S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

07/15/2019 - 22:09

నేడు మనిషి నిర్వాకం కాకుల్ని తోలేసింది;
వాణ్ణి ఏకాకిగా మిగిల్చింది;
పిచ్చుకల కిచకిచల్ని ఇప్పుడనే్వషిస్తున్నాడు;
అది వఠ్ఠి పిచ్చి కల!
ఈనాటి పారిశ్రామికీక‘రణం’
ఏనుగుల్ని పీనుగుల్ని చేసింది;
వాడి బతుకుని పీనుగు పెంట చేసింది;
ఖఊళ్ళపైకి ఉరికి చిరుతపులి
విధ్వంసాన్ని సృష్టిస్తోందంటే
కారణం - ఈ మేకవనె్న పులే;
చేప ప్రమాదం హోరు

07/15/2019 - 22:08

కన్నీళ్లే...
ఆనందంలో రాల్చేవి బాష్పాలు
దుఃఖంలో రాల్చేవి అశ్రువులు
భావోద్వేగాలు చేసే... మహా క్రతువు

చెట్లు... మోడుబారుతవి
చిగురించి ఆశలు రేపుతవి
ఋతుచక్ర గమనమే...
మహా క్రతువు

07/15/2019 - 22:02

నాకు నేను
కొత్తగా కనబడుతున్నాను
ఒక కొత్త కవిత రాసుకున్న వేళ
మంచి మనిషితో
మనసు విప్పి తనివితీరా మాట్లాడిన వేళ
కలల సముద్రం దగ్గర నిలబడి
నా ఆలోచనలన్నీ కవితలుగా అల్లుకుని
ఆశయాల తీరమై నిలబడిన వేళ
నాకు నేను కొత్తగా కనబడుతున్నాను
ఎంతో ఉల్లాసంతో హాయగా
ముందుకు సాగిపోతున్నాను

07/15/2019 - 21:58

సుధామ మనోభూమిక
వెల: రూ.300/-
: ప్రతులకు :
ప్రముఖ గ్రంథ విక్రయశాలల్లో..
*

07/08/2019 - 22:39

చిత్రం నీదైతే
కవనం నాది

రూపం నీదైతే
భావం నాది

దృశ్యం నీదైతే
భావుకత నాది
శిల్పం నీదైతే
సృజనాత్మకత నాది

హృదయం నీదైతే
స్పందన నాది

దేహం నీదైతే
ప్రాణం నాది

07/08/2019 - 21:50

వాడు
కూతుర్ని చంపి
కులానికి వేలాడదీశాడు
మతానికి మానవతను వెలేసినోడు
నిజానికి మనిషినని మరిచినోడు

07/08/2019 - 21:48

కవిత ఓ పరమాన్నం
ఎప్పుడూ తింటే రుచించదు
ఓ పండుగ ఓ పబ్బంలా
సమయం సందర్భం
ఎంతో అవసరం మరి
అవి వచ్చినప్పుడు మాత్రం
పిలవకనే వచ్చిన ఆప్తులవలె
పలకరించిపోతుంది
తన సాహచర్యం లేని
జీవితాన్ని ఊహించాలంటేనే
గుండె బరువెక్కిపోతుంది
అందుకే తన కోసం ఎదురుచూపు

07/08/2019 - 21:45

‘విప్రోత్తమా! విన్నవించుకో
ఏంకావాలో’ అని అడిగిన ఏలినవారికి
‘కొమరుని వివాహం, నాకు ఉపనయనమన్న
వృద్ధ విప్రునికి ‘ఉపనయనమిప్పుడేమిట’ని
విస్తుపోయిన ప్రభువుల వారికి
ప్రహేళికగా తోచింది !
‘రాయల’ వారి లాంటి రాజుకి తట్టినదే
నాకూ స్ఫురించిన శే్లష -
సర్వేంద్రియణాం
నయనం ప్రధానమనే
నయనానికి ఉప నయనమని
అన్వయించుకుంటే --

07/08/2019 - 21:40

ఆచార్య శిప్రముని పీఠం (వేదవిజ్ఞాన ప్రచార పరిశోధనాసంస్థ) వ్యవస్థాపక అధ్యక్షులు ముదిగొండ శివప్రసాద్ రచించిన ‘వ్యాసదర్శనము’ గ్రంథావిష్కరణ కార్యక్రమం ఈ నెల 9న చిక్కడపల్లి త్యాగరాయ గానసభలో జరుగుతుందని గ్రంథ రచయత ఒక ప్రకటనలో తెలిపారు. ఆచార్య శిప్రముని పీఠం, త్యాగరాయ గానసభ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ప్రముఖ సాహితీవేత్త సుధామ అధ్యక్షత వహిస్తారు.

07/01/2019 - 22:11

కొమ్మకొమ్మన చేరి కోయల కూనిరాగము తీసెనే
కమ్మకమ్మని రాగముల్ గమకంబు తోడుత పాడెనే
రమ్మురమ్మని పిల్లలందరు రాచమామిడి చూపిరే
చెమ్మగిల్లిన మానసంబున చింతలన్నియు తీరెనే!

గున్నమామిడి పచ్చపచ్చని కోక పొంకము గాంచుచున్
వనె్నచినె్నలెరింగి రివ్వున వాలిపోయెను తోటలోన్
ఎన్నరాని స్వరంబుతో భువికెంత సంబరమయ్యెడిన్
చెన్నుమీరె వసంత రాగము చెట్టుచెట్టున చేరగన్

Pages