S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సుమధుర రామాయణం

04/04/2018 - 21:01

469. వెండి బంగారములతోడ చేయబడిన
సుందరములగు వాకిళ్లు చూడ ముచ్చ
టైన మృగపక్షి శిల్ప సుశోభతోడ
మేరుగిరి యెత్తులో సౌధ మెప్పుచుండ

470. శయన పర్యంకములను సింహాసనములు
మధువు గ్రోలెడి పాత్రలు భిత్తికలను
వివిధ మణిరత్న ఖచితములౌచు పట్ట
పగటి భాస్కర ప్రభలతో వెల్గు నింపె

04/03/2018 - 22:00

469. వెండి బంగారములతోడ చేయబడిన
సుందరములగు వాకిళ్లు చూడ ముచ్చ
టైన మృగపక్షి శిల్ప సుశోభతోడ
మేరుగిరి యెత్తులో సౌధ మెప్పుచుండ

470. శయన పర్యంకములను సింహాసనములు
మధువు గ్రోలెడి పాత్రలు భిత్తికలను
వివిధ మణిరత్న ఖచితములౌచు పట్ట
పగటి భాస్కర ప్రభలతో వెల్గు నింపె

04/02/2018 - 20:56

436. నూరుయోజనముల జలనిధిని దాటి
వచ్చినను నలసట నిసుమంత యేని
పొందడయ్యె ధీశాలి వాతాత్మజుండు
సూక్ష్మ రూపముతో లంక సొరగనెంచి

437. శైల సదృశవౌ మేనును సంకుచితము
జేయు హనుమంతు డమ్మహావిష్ణుదేవు
డ త్రివిక్రమ రూపము వామనమును
జేయు విధమును దలపింపజేసే నపుడు

04/01/2018 - 21:50

420. పర్వతోత్తమ! సన్మాన పూర్వకములు
నీదు మాటలె జాలు మాకందెనన్ని
నిల్చుటకు వీలు లేదంచు శైలశిఖర
మును కరంబున స్పృశయించి జనియె హనుమ

421. సంతసించిరి మైనాక సాగరవరు
లామహాధీరు హనుమ నాశీర్వదించ్రి
వాయువేగముతో జను వాయుపుత్రు
దీక్షకుం కొనియాడిరి దేవ ఋషులు

03/30/2018 - 21:13

404. అనుచు హనుమంతు డనితరసాధ్యమైన
కార్యమును జేయు సంకల్పదీక్షితుడయి
దినకర మహేంద్ర పద్మాసనాది దేవ
తలకు శిరము వంచి నమస్కృతుల నొనర్చి

405. తనదు జన్మకు కారణభూతుడైన
ననిల దేవుని కభివందనము లొనర్చి
నేను లంఘించు వేళ రుూ నేల నిలువ
నేరదంచు నెక్కె మహేంద్ర పర్వతమును

03/29/2018 - 21:27

388. మీరు బలపరాక్రమ వంతులీసముద్ర
మును ధరించి లంకకు బోయి వచ్చునట్టి
నా మహాత్ముడె కపికుల ప్రాణదాత
లెండు మీ మీ బలమ్మును దెల్పు’’ డనగ

389. కపివరేణ్యులు తమతమ గమన శక్తి
దెల్పిరంతట తారా సుతుండు నేను
నీరధించాటి లంకకు నేగ నేర్తు
మరలి వత్తునొ రాలేనొ నుడువజాల

03/28/2018 - 21:25

372.రామ వనవాసము దశరధుని మృతియు
భూమిజాపహరణము జటాయు మృతియు
వాలి నిహతియు మనలకీ విషమ గతియు
గల్గుటకు కారణమ్ము కైకమ్మ వరమె

373.అనుచు విలపించు కపుల సంపాతి జూచి
రామ కార్యమునకు తమ్ముడౌ జటాయు
వసుపు లర్పించుట విని దుఃఖించి కీశ
వరుల కడకేగి వనచర వర్యులార!

03/27/2018 - 21:29

356. రాక తక్కిన వాని ప్రాణంబు దీతు
నిదియె నా శాసనంబని యంతిపురము
జొచ్చి యంగనాసక్తుడై సర్వకార్య
ములను మంత్రులపై నిడి మరచె నన్ని

357. వర్ష ఋతువేగె విను వీధి విమలమయ్యె
రామునకు జానకీ వియోగమున నాల్గు
నెలలు నాల్గు యుగమ్ములవలెను దోచె
కీశపతి యుదాసీనుడై గడుపుచుండ

03/25/2018 - 21:14

324. రామచంద్రుడు సజ్జిత చాపుడౌచు
జూచుచుండె నెవ్వరు వాలి సూర్యజుండు
ఎవ్వరనుచు నేర్పరుపంగరామి కొదల
డయ్యె బాణము కార్యము చెడునటంచు

03/23/2018 - 21:25

308. తిరిగి వచ్చి మంత్రులకు విషయములన్ని
జెప్పి అన్న కుదకతర్పణములు
విడిచి నంత నన్ను మంత్రులు యోచించి
రాజు జేసి కపిరాజ్యమునకు

309. న్యాయ మార్గము దప్పక నేను రాజ్య
పాలనము జేయు చుండగ నొక దినమ్ము
రక్కసుల జంపి బిలమున కడ్డమున్న
బండ పడద్రోసి బలశాలి వాలివచ్చి

Pages