S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

12/09/2018 - 22:53

పిల్లలు పరధ్యానంగా ఉంటే అది ఆలోచించాల్సి విషయమే.. ఇంట్లో పెద్దలు పిల్లలను బయటికెళ్లి ఏదైనా వస్తువు తెమ్మని వివరాలు చెబుతుంటే ఇక చాలన్నట్లు ముఖం పెట్టడం.. తీరా బయటికి వెళ్ళాక కొనాల్సిన వస్తువు మరిచిపోయి వట్టి చేతులతో తిరిగి రావడం.. తరగతి గదిలో కూడా టీచర్ చెప్పేదంతా పిల్లలు శ్రద్ధగా విన్నట్లే కనిపించడం.. కానీ టీచర్ చెప్పిన పాఠం గురించి ప్రశ్నిస్తే తెల్లమొహం వేయడం..

12/07/2018 - 23:14

అందివచ్చిన సాంకేతికత మహిళల రక్షణకు ఎంతగానో ఉపయోగపడుతోంది. మహిళలపై జరుగుతున్న దాడుల కేసుల్లోనూ ఈ సాంకేతికత కీలక సాక్ష్యంగా నిలుస్తోంది. ముఖ్యంగా షిఫ్ట్‌వారీగా పనిచేసే ఎందరో మహిళలకు పలు ఆధునిక యాప్‌లు బాడీగార్డులుగా పనిచేస్తూ సేవలందిస్తున్నాయంటే అతిశయోక్తి కాదు. అలాంటి కొన్ని యాప్స్ గురించి తెలుసుకుందాం..

12/06/2018 - 19:57

కాలేజీకి వెళుతున్న ఏ అమ్మాయిని చూసినా జీన్స్, టీషర్ట్.. కుర్తీ.. లాంగ్‌స్కర్ట్.. లేదా మిడ్డీలతో మెరిసిపోతుంటారు. వీటిల్లో ఏది వేసుకున్నా అదనపు హంగు కనిపించాలంటే మాత్రం బెల్టు వాడాల్సిందే.. దుస్తులతో పాటు నేడు బెల్టుల ఆకారాల్లో కూడా చాలా ట్రెండ్స్ వచ్చాయి. ఇటీవలి కాలంలో అమ్మాయిల బెల్ట్ రూపరేఖలు మారిపోయాయి.

12/05/2018 - 19:37

భారతదేశంలో దాదాపు 95 శాతం మంది మహిళల్లో విటమిన్ - డి సరిపడా లేదు. ఐదు శాతం మంది మహిళలకు మాత్రమే తగినపాళ్లలో విటమిన్ - డి అందుతోంది. ఢిల్లీలోని ఎయిమ్స్, ఫోర్టిస్ ఆసుపత్రికి చెందిన డాక్టర్లు నిర్వహించిన పరిశోధనలో ఈ నిజాలు తెలిశాయి. మనం ఎంతసేపు సూర్యరశ్మిలో ఉంటామన్న దానిపైనే మన శరీరంలోని విటమిన్ - డి ఆధారపడి ఉంటుంది. శరీరంలోని ఎముకలకే కాకుండా, శరీర రోగనిరోధక శక్తికి కూడా సూర్యరశ్మి చాలా అవసరం.

12/04/2018 - 19:25

వయసు పెరిగేకొద్దీ చర్మం వదులవుతుంది. యోగా ద్వారా చర్మాన్ని బిగుతుతూ, శరీరాన్ని ఫ్లెక్సిబుల్‌గా చేయవచ్చు. చిన్న చిన్న యోగాసనాల ద్వారా నిత్యయవ్వనంగా కనిపించవచ్చు. అలాంటి యోగాసనాలను ఒకసారి చూద్దామా..
మాలాసన

12/03/2018 - 18:51

కళ్లు త్వరగా అలసిపోవడం, కళ్ల కింద నల్లని వలయాలు రావడం వంటివి కంప్యూటర్‌పై పనిచేసేవాళ్లకు తరచూ జరుగుతుంటాయి. కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే ఆరోగ్యంతో పాటు కళ్లు ఆకర్షణీయంగా, మరింత అందంగా తయారవుతాయి.
* కీరాని ముక్కలుగా కోసం రుబ్బి రసం తీయాలి. దాంట్లో కొద్దిగా రోజ్‌వాటర్‌ని కలిపి కళ్ల చుట్టూ పట్టించి అరగంట తర్వాత కడిగేసుకోవాలి.

11/30/2018 - 19:02

వైద్య శాస్త్రంలో ఇంతవరకు పరిష్కరించని కొన్ని సమస్యలలో ఎయిడ్స్ ఒకటి. ఇది అంటువ్యాధి కాదు. అంటించుకొనే వ్యాధి. ఎయిడ్స్ అనే సంక్షిప్త పదానికి అర్థం ‘అక్వయిర్డ్ ఇమ్యునో డిఫిషియన్సీ సిండ్రోమ్’. అంటే మానవులలో వ్యాధి నిరోధక శక్తిని క్షీణింపజేయుటవలన కనిపించే లక్షణాల సముదాయం అని అర్థం.

11/29/2018 - 19:35

బంగ్లాదేశ్‌కు చెందిన బాను అక్తర్‌కి పుట్టుకతో రెండు చేతులూ లేవు. పుట్టగానే బానూని చూసి తల్లి భయపడిందట. ఆ బిడ్డకు చనుబాలు కూడా ఇవ్వలేదట. ఇలాంటి వికలాంగురాలిని పెంచడం భారమని, చంపేయమని చుట్టుపక్కలవాళ్లు ఆ తల్లిదండ్రులకు చెప్పారట. కానీ ఆ తల్లి చంటిబిడ్డను చంపలేదు. వదిలేసింది. తల్లిదండ్రులు బానుకు నడక కూడా నేర్పలేదు, బడికి పంపలేదు. అందరూ నడవడం చూసి బానునే సొంతగా నడవడం నేర్చుకుంది.

11/28/2018 - 19:55

ప్రతి ఒక్కరూ యవ్వనంగా, అందంగా కనిపించాలని కోరుకుంటారు. అందుకే మేకప్‌లను ఆశ్రయిస్తుంటారు. కానీ చాలామంది మహిళలు మేకప్ వేసుకోవడంలో జాగ్రత్తలు తీసుకోరు. ఫలితంగా ఎక్కువ వయస్సు వారిలా కనిపిస్తారు. అలంకరణ ప్రక్రియలో ఫౌండేషన్ కీలకప్రాత వహిస్తుంది. ఇది రూపస్థితిని తీర్చిదిద్దుతుంది.

11/28/2018 - 03:52

నిశ్చల జీవనశైలే కాకుండా అనేక రకాల కారణాల వల్ల కూడా బరువు పెరగడం జరుగుతుంది. అధిక మోతాదులో కేలరీలు కలిసిగిన చిరుతిళ్ళు అంటే ఇష్టం కలిగి ఉండడం మరియు వ్యాయామం చేయడం చాలా వరకు తగ్గించడం వంటి కారణాలు కావచ్చు. చాలామంది ఆరుబయట గడపడం లేదా తక్కువ మొత్తంలో కాలినడక కోసం బయటకు వెళ్లకుండా ఇంట్లోనే కుర్చీల్లో కూర్చొని సమయాన్ని గడుపుతున్నారు. అలా ఉండడం ద్వారా బరువు అమాంతంగా పెరిగిపోతారు.

Pages