S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

11/19/2018 - 06:54

పేజీలు: 109, వెల: రూ.80/-
ప్రతులకు: దాసోజు లలిత,
ఫ్లాట్ నెం.3, వీధి-8, శక్తినగర్,
చింతకుంట పాత చెక్‌పోస్ట్,
హైదరాబాద్-74
సెల్: 9542869968
================

11/12/2018 - 00:04

నిజమైన కవి ఎప్పుడూ- పరుల ప్రాపుకో ప్రాపకానికో, సంతోషానికో, సంతృప్తికో, మెప్పుకో- గొప్పకో రాయడు. తనను తాను చీల్చుకుంటూ- కాల్చుకుంటూ- పుటంపెట్టి పరీక్షించుకుంటూ అదొక పవిత్ర ధర్మంలానే రాస్తాడు.

11/05/2018 - 06:45

పాటలతో కన్నీళ్ళెట్టించి, వీణానాదంతో విస్మయం కలిగించి, మనసున్న మబ్బుతో మాటల జతకట్టి అభిమానుల స్మృతులలో నిలువెత్తు విగ్రహంగా నిలిచిపోయిన మహనీయులు ‘విశ్వం’గారు.

10/29/2018 - 22:43

కవిత్వంలో భాష, భావ శిల్పాలలో పరాకాష్టనందుకొని మహాకవిగా, భావ కవితా చక్రవర్తిగా, వక్తగా, దేశభక్తుడిగా, గాయకుడిగా, మానవతవాదిగా, హాస్యప్రియుడిగా, సహృదయుడిగా ప్రజల మనస్సుల్లో సుస్థిరమైన స్థానం సంపాదించుకున్న విశిష్ట కవి దేవులపల్లి కృష్ణశాస్ర్తి గారు. వీరి కవిత్వం ఎప్పటికీ నిత్యనూతనమే. ఆకాశంలో మిలమిల మెరిసే తార కృష్ణశాస్ర్తి కవిత. కృష్ణశాస్ర్తి పాండిత్యం కంటే ప్రతిభ నవ నవోనే్మషంగా ఉంటుంది.

10/22/2018 - 06:33

ఒక దీపం యిచ్చే వెలుగు, ఒక ఆవు యిస్తున్న పాలనుబట్టి వాటి విలువలు వున్నట్టే, సంతోషం, సేవించడం, పిల్లల్ని కనే సామర్థ్యంబట్టి స్ర్తి విలువ, పొందుతోంది’’ 90 సంవత్సరాల క్రితం, ‘ఆమె’ బతుకు తీవ్రంగా అణచివేతకు గురిఅవుతున్న రోజులలో జీవితమే సాహిత్యంగా నాటి సంఘంపై గుడిపాటి వెంకటచలం కొరడా ఝుళిపించారు. ‘మేన్ అండ్ ఉమన్’ చలం నాటి ఆంగ్ల రచనలోని ఇతివృత్తం అది. ‘‘స్ర్తికి కూడా శరీరం వుంది.

10/15/2018 - 06:57

దూరంగా ఓక వ్యక్తి జీవితమంటే ఏంటని కేక వేశాడు. రకరకాల గొంతులు సమాధానాలు విసురుతున్నాయి. ఒక గొంతు ఎలాంటి భయం, అనుమానం, తడబాటు లేకుండా జీవితమంటే అజేయం అని ముక్కుసూటిగా చెప్పింది. జీవితంలో ఏమి సాధించామని ఎవరైనా అడిగితే జీవించి ఉండటమే సాధించామని చెప్పండి. పిరికితనంతో ఆత్మహత్యలు చేసుకోకపోవడమే అజేయమని చెప్పండి.

10/01/2018 - 00:07

జన్నాభట్ల నరసింహప్రసాద్ సుప్రసిద్ధ కథకుడు. లోగడ వీరి రచనలు వివిధ పత్రికలలో ప్రచురించబడ్డాయి. ఇప్పుడు అవి గ్రంథ రూపంలో వచ్చాయి. గ్రంథము పేరు జన్నాభట్ల కథలు-4. ఇందులో సుమారు 15 కథలు ఉన్నాయి. అన్నీ సాంఘిక సమకాలీన ఇతివృత్తాలతో మనల్ని ఆలోచింపచేసేవిగా ఉన్నాయి. పేరుకు ఇవి కల్పితాలే అయినప్పటికీ ఇందలి పాత్రలన్నీ సజీవంగా మన కళ్ళముందు మనచుట్టూ తిరుగుతున్న వ్యక్తులనుండి తీసుకొన్నవి.

09/24/2018 - 04:40

ప్రాచీన, మధ్యయుగ చరిత్ర నిర్మాణానికి శాసనాలు, ముఖ్యమైన ఆధారాలు కొత్త శాసనాలు వెలుగులోకి వచ్చినప్పుడు చరిత్రను పునర్నిర్మించుకోవలసిన అవసరం ఏర్పడుతుంది. అలాగే ఇప్పుడు కృష్ణదేవరాయల ఆస్థానంలోని అష్టదిగ్గజ కవుల్లో తప్పక చేర్చాల్సిన మరోకవి ‘కృష్ణదేవరాయ భూషణ అచ్యుత దేవరాయ భూషణుడు’ మరో శాసనం ద్వారా వెలుగులోకి వచ్చాడు.

09/16/2018 - 22:46

గురజాడ వారికప్పుడు ఎనిమిదేళ్ళు. రాయవరంలో ఉండే మాతామహుల ఇంటికి వెళ్ళాడోసారి గురజాడ. తాతగారు కృష్ణయ్య పంతులుగారు కోర్టులో సిరస్తదారు. తాతగారికి అప్పుడప్పుడూ సాయంకాలంపూట టిఫిన్ తీసుకొని వెళ్ళి ఇచ్చి వస్తూ ఉండేవాడు గురజాడ. అలా ఒకరోజు తాతగారికి టిఫిన్ ఇచ్చి కోర్టు ఆవరణలో చెట్లక్రింద తోటి పిల్లలతోపాటు ఆడుకుంటున్నాడు.

09/10/2018 - 01:21

కాలగమనంలో సామాజిక హితాన్ని కాంక్షించే రసాయనిక చర్యల్లో సాహిత్యం ఉత్ప్రేరకంగాను పనిచేస్తుంటుంది. సమాజంలో దుష్పరిణామాలను హరించే మంచిని పెంచే చర్యలను వేగవంతంగా ప్రోత్సహించే చైతన్యాన్ని సాహిత్యం కలిగిస్తుంటుంది. అంతటా ఆవహించిన అస్థిరతను, అస్థిమితాన్ని పటాపంచలుచేస్తూ, మనిషిని ఒంటరితనం నుంచి కాపాడే కారకాలను ప్రజాసాహిత్యం అందిస్తుంటుంది.

Pages