S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

07/01/2019 - 22:10

తిమిరానికి అసహనం
ఉషస్సును చూస్తే
గాఢాంధకారానికి
వెలుగు రుచి చూపిస్తుందని
అంధకారాన్ని తరిమేస్తుందని

నిజాయతీకి అసహనం
అబద్ధాన్ని చూస్తే
తన నిజాయతీకి
కళంకం తీసుకొస్తుందని

మతవ్ఢ్యౌనికి అసహనం
లౌకికతత్వాన్ని చూసి
ఎక్కడ తన అభిమతం
మార్చేస్తుందోనని

07/01/2019 - 22:08

మనిషి పుడతాడు
ఒక దివ్య ఫలంతో..
ఒక పదునైన చాకుతో..
ఆకలైనప్పుడల్లా
చాకుతో పండును కోసుకొనటానికి
ఆనందంగా బతకటానికి...

ఆ పండు మామూలు పండు కాదు,
ఎంత కోసుకుతిన్నా తరగదు అక్షయ పాత్రలా..
కానీ ఒక నిబంధన - క్రమం తప్పకుండా
స్వయం కృషితో ‘చార్జి’ చేసుకుంటూ ఉంటేనే
దివ్యఫలం నిలిచేది, భవ్యరసం అందించేది

07/01/2019 - 22:05

నక్షత్రాలై వెలిగే కళ్ళలో
ఇంకా రంగులు వెలియని
బొమ్మల ప్రపంచం కదలాడ్తుండగానే
ఆ గేట్లు తెరుచుకుంటాయి!
ముద్దులొలికే మొగ్గ శరీరాల్ని
యూనీఫారాలు కబళిస్తాయి!
ఆటల తోటనుంచి బయలుదేరిన
నాజూకు సీతాకోక చిలుకల పెడరెక్కలను
అక్షరాల దారాలు విరిచికడ్తాయి!
పట్టువదలని గట్టి పదాలు
చిట్టి నాలుకలను ఒడిసిపట్టి
సిలబస్ కత్తులతో సానపడ్తాయి!

06/24/2019 - 22:44

ఉదయ సంధ్యారాగమే
కనిపించని ఈ పట్నవాసం నాకెందుకు?
‘అంబా’ అనే తువ్వాయ
గెంతులే కనిపించని
ఈ పట్నవాసం నాకెందుకు?
అమృతధారలే కురిపించే
గోమాతలే కానరాని
ఈ పట్నవాసం నాకెందుకు?
ఏ వీధి కేగినా
బాగున్నావా అనేవారు లేని
ఈ పట్నవాసం నాకెందుకు?
కనిపించిన ప్రతిసారీ
పద్యాలతో పలకరించే
తెనుగు మాస్టారు లేని
ఈ పట్నవాసం నాకెందుకు?

06/24/2019 - 22:43

ఓటమి, గెలుపు సరిహద్దులు చెరిగిపోయ
తలలు తెగిన మొండాల్నుండి
నెత్తురు చిచ్చుబుడ్ల వెలుగుల్లా చిమ్ముతుంది!
ఉదయం లేని, మధ్యాహం లేని,
సాయంత్రం లేని
ఆకాశం పడగలు విప్పుతూ
ఇంద్రధనుస్సులని మింగేస్తుంది!
వేల జతల దుస్తులు ధరిస్తున్నా
దేహ నగ్నత్వ దర్శనం దరిదాపుల్లోనే!
కాళ్లూ చేతులూ కన్నీటి సాగరంలోనే
జలియన్ వాలా బాగ్ సర్పం

06/24/2019 - 22:43

కాలం
ప్రవహించే క్షణాలన్నీ
చిగురు బంధంగా అనుబంధమైంది
సీతాకోక చిలుక తోటలో
దీపమై వెలిగింది
చీకటి హృదయంలో
నిశ్శబ్దంగా తేదీల్లో చిక్కుకున్న కాలం
గాయాలకు అనుభూతుల వెల్లువైంది
మళ్లీ మళ్లీ చినుకులా
మనసు వెనుక పరిమళించే పువ్వులా
కొత్త వెలుగులు
కొద్ది రోజులకు ముందు
సీతాకోక ఓ గొంగళీపురుగు
నేడు అందాల హరివిల్లు తోటలో

06/24/2019 - 22:41

నీ ప్రతి అక్షరం
నా మానస వీణను
మీటుతూ

నీ ప్రతి పదం
నా హృదయాంతరాళాన్ని
స్పృశిస్తూ

నీ ప్రతి వాక్యం
నా మనోఫలకాన్ని
పలకరిస్తూ

నీ సాంగత్యం
నా మూర్తిమత్వాన్ని
తీర్చిదిద్దుతూ
నను మనిషిగా
నడిపిస్తున్న నీకు
ఏమివ్వగలను?

హృదయపూర్వక
ఆలింగనం తప్ప...
- కయ్యూరు బాలసుబ్రమణ్యం
9441791238

06/17/2019 - 22:53

ఆ చౌరస్తాలో
మేకవొకటి ఎదుగుతున్నది
ఈ కాంక్రీటు వనంలో
ఆ నాలుగు కాళ్ళ అమాయకత్వం
మేత వెతుకుతున్నది
కదిలే ఆ మాంసంపై ఎన్ని దొంగ చూపులున్నాయో
ఇంకెన్ని కళ్ళు లొట్టలేసుకుని చూస్తున్నాయో
ఆ క్రూరజంతువు ఎటూ తప్పిపోకుండా
ఏ కనుచూపు కంచె కాపు గాస్తున్నదో..

06/17/2019 - 22:51

విధి నన్ను చూసి వెక్కిరిస్తోంది
నీకై నే నిర్మించుకున్న ఊహాసౌధాన్ని
పునాదుల్లేకుంటా కూల్చేశాననీ

గడ్డిపరకలు సైతం
గలగలమంటూ నవ్వేస్తున్నాయ్
కడసారి కదలివెళ్లిన నీ అడుగుల
గుర్తుల్ని చీల్చేస్తూ మొలకెత్తామనీ...

కాలం విర్రవీగుతోంది
నీకు నాకు మధ్య దూరాన్ని
ఒక జీవిత కాలం పెంచేశాననీ...

06/17/2019 - 22:50

అది తప్పేం కాదు
అప్పుడప్పుడు
చెప్పుల్లేకుండ నడవడం..

ఏ గతుకుల్లేని
గంభీరమైన
సిమెంటు రోడ్డుమీదే కాదు
గులకరాళ్ళు, గుండ్రాళ్ళు, సూదిరాళ్ళు
చుప్పనాతి ఎదుర్రాళ్ళ మీదుగా
కరుకు గరుకు రాళ్ళ మీదుగా చూసుకుంటూ
సున్నితంగా సుతారంగా ప్రయాణించు..

Pages