S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

03/05/2018 - 00:41

ప్రపంచ కవితా దినోత్సవం సందర్భంగా పానుగంటి ఫౌండేషన్ సహకారంతో కవిసంధ్య, కవిత్వ పత్రిక నిర్వహించిన కవితల పోటీలో విజయవాడకు చెందిన బంగార్రాజు కంఠ కవిత ‘గాడ్స్ డెత్ సర్టిఫికెట్’ మొదటి బహుమతి గెలుచుకుంది. యానాంకు చెందిన పి.అశోక్ కుమార్ కవిత ‘ఇంటి పాదాలవద్ద’ ద్వితీయ బహుమతినీ, వరంగల్‌కు చెందిన బండారి రాజ్‌కుమార్ ‘నల్లకుందేలు’ కవిత తృతీయ బహుమతినీ గెలుచుకున్నాయ.

03/05/2018 - 00:40

కాలం అప్పుడప్పుడు
కన్నీటి గాయాల మీంచి నడిచెళుతుంది
పగిలిన అద్దాల్లాంటి రోజుల్ని ఏరుకుంటూ
విడిపోయ వగర్చే క్షణాల్ని దోసిలిలో పట్టుకుంటూ
ఆవిరైపోయన ఆశల పొగని బుడ్డీలో దాచుకుంటూ
కాలం అప్పుడప్పుడు కన్నీటి గాయాల
మీదనుంచి నడిచెళుతుంది..
ముసుగు కప్పుకుని
తాగివాగే మైకాన్ని చీత్కరించుకుంటూ
ఎదుటివారి మీదకు చూపులను చెక్కి

02/26/2018 - 00:44

తెగిన వాక్యాల్ని తిరిగి సిద్ధం చేసుకుని
భాషల్ని లోలోపలికి అనువదించుకుని
ఆశల్ని ఆవాహనం చేసుకుని
కొత్త గొంతును సవరించుకున్నాక
మరో ప్రయాణం మొదలైంది
నిర్బంధాల వంతెనమీద నడుస్తుంటే
సహస్ర స్వరాల వెదురుగొంతుల వేదన
ఆర్తుల్ని దిద్దుతున్న అమ్మ గుండె అనిపించింది
నిజమే.. హృదయ ప్రమిదల్లో ఎన్ని చీకట్లో
నిశ్శబ్ద స్వరాల ప్రసారంలో

02/26/2018 - 00:42

మహాత్మా జ్యోతిభా పూలే ఆలోచనలు విస్తరించుకుంటూ దేశవ్యాపితంగా బీసీ చైతన్యం పదునెక్కుతోంది. ఈ నేపథ్యంలో గతం నుంచి భవిష్యత్తుకు తెలుగు సమాజంలోని బీసీలు ఐక్యతతో అడుగులు వేయవలసి ఉంది. బీసీ తాత్త్విక చింతనతో ఎవరి కుల మూలాలనుంచి వారు రాసుకోవాల్సి ఉంది.

02/26/2018 - 00:42

సూర్యస్పందన
(రచనా సంకలనం)
-వేదం సూర్యప్రకాశం
వెల: రూ.30
ప్రతులకు: రచయిత
ఎ-జి-3, పావని ప్రిస్టేజ్
అపార్ట్‌మెంట్
అపోజిట్ మోర్ సూపర్ మార్కెట్
మాగుంట లేఅవుట్
నెల్లూరు - 524 003.
*

02/26/2018 - 00:40

ప్రవర నిర్వేదము (కావ్యం)
-ఆచార్య అనుమాండ్ల భూమయ్య
మనస్వినీదేవి ప్రచురణ
ప్రతులకు: నవోదయ బుక్‌హౌస్
ఆర్యసమాజ్ రోడ్
కాచిగూడ,
హైదరాబాద్-27.
వెల: రూ.100
*

02/12/2018 - 05:43

చరమ మోహనమగు దివాచ్ఛాయలందు
సంజ కెంజాయ దానిమ్మ సగము విచ్చె
ప్రణయ సుకుమార గీతముల్ పాడుకొంచు
ముగ్ధ హృదయాలు క్రొంగొత్త మోసులెత్తె...

గోధూళి నీరెండ గొనబు
ఆకురాలు క్షణాన్ననుభవిస్తూ
నక్షత్ర గుచ్ఛం నూలుకొలిపె ముహూర్తాన్ని
ఆకాశానికందిస్తాయ...

02/12/2018 - 05:41

తెలుగు, ఆంగ్లం, సంస్కృత భాషలను చక్కగా అధ్యయనం చేసి ఆధ్యాత్మిక, ఇతిహాస, నీతి గ్రంథాల నుంచి ఆణిముత్యాల లాంటి అంశాలను 112 పేజీలలో అందించడం అంటే కత్తిమీద సాము లాంటిదే. సారస్వత సరాలు అనే విలువైన పుస్తకాన్ని డాక్టర్ శ్రీమతి కె అరుణావ్యాస్ అందించారు. ఈ కరదీపికలో 17 అంశాలపై రచయిత్రి చక్కగా విపులీకరించారు.

02/12/2018 - 05:38

ఈ రోజంతా అచ్చంగా నాదే
ఇంటికి వచ్చీ రావటంతోనే
రారమ్మని పిలిచే సన్నజాజి తీగెలు
పెరట్లోకి ఇంకా తొంగి చూడలేదనే కోపంతో
తూనీగల దండులా చేసే దాడిని
మురిపెంగా వారిస్తుంటే
కొన్ని అలకలుః
మరికొన్ని వేడుకోళ్లు
వెక్కిరిస్తూ కొన్ని
వేదనలో ఇంకొన్ని

02/12/2018 - 05:33

భాషా సాంస్కృతిక శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సహకారంతో తెలుగు శాఖ, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, యానాం, కవి సంధ్య సంయుక్త నిర్వహణలో ప్రముఖ అభ్యుదయ కవి పఠాభి శత జయంతి ఉత్సవం ఈ నెల 19న యానాంలో జరుగుతుంది. ఈ సందర్భంగా ‘పఠాభి సాహిత్యం - ప్రాసంగికత’ అనే అంశంపై ఒకరోజు జాతీయ సాహిత్య సదస్సు నిర్వహిస్తున్నారు.

Pages