S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

04/23/2018 - 02:06

1976లో, కోఠీలోని గాంధీ జ్ఞాన్‌మందిర్‌లో ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయిత సంఘం రాష్ట్ర మహాసభ జరిగింది. రజనీ (బాలాంత్రపు రజనీకాంతరావు) ఆ సభల్లో పాల్గొని ‘పాట’ గురించి మాట్లాడారు. నేను ఆయన్ని చూడ్డం అదే మొదలు. నాకప్పుడు 17-18 ఏళ్లు. లలిత గీతం పుట్టుపూర్వోత్తరాలను రజనీ ఆ ఉపన్యాసంలో గొప్పగా రికార్డ్ చేశారు. బెంగాలీ ప్రభావం ఆయనకి వంశపారంపర్యంగా సంక్రమించిన భాగ్యం.

04/23/2018 - 01:59

గేయమైనా, వాగ్గేయమైనా
ఆయనకు స్వరకరతలామలకం. దశాబ్దాల తెలుగు సాహితీ రంగాన్ని భిన్న కోణాల్లో పరిపుష్ఠం చేసిన సంగీత స్రష్ట బాలాంత్రపు
రజనీకాంతరావు. ఆకాశవాణిలో ఆయన ప్రయాణం తెలుగునేలను సాహితీ, సంగీత పరవళ్లు
తొక్కించింది. సంగీత సారస్వతాలు మేళవించిన బాలాంత్రపు
తెలుగు నేలకు నిత్య దిక్సూచి.

04/16/2018 - 03:17

చీకటిలో పడిపోతోంటే
ఆకటితో చనిపోతోంటే
దూరపు వెలుగులు తెచ్చినదెవరో
తీరని యాకలి తీర్చినదెవరో
మురుగు కాలువ ముందు వాసనలు
తరిగేస్తోంటే గర్భ గోళములు
తూములెత్తి మురుగంత సముద్రపు
దారి పట్టించిన పరదారులునెవరో
ఒకటే పాత ఒకటే రోత
కకవికలైన ప్రపంచంటెల్లను
చికిలి చేసి క్రొమ్మెరుపులు తెచ్చిన
శిల్పి ఎవరో శ్రీజల్పి ఎవరో

04/16/2018 - 03:15

అతను అంతగా అహంకరిస్తాడు గానీ
నిజానికి ప్రకృతే గురువని గుర్తించలేడు
రెక్కలు లేని మనిషి
ఆకాశంలో విహరించమంటే
కళ్ళు విప్పితే కరిగిపోయే కలకి కూడా
బలం ఉందనే పాఠం నేర్వడమే!

నిద్రలేని రాత్రుల బాటలో
అతను సంధించిన విమానాస్త్రం
తొలి రూపురేఖల విన్యాసాలు చూస్తుంటే
మనిషికింత భావనాబలాన్ని ప్రసాదించిన
చిన్న పిట్టలకు చేతులెత్తి మొక్కాలనిపిస్తుంది

04/16/2018 - 03:14

పిడికెడు మట్టిని తీసుకొని
స్నానించాను
దేహం కొత్త పరిమళాలు
వెదజల్లుతోంది
చెమటను శ్వాసించిన మట్టి
కొత్త పూల చెట్లను
వికసింపజేస్తోంది
దేహం
కొత్త పూల వెలుగులో
ప్రకాశిస్తోంది
నెత్తిపై కొత్త చెట్లు
మొలకెత్తాయ
రకరకాల కాయలు, పళ్లు
విరగకాస్తున్నాయ
దేహం మట్టిని
తయారుచేసే కర్మాగారమైంది

04/09/2018 - 00:34

ఎండలో కాగుతున్న
ఆ కానుగ చెట్టు
నాకు మిట్టమధ్యాహ్నం
నదీ స్నానం చేసినట్లుంది!

నీడ పట్టునే్న ఉండే నాపై
ఆ చెట్టుకెందుకంత మమకారం?
పరహితార్థంగా పాఠం చెబుతున్నట్లుంది

వేడిమిని ఎదిరించి
మూలకు కూర్చున్న ఆ మట్టికుండ కూడా
నా దాహానికి చలువ పందిరి వేస్తున్నది
నేనేం ప్రత్యుపకారం చేయకపోయనా
మట్టి ఇంకా రక్తస్పర్శన కోల్పోలేదు!

04/02/2018 - 00:25

శృతిలో ఉందంటే
ఆ పాటలో
ప్రాణం ఉన్నట్లే కదా!

సాంత్వన కల్గిందంటే
ఆ జలధార
జీవధార అయనట్లే కదా!

మది పులకించిందంటే
ఆ గానంలో
గాంధర్వం ఉన్నట్లే కదా!

పరవశం కల్గిందంటే
ఆ శ్వాసలో
ఓ పరిమళం ఉన్నట్లే కదా!

హృదయాంతరాళాన్ని
తాకిందంటే
ఆ కవితలో
ఓ రసానుభూతి ఉన్నట్లే కదా!

04/02/2018 - 00:23

నా కవితా విహంగం
ఊహల రెక్కలు కట్టుకుని
స్వేచ్ఛగా విహరిస్తుంది

నా కవితా జలపాతం
జన జీవన స్రవంతిలో
స్వచ్ఛంగా ప్రవహిస్తుంది

నా కవితా మలయ మారుతం
ఆశను శ్వాసగా మార్చుకుని
నిశ్చయంగా నినదిస్తుంది

నా కవితా విలయతాండవం
విప్లవాన్ని ఊపిరి చేసుకుని
నిర్భయంగా నాట్యం చేస్తుంది

04/02/2018 - 00:22

ఏకాంతం ఏకాంతమంటూ
ముద్దుగా పిలుచుకునే ఒంటరితనమెందుకో
ఒకోసారి మారం చేస్తుంది
నిజాల లెక్కలు తేల్చాల్సిందేనని
అహానికి ఎదురుతిరుగుతుంది

బాహ్యానికి అంతరాళానికీ మధ్య
అడ్డుగోడలా నిలబెట్టిన నిర్లిప్తత
ఇక వల్లకాదంటూ చేతులెత్తేస్తుంది
లోలోన నీలపు బరువు ఉవ్వెత్తున పొంగుతుంటే

04/02/2018 - 00:20

నీ చిలిపి కళ్ళతో సంకెళ్ళు తొడిగావు
నీ చిరునవ్వుల తేనె ఊబిలో
నన్ను నిట్టనిలువునా ముంచెత్తావు
ఇంకేముంది
కలలతో కడుపు నింపుకొంటూ
నీ కాళ్ల చెంత పడివుంటా
వెనె్నల కూసే స్వరం కోసం
మెరుపై కురిసే స్పర్శ కోసం..

- డాక్టర్ డి.వి.జి. శంకరరావు,
9440836931

Pages