేది నేటికి ఆంధ్ర దేశంలో ప్రతి నిత్యం విన్పించే నానుడి. కార్తెల్లో ఆరుద్ర అంతటి విశిష్టమైనదన్న మాట. సాహితీ చరిత్రలో ఆరుద్రగా చెరగని ముద్ర వెయ్యగలిగిన భాగవతుల శివశంకరశాస్ర్తీ ఉత్తరాంధ్ర నివాసి ఐనప్పటికి పత్రికలో చదివిన కథనానికి స్పందించి త్వమేవాహమ్ కావ్య రచన చేసి తెలంగాణ పోరాటంలో పాల్గొనక పోయినా పోరాటం పట్ల ప్రగాఢ సానుభూతిని కావ్యనామంలోనే ప్రతిధ్వనించారు.

Pages