S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రసాదం

04/01/2018 - 21:57

భగవంతుడు ఏమి చేసినా ఓ అర్థముంటుంది. ఓ పరమార్థం ఉంటుంది. ఓ కారణం ఉంటుంది. ప్రత్యేకమైన కారకముంటుంది. నిర్దిష్టమైన పథక రచన వుంటుంది. ప్రణాళిక ఉంటుంది. పరిపూర్ణ దైవత్వం ఉంటుంది. దైవతత్త్వం వుంటుంది. విశాలత్వం వుంటుంది. విశాల దృక్పథం ఉంటుంది. ఓ నియమం ఉంటుంది. నిబద్ధత ఉంటుంది.

03/30/2018 - 22:05

ప్రతి ఒక్కరూ జీవితంలో ఒక్కసారైనా కాశీ పుణ్యక్షేత్రాన్ని సందర్శించాలనుకుంటారు. కాశీ విశే్వశ్వరుణ్ణి దర్శించుకోవాలనుకుంటారు. కాశీ విశే్వశ్వర దర్శనం సర్వపాప హరణం అని నమ్ముతారు. మోక్షకారకం అని భావిస్తారు. కాశీ విశే్వశ్వర దర్శనం పునర్జన్మ రాహిత్యమని, కైలాస ప్రాప్తి కలిగిస్తుందని, మోక్షాన్నిస్తుందని విశ్వసిస్తారు.
అయితే కాశీ వెళ్లినంత మాత్రాన సకల పాపాలు పోతాయా?

03/28/2018 - 21:43

ఓ పర్యాయం అక్కడో ప్రపంచ గోష్ఠి జరుగుతోంది. ఆధ్యాత్మికానికి సంబంధించిన అనేక విషయాలమీద ప్రపంచ ప్రఖ్యాతమైన వ్యక్తులు ఆ సదస్సులో పాల్గొన్నారు. ప్రారంభ కార్యక్రమంలో ఆధ్యాత్మిక నిలయం గురువు అధ్యక్షోపన్యాసం చేశారు. ఆ ప్రసంగం యావత్తూ అనుభవపూర్వకంగా, సోదాహరణలతో ఎంతో ఆసక్తికరంగా చిన్న చిన్న ఘటనలు, సంఘటనలను ఉటంకిస్తూ మనసుకి హత్తుకునేలా ఉంది.

03/25/2018 - 21:18

‘‘రామో విగ్రహవాన్ ధర్మః’’ ధర్మస్వరూపం మానవాకారం అయితే శ్రీరాముడు. వ్యక్తి ధర్మాన్ని కుటుంబ ధర్మాన్ని, సామాజిక ధర్మాన్ని తాను తన జీవితంలో అణువణువునా అడుగడుగునా ఆచరించి మానవాళికి మంచి ఆదర్శాన్ని అందించిన అవతారమూర్తి శ్రీరాముడు. అత్యున్నత ఆదర్శ అవతారమూర్తిత్వం శ్రీరామావతారం.
రాముడు ఆచరించినది అంతా ధర్మమే!

03/23/2018 - 21:24

ఏది సంపాదించాలన్నా, సాధించాలన్నా మనకి అర్హత ఉండాలి. అర్హత ఉంటేనే మనం ఏ అధికారాన్నైనా సాధించగలం. ఈ సూత్రం, ఈ నియమం భౌతిక ప్రపంచానికి సంబంధించినవే కాకుండా ఆధ్యాత్మికానికి సంబంధించిన విషయాలకీ వర్తిస్తుంది.

03/18/2018 - 21:05

భగవంతుడిదీ భక్తుడిదీ విడదీయలేని సంబంధం. విడదీయరాని అనుబంధం. ఒకరుంటేనే మరొకరు. ఓ తత్త్వముంటేనే రెండోది సత్యమయ్యేది. నిత్యమయ్యేది. సాఫల్యమయ్యేది. భగవంతుడు లేనిదే భక్తుడుండడు. భక్తి ఉండదు. భక్తుడికి అస్తిత్వం ఉండదు. భక్తుడు లేకపోతే భగవంతునికి ఓ సాకారం ఉండదు. ఆకారం ఉండదు. భక్తుడుంటేనే భగవంతుడికి అస్తిత్వం ఉండేది. భగవంతుడుంటేనే భక్తుడికి పూర్ణత వచ్చేది. పరిపూర్ణత లభించేది.

03/16/2018 - 21:17

ప్రతి పండగ వెనుక ఓ పరమార్థం ఉంటుంది. అంతరార్థం ఉంటుంది. పరమాత్మతత్త్వం ఇమిడి ఉంటుంది. ఆచారాలు, సంప్రదాయాలు, అలవాట్లు, ఆచారాలు ఉంటాయి. చారిత్రక నేపథ్యమూ ఉంటుంది. సామాజిక ప్రయోజనమూ ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఉంటుంది.
ప్రతి మనిషిలోను, ప్రతి ఒక మనసులోనూ ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని నింపి సామూహికంగా సమాజాన్ని సంతోషాల సంరంభాలతో ఒకచోట చేర్చే సామాజిక హితం ఈ పండగల వెనక అంతర్లీనంగా ఉంటుంది.

03/14/2018 - 20:41

విశ్వాసమనేది అతి విశిష్టమైంది. బలోపేతమైంది. బలవత్తరమైంది. విశ్వాసమున్నచోట అన్నీ ఉంటాయి. విశ్వాసమే అన్నిటికి పునాది అవుతుంది. విశ్వాసమున్నవాడు విలక్షణుడవుతాడు. విశిష్ఠుడవుతాడు. వశిష్ఠుడవుతాడు. విశ్వాసం శ్వాసను నింపుతుంది. శ్వాసను పెంచుతుంది. విశ్వాసం మనిషిని కదిలిస్తుంది. మనిషిని కదలిస్తుంది. మనిషిని మనీషిని చేస్తుంది. మహితాత్ముడ్ని చేస్తుంది. విశ్వాసం విశ్వాన్ని నడిపిస్తుంది.

03/13/2018 - 20:36

భక్తితత్వంతో చూస్తే- తత్త్వాలు రెండు రకాలు. ఆస్తికత్వం మొదటిదైతే నాస్తికత్వం రెండోది. దేవుడు ఉన్నాడు, ఉన్నాడు అని మనసా వాచా కర్మణా నమ్మి ఆచరణలో దైవత్వాన్ని, దివ్యత్వాన్ని అనుభవించే వాళ్ళు ఆస్తికులైతే, దేవుడు మిధ్య. దేవుడు అనేవాడు ఎక్కడా లేడు, అదొక భ్రమ. మూఢత్వం అని అనుకోవడం నాస్తికత్వం. మూర్ఖంగా ఆలోచించటం, ఆలోచన చేయడం అంతా నేనే అనే అహంతో ఊరేగడం నాస్తికత్వం.

03/11/2018 - 21:16

‘‘మానవుల జాతకాలను ప్రభావితం చేసేవి రాహు కేతు గ్రహాలు కాదు. అహంకార మమకారాలు’’ అంటారు మహనీయులు. అహంకార మమకారాలు మనుషుల్ని పాడుచేస్తాయి. పాతాళాన పడదోస్తాయి. అందుకని మనం ఆ రెండింటికి దూరంగా ఉండాలి. వాటిని దూరంగా ఉంచగలిగాలి.

Pages