S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డైలీ సీరియల్

02/19/2020 - 22:22

‘‘పీడా విరగడైపోయింది’’
‘‘అవును. మేము కిట్టయ్యను యింటికి తీసుకెళ్ళి, స్నానాలు చేయించి, దిష్టితీయించి, పార్వతీ పరమేశ్వరుల గుడికి తీసుకెళ్ళి, పూజలు చేయించా!’’.
‘‘చాలా మంచిపని చేశారు ! ... కానీ, యిప్పుడు ఏ పూజా చేయడం లేదు నీ కొడుకు ! ... ఆయన పూజలు మేమే చేస్తున్నాం !’’ అందొక పడతి.
‘‘బుద్ధిమంతులు తల్లీ ! ... అని
వాళ్ళంతా చేతులు జోడ్చి నమస్కరించారు.

02/18/2020 - 22:24

‘‘అమ్మా ! ... నువ్వలా నమస్కరించొద్దు ! నేను నీ కొడుకుని ! చిన్నవాణ్ణి ! ... తప్పు !’’ అంటూ , ఆమె జోడ్చిన చేతుల్ని పట్టుకున్నాడు పరంధాముడు.
ఆ తల్లీ కొడుకుల పరస్పరానురాగంతో తలమునకలైపోయారు వాళ్ళు.
‘‘ఇంకోమారు ఏమయిందో తెలుసా ?’’
‘‘ఏమయింది ?’’

02/18/2020 - 00:40

‘‘అవును ! ... ఇది చిన్నప్పుడు మట్టిలోనే, బురదలోనే దొర్లేది’’! అంది మరో పత్ని.
‘‘అమ్మా ! ... ఒకసారి వీడేం జేశాడో తెలుసా ? ...’’
‘‘ఏం చేశాడు ?’’
‘‘పిడికిళ్ళతో మట్టి తింటున్నాడు ! ... అప్పుడు వీని అన్న బలరాముడు చూసి, వీణ్ణి లాక్కొచ్చాడు’’.
‘‘అవునా ?’’
‘‘అవును. వీడు నోరు తెరిస్తేనా ? ... బెత్తంతో రెండంటించాక తెరిచాడు నోరు ! ...’’

02/18/2020 - 00:39

చేరవలసిన చోటు చేరుకొనెనేమో ?
అనగనొక చోటునను నిలిచిపోయేను
ఎండలో, మంటలో మాడిపోయేను
ఏముంది ? అచ్చోట ఏమియునులేదు
ఓ చెట్టుక్రింద నొక ముసలమ్మ తప్ప !
తల నెరసిపోయింది.
వయసు ఉడిగింది
గాలికే ఆకువలె వణకసాగింది
తనలోనె తానేదొ మాటాడుచుండె
ఎవరికోసమొ గాని ఎడ్చుచూనుండె
కళ్ళలో కన్నీరు !
ముఖము నిండా ఆర్తి !

02/18/2020 - 00:39

యశోదమ్మ
తరువాత రామాయణ కథ చెప్పి చెప్పి, రామభజన చేసి చేసి పారవశ్యంతో ఓ చెట్టుక్రింద వాలిపోయాడు. యోగనిద్రలోకి జారు కున్నాడు హనుమ.
‘‘ఓ చెట్టు క్రింద ఓ ముసలమ్మ నా కిట్టయ్యా ! నా కన్నయ్యా ! అంటూ ఏడుస్తోంది ప్రభూ ! ...’’ అంటూ చెప్పాడొక భటుడు శ్రీకృష్ణునితో.
‘‘ఎలా ఉంది ఆయమ్మ ?’’
‘‘చేతిలో వెన్నదుత్తా, మూటలో అటుకులూ, పుట్నాలూ ...’’
‘‘అటులనా ? చెప్పరే ?’’ నంటు లేచాడు.

01/29/2020 - 22:36

ఆ విధంగా జరిగే యుద్ధంలో అర్జునుడు పట్టుదలను వీడక చేస్తున్న ఆతని యుద్ధాన్ని చూచి శివుడు బ్రహ్మ-విష్ణ్వాది దేవతలు సేవిస్తుండగా ఎడమ భాగాన పార్వతిని ధరించి, గజ చర్మాంబరధారుడై- చంద్రరేఖాధరుడై, సర్పభూషణుడై- మన్మథుని తెల్లని భస్మాన్ని దాల్చిన వాడై, లోకమంతట వ్యాపించి ధవళకాంతులతో ప్రకాశించువాడై, వృషభవాహనా రూఢుడై దివ్యతేజస్సుతో ప్రత్యక్షమయ్యాడు.

01/28/2020 - 22:40

తిన్నని పూర్వజన్మ వృత్తాంతం

01/27/2020 - 22:40

ఆ అభ్యర్థనను విని జంగమవేషధారుడగు శివుడు యాదవరాజు మనస్సులోని సంశయాన్ని నివారణచేసేందుకు క్రమంగా సాలెపురుగు-పాము- ఏనుగు-తిన్నడు పుట్టిన విధానాన్ని వారి మదిలో సహజంగా కలిగిన శైవభక్తిని ఇలా వివరించాడు.
చెలది పూర్వజన్మ వృత్తాంతం

01/23/2020 - 22:38

శివుని ఎఱ్ఱని జటాజూటపు ఎరుపు కాంతి బాగా కలసిపోయి సంధ్యాకాల సమయమనే శంకను కలుగచేయగా పార్వతి ప్రియుడైన శివుని విడిచిపోయింది. అప్పుడు శివపార్వతుల శరీర కాంతియనే యమునా గంగా నదుల సంగమంలో పుట్టిన అచ్చమైన తెల్లకలువల రాశిలో దాగికొనే చక్రవాక పక్షులవలె తెల్లని పైటవస్త్రంలో ఉన్న ఉన్నతమైన కలశాల వంటి స్తనాల్ని గట్టిగా పట్టేందుకు ఆశపడే శివుని కుడిచేతి వద్ద పార్వతి ఎడమహస్తం అమరింది (అంటే నివారించింది).

01/22/2020 - 22:21

ఆది మధ్యాంతర రహితుడు, ఆలోచనాతీతుడు, యోగుల పాలిటి మహాభాగ్యస్వరూపుడు, యమాంతకుడు అయిన శ్రీకాళహస్తీశ్వరుని సేవిస్తే మోక్షసిద్ధి బహుసుకరమే’ అని భావించి ఆ వేశ్యాసుందరులు సువర్ణముఖిలో స్నానమాడి తడి వస్త్రాల్ని విడిచి మడిబట్టలు ధరించి, జుట్టు తడిని ఒత్తుకొంటూ నడుమున ఆడే విధంగా కీలుగంటులు (జారుగా ముడిచిన వెంట్రుకల ముడి) అందంగా అమర్చుకొని సువర్ణముఖీ నదిలోని ఇసుక తినె్నలపై పద్మాసనం వేసుకొని కూర్చున్నారు.

Pages