S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డైలీ సీరియల్

05/21/2019 - 19:20

ధూప ధీప నైవేద్యాలను దేవికి ఆరగింపు చేసింది. అక్కడున్నవారికందరికీ అమ్మ ప్రసాదాన్ని అందించింది. తాను అమ్మ ప్రసాదాన్ని తనకిచ్చిన వరంగా భావించి సేవించింది.
ఆరుబయటకు వచ్చింది.

05/20/2019 - 22:20

తన మనసులో కూడా అందచందాలు మంచితనమూ కలగలసిన రూపం ఉంది కనుక అగ్నిద్యోతనుడు చెప్పిన వన్నీ విని కృష్ణుడు మరేం ఫర్వాలేదు. నేను తప్పక అక్కడికి వస్తాను. కానీ ఏ యుద్ధం లేకుండా తీసుకొని రావలంటే ఎలా వీలవుతుంది. అభయం కోరినవారిని నేను ఎన్నడూ కాదనలేను. నా అండ కోరిన వారికి తప్పక నాసాయం వారికి అందుతుంది.

05/20/2019 - 22:18

తనకు ఆప్తులైనవారు ఎవరున్నారు. ఎవరు రుక్మికి హితవు చెప్తారా అని క్షణమొక యుగంగా గడుపుతోంది.
అంతలో ఆమె చెలికత్తెల్లో ఒక చపలాక్షి వచ్చి ‘అమ్మా! రుక్మికి హితబోధ చేయడమూ ఆయన ఒప్పుకుని మిమ్ములను కృష్ణయ్యకిచ్చి వివాహం చేయడం అనేది చాలా కష్టమైంది.’ అని ఏదో చెప్పబోతుండగానే రుక్మిణి

05/17/2019 - 22:38

ఆ తల్లి చిరునవ్వు తో నమస్కారం మహర్షి వర్యా అందంటే చాలు.. నాపై ముత్యాల వాన కురిసినట్టు ఉంటుంది ఇంకా చెప్పబోతుంటే ‘ఏమిటీ మీరు కల్యాణీతో మాట్లాడి ఇక్కడకు వస్తున్నారా.. ’అన్నాడు కృష్ణుడు.

05/17/2019 - 22:21

అయ్యో ఎందుకు చెప్పానా ఈ విషయం అని ఆ చెలికత్తె మాట రాక ఉండిపోయింది.
‘అమ్మా రుక్మిణీ దేవీ ఎందుకంత విచారం ? మీరోమాట ఆ కృష్ణయ్యకు చెబితే సరిపోతుంది కదా. ఇక ఆ కృష్ణుడే వచ్చి రుక్మి ని మూలన కూర్చోబెట్టి మీ చేతిని అందుకుని ప్రాణిగ్రహణం చేసుకొని వెళ్తాడు కదా. దీనికే ఇంత విచారం వ్యక్తంచేయాలా.. ఆ చిలుక చూడండి. మీరు చిన్నబోయారని తన ముందున్న దానిమ్మ గింజలను తోసివేసింది.’అంది మరో చేలియ.

05/15/2019 - 22:26

ఎర్రమందారాన్ని కోయబోతున్న చేతులను చూసి, ఎర్రమందారం నేనే బాలబానుడిని అనుకరిస్తున్నానుకొంటుంటే ఈ ఎర్రదనమేమిటి నన్ను మించిన వనె్న కలిగి ఉందని విచ్చుకోబోతున్న మందారం మరింతగా వికసించింది. కనుమరుగు అవబోతున్న నెలవంక ఇక్కడ కుదురుకుందా అన్నట్టుంది ఆమె నుదురు. సూర్యునితో మరోసూర్యబింబం వచ్చిందాన్నట్లుంది ఆ నుదురుమీద తిలకం బొట్టు. ఆమె కనుగొమ్మలు మన్మథుని వింటిని పోలి ఉన్నాయి.

05/15/2019 - 22:13

ఆ కృష్ణ కవచము అగస్త్యుని ఆశ్రమంలో కదా లభ్యమయ్యేది. ఇక అగస్త్యుని దగ్గరకు ఇతడు వెళ్తాడు. మనమూ పరశురామునితోనే వెళ్దాం అని అవి మాట్లాడుకున్నాయి. ఆ మాటలు విని ఆశ్చర్యంతో పరశురాముడు అగస్త్యాశ్రమానికి వెళ్లాడు. అక్కడ ఆ అగస్త్యుని వల్ల కృష్ణ కవచము, కృష్ణాష్టోత్తరము విన్నాడు. భార్గవ రామునితో కలసి ఆ జింకలు కూడా కృష్ణాష్టోత్తరాన్ని విన్నాయి.

05/13/2019 - 19:51

ఆ తరువాత మాహీష్మతీ పురానికి కార్తవీర్యార్జునుడు వచ్చి రావణాసురునితో ‘నీవు వీరాధి వీరుడని విర్రవీగకు. ఒక్కసారి కనుక నీ తప్పు కాచాను. వెళ్లు ఇక్కడ నుంచి ’అని గట్టిగా మందలించి రావణుడిని పంపించివేశాడు.
మరికొన్నాళ్లకు కార్తవీర్యార్జునుడు వేటకు వెళ్లాడు. రోజంతా వేటలో అలసి పోయి జమదగ్ని ఆశ్రమానికి సేద తీరుదామని వచ్చాడు.

05/12/2019 - 22:19

దాని వల్ల మనవంశాలే కాక లోకకల్యాణం కూడా జరుగుతుందని చెప్పాడు. తాతగారు చెప్పినట్లే పరశురాముడు హిమాలయాలకు వెళ్లి తపస్సు ప్రారంభించాడు. పరశురాముడిని పరీక్షించాలని శివుడు వ్యాధుడిగా వచ్చాడు. పరశురాముడితో గట్టిగా మాట్లాడుతూ ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఏం పని? కళ్లుమూసుకొని ఏం చేస్తున్నావని అడిగాడు? కానీ పరశురాముడు మాత్రం ఎంతో వినయంగా సమాధానం ఇచ్చాడు.

05/10/2019 - 19:14

ఋచీకుడు మహాతప్సంపన్నుడు. ఆయన ఒకసారి వివాహం చేసకుందామనుకొన్నాడు.గాధి మహారాజు దగ్గరకు వచ్చాడు. అతనికి సత్యవతి అను కూతురుంది. ఆ సత్యవతిని తనకు ఇచ్చి వివాహం చేయమని గాధిని ఋచీకుడు అడిగాడు. గాధికి ఋచీకునికి తన కూతురినివ్వడం ఇష్టం లేకపోయింది. బాగా ఆలోచించి శరీరమంతా తెలుపు వర్ణమూ ఒక చెవి మాత్రం నీలవర్ణము గల అశ్వాలు వేయి కన్యాశుల్కంగా ఇస్తే సత్యవతితో వివాహం చేస్తానని గాధి ఋచీకునకు చెప్పాడు.

Pages