S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రసాదం

06/22/2018 - 21:23

‘ఊరంతా ఒకధారి అయితే ఉలిపికట్టెది మరోదారి’’అన్నట్లుంది తెలుగు ఛానళ్ల తీరు. 20.12.2012నాడు గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. దేశమంతా జాతీయ ఛానళ్లలో ఒక రకమైన విశే్లషణ ఉంటే, తెలుగు ఛానళ్లు పిచ్చిపట్టినట్లు వ్యవహరించడం సిగ్గుచేటు.

04/18/2018 - 20:50

అన్నీ తెలిసినవాడు దేవుడు. అన్నీ తెలుసు అనుకునేవాడు జీవుడు. అహం బ్రహ్మాస్మి దేవుడు. అహం బ్రహ్మాస్మి అనుకునేవాడు జీవుడు. బంధనాల్లో ఇరుక్కునేవాడు జీవుడు. భవబంధాలు లేనివాడు దేవుడు. అన్నింటా తానై ఉండేవాడు దేవుడు. అన్నీ తానే అనుకునేవాడు జీవుడు. మోహింపబడేవాడు దేవుడు. మోహంలో ఉండేవాడు జీవుడు. విశ్వ పరిరక్షకుడు దేవుడు. విషయలోలత్వంతో ఊగేవాడు జీవుడు. ఉర్రూతలూగేవాడు జీవుడు.

04/17/2018 - 21:51

(‘నామస్మరణం’ నిన్నటి సంచిక తరువాయి భాగం )
ఇపుడు ‘నామం’ తాలూకు ప్రత్యేకతను తెలుసుకుందాం.

04/16/2018 - 21:32

భ: భగవన్నామాన్ని, :జగత్తు అంతా, న:నర్తింపజేయడమే భగవన్నామాన్ని జగత్తు అంతా నర్తింపజేయటమే భజన. భగవంతుడు నువ్వు భజన చేసేటపుడు నీ రాగాన్ని, నీ తాళాన్ని, నీ సంగీత పరిజ్ఞానాన్ని, నీ గాత్ర మాధుర్యాన్ని చూడడు. నీ ఆర్తిని, నీ ఆరాటాన్ని, నీలోని ఆర్ద్రతని, నీ భావాన్ని మాత్రమే చూస్తాడు. నీ భక్తిని మాత్రమే చూస్తాడు. నీ శక్తిని చూడడు.

04/15/2018 - 21:11

మనసు పోయిన ప్రతిచోటుకి కళ్ళు పోకూడదు. కళ్ళు వెళ్లినంత మేర మనిషి వెళ్ళకూడదంటారు పెద్దలు. మనసు చాలా చిత్రమైనది. విచిత్రాలు చేయిస్తుంది. మహావిచిత్రాలు విచిత్రమైనది. చంచలమైనది. కోతిలా ఆడుతుంది. మనల్ని ఆడిస్తుంది. ఆట పట్టిస్తుంది, ఆందోళన చేస్తుంది. చేయిస్తుంది అదే కోతిని మనం ఎక్కడ నొక్కాలో ఏ రకంగా తొక్కాలో అక్కడ నొక్క గలిగితే, ఆ రకంగా తొక్కగలిస్తే అది తోక ముడుస్తుంది.

04/13/2018 - 20:53

ప్రతి జీవితానికి ఓ లక్షణముండాలి.

04/10/2018 - 21:38

‘‘్ధనాలన్నిటిలోను విశిష్ఠమైన ప్రశస్త్యమైన ధనం సాధనం’’అన్నారు పెద్దలు.
సాధనమే ఆధ్యాత్మికానికి పెద్ద ఇంధనం. సాధనమునే సాధన అంటారు. సాధన అనేది అనేక విధాలుగా ఉంటుంది. అనేక మార్గాలలో సాగుతుంది. భక్తియోగం, కర్మయోగం, జ్ఞానయోగం అని సాధనకు మూడు పద్ధతులు.. శ్రవణం, స్మరణం, అనుసరణం, ఆచరణం ‘సాధనా’ మార్గంలో కొన్ని మైలురాళ్ళు. గమనాన్ని గమ్యంచేర్చే కొన్ని ప్రయత్నాలు.

04/08/2018 - 21:04

‘‘అనుకున్నామని జరగవు అన్ని
అనుకోలేదని ఆగవుకొన్ని
జరిగేవన్నీ మంచికని
అనుకోవడమే మనిషి పని’’-

04/06/2018 - 21:48

నదులు పర్వతాలు ఉండే పర్యంతం రామాయణ కావ్యం ఉంటుందని, రామకథ నిలిచిపోతుందనేది బ్రహ్మ వాల్మీకి మహర్షికి ఇచ్చిన వరం. రామ, అయనం రామాయణం. అంటే రాముని ప్రయాణం. రాముని మార్గమంతా, ప్రయాణమంతా ధర్మమయం. రాముడు చేసినదంతా ధర్మహితం. ప్రజాహితం. జాతి హితం. ధర్మనిష్ఠని కార్యదీక్షని తను తన జీవితమంతా ఆచరించి చూపిన ధర్మమూర్తి, వేదమూర్తి. అందుకే రాజ్యం ‘రామరాజ్యం’ కావాలన్నాడు మహాత్మాగాంధీజీ.

04/03/2018 - 22:02

భగవంతుడు తాను ప్రతిచోట ఉండలేనని తల్లిని సృష్టించేడు అనంటారు పెద్దలు. తల్లిప్రేమ అంతటి గొప్పది. విశిష్టమైనది. మహోత్కృష్టమైనది.

Pages