S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శిప్ర వాక్యం

08/14/2018 - 00:27

దేశ సమగ్రతను కాపాడండి, విచ్ఛిన్నకర శక్తులను ఓడించండి’- అంటూ 2014 ఏప్రిల్ 14న అప్పటి యూపీఏ చైర్‌పర్సన్, కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ భారత జాతికి పిలుపునిచ్చారు. వెంటనే తులసిరెడ్డి అనే కాంగ్రెస్ నాయకుడు స్పందిస్తూ, ‘తెలుగు రాష్ట్రాన్ని ముక్కలుచేసి సోనియా దేశ సమగ్రత కోసం పిలుపునివ్వటం ఏమిటి?’ అని సూటిగా ప్రశ్నించారు.

08/06/2018 - 23:18

ప్రఖ్యాత నటుడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్.టి.రామారావును అప్పట్లో కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా అవమానించింది. ‘ఈ నటుడిని జనం రాళ్లతో కొడతారు’ అని ఓ కాంగ్రెస్ మహిళానేత తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ స్థాపించకముందు ఎన్టీఆర్ రాజ్యసభ సభ్యత్వం ఆశిస్తే కాంగ్రెస్ వారు తిరస్కరించారు. అప్పటి పరిస్థితుల్లో ‘తెలుగుదేశం’ పేరిట తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో ఎన్‌టిఆర్ ప్రజానాయకుడైనాడు.

07/30/2018 - 23:53

చరిత్ర అబద్ధం చెప్పదు. కానీ, చరిత్రకారులు తమ అజ్ఞానం వల్లనో, అవసరాల దృష్ట్యానో చరిత్రకు రకరకాల వక్ర వ్యాఖ్యానాలు చేసుకోవచ్చు. దాదాపు వందేళ్లుగా ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన చరిత్రను ఈతరం విద్యార్థులు మరిచిపోయి ఉండవచ్చు. కానీ చరిత్రను విస్మరించేవారు చరిత్రహీనులవుతారు.

07/23/2018 - 23:07

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆ మధ్య- ‘శ్రీరామ నవమి ఉత్సవాలను జరగనివ్వను.. మొహర్రం రోజున దుర్గాపూజ చేయడానికి వీలులేదు.. దీనిని ముస్లిం సంతుష్టీకరణ అని మీరు అనుకుంటే నా జీవితమంతా ఇదే విధానాన్ని అనుసరిస్తా..’ అన్నారు. మొన్న ఝార్ఖండ్‌లోని ఓ మిషనరీ హోంలో పసిపిల్లల అమ్మకం వ్యవహారం వెలుగు చూసింది. దీనిపై మమత మాట్లాడుతూ- ‘ఆ మిషనరీలకు నేను ఆశ్రయం ఇస్తా..’ అని ప్రకటించారు.

07/09/2018 - 23:51

భారతదేశానికి పూర్తిగా దిగువన సాగర తీరంలో ఉన్న సుందర నందనవనం కేరళ. దీనిని పూర్వం తిరువాన్కూరు సంస్థానం అనే వారు. ఏలకులు, మిరియాలు పండే దేశం కాబట్టి దీనికి ‘మలై ఆలం’ అని పేరు వచ్చింది. ఇంతటి సుగంధ భరితమైన ప్రాంతాన్ని రాజకీయ నాయకులు మతాధిపతులు కలుషితం చేశారు. సిపియం ప్రేరణతో ఇక్కడ రాజకీయ హత్యలు నిత్యకృత్యంగా మారాయి.

06/25/2018 - 23:44

మధ్యప్రదేశ్ మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్ ‘కాషాయ ఉగ్రవాదం’ అనే పదాన్ని ప్రయోగించాడు. కాంగ్రెస్ నాయకులు పి.చిదంబరం, సుశీల్‌కుమార్ షిండే ఈ పదానికి విస్తృత ప్రచారం ఇచ్చారు. నీలం రంగు బిఎస్‌పికి, అరుణ వర్ణం కమ్యూనిస్టులకు, కాషాయం భాజపాకు చిహ్నాలు. భారతీయ ఋషులు కాషాయ వస్త్రాలు ధరించేవారు. కాషాయం త్యాగానికి సంకేతం. నేటికీ ప్రతి హిందూ దేవాలయం మీద కాషాయ జెండా ఎగురుతూ ఉంటుంది.

06/18/2018 - 23:59

కొద్దికాలం క్రితం తెరాస అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మాట్లాడుతూ, ‘తెలంగాణ జన సమితి’ పార్టీకి ఎవరు ఆర్థిక సహాయం చేస్తున్నారో తనకు అంతా తెలుసునని అన్నారు. అప్పుడు ఆయన చెప్పిన మాటలను మీడియా అంతగా పట్టించుకోలేదు. కాగా, మహారాష్టల్రోని పూణె నగరంలో పోలీసులకు కొన్ని రహస్య పత్రాలు దొరికాయి. అందులోని అంశాలు చాలా ఆందోళనకరంగా ఉన్నాయి.

06/11/2018 - 23:39

ఇటీవల దేశవ్యాప్తంగా జరిగిన ఉపఎన్నికల్లో భారతీయ జనతాపార్టీ ఎదురు దెబ్బలు తిన్నది. పరిస్థితి ఇలాగే ఉంటే 2019 సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీకి విజయావకాశాలు సన్నగిల్లుతాయని రాజకీయ విశే్లషకులు అంచనా వేశారు. యూపీలో యోగి ఆదిత్యనాథ్ నాయకత్వ పటిమ ప్రశ్నార్థకమైంది. యోగి ముఖ్యమంత్రి పదవి చేపట్టాక జరిగిన ఉపఎన్నికల్లో గోరఖ్‌పూర్, ఫూల్‌పూర్, ఖైరానా ఎంపీ స్థానాల్లో భాజపా ఓడిపోయింది.

06/04/2018 - 23:50

కొందరు తరుచుగా ఒక ప్రశ్న వేస్తూ ఉంటారు. అమెరికాలోని చికాగో నగరంలో లతామంగేష్కర్ రోడ్డు ఉంది, ఆఫ్రికాలో మహాత్మా గాంధీ వీధి ఉంది.. అలాంటప్పుడు న్యూ ఢిల్లీలో ఔరంగజేబు రోడ్డు, అక్బరు రోడ్డు ఉంటే తప్పేమిటి? అని.. ఈ తర్కం నిజంగా అజ్ఞాన జనితం అనాలి. ఎందుకంటే లతామంగేష్కర్ ఒక సినిమా గాయని. ఆమె రాగాలను అభిమానించే వారు చికాగోలో ఉండవచ్చు, చైనాలోను ఉండవచ్చు. అలాగే గాంధీజీ శాంతిదూత, అహింసా జ్యోతి.

05/29/2018 - 00:12

‘కింగ్’ అంటే రాజు.. ‘కింగ్ ఆఫ్ కింగ్స్’ అంటే రారాజు.. అంటే జీసస్ క్రైస్టు. ‘బ్రేకింగ్’ అంటే విచ్ఛిన్నం. ‘కింగ్ ఆఫ్ కింగ్స్’ను ఆయుధంగా వాడుకొని ఇండియాను విచ్ఛిన్నం చేయాలన్న (బ్రేకింగ్ ఇండియా) కుట్ర మొదలైంది. ఢిల్లీలోని ఆర్చిబిషప్ ఈనెల 21న ఒక ప్రకటన విడుదల చేస్తూ, 2019 సార్వత్రిక ఎన్నికల్లో నరేంద్ర మోదీని ఓడించాలని విజ్ఞప్తిచేశారు.

Pages