S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెరటి చెట్టు

06/22/2018 - 22:57

కవిత్వమంటే ఏమిటో నిర్వచించమని అమెరికన్ మహాకవి రాబర్ట్ ఫ్రాస్ట్‌ని ఎవరో అడిగారట. ‘అనువాదంలో లుప్తమయిపోయేదే కవిత్వం’ అన్నాడట ఫ్రాస్ట్. ‘రోకటి పాట రాతల్లో లుప్తమయిపోయే సత్యమే సాహిత్య చరిత్ర’ అని మనం కొత్త నిర్వచనం చెప్పుకోవాలేమో! మన సాహిత్య చరిత్రకి తెలియని మహావిద్య అప్‌డేషన్.

06/22/2018 - 03:16

జంట కవిత్వం తెలుగు వారికి కొత్తేం కాదు. ‘ప్రబోధ చంద్రోదయం’ తదితర కృతులు చేసిన నంది మల్లయ - ఘంట సింగన తెలుగు సంప్రదాయ కవిత్వంలో మొట్టమొదటి కవుల జంట అంటారు. ఈ జంట కవులు, పదిహేనో శతాబ్దికి చెందినవాళ్లు. వారికి నాలుగు వందల ఏళ్ల తర్వాత పుట్టిన తిరుపతి వెంకట కవులు జంట కవిత్వానికి శాశ్వత చిరునామాగా నిలిచారు.

06/20/2018 - 22:57

‘అయిదేళ్లప్పటి నుంచీ కథలు రాసి అర్ధా - పావలా సంపాదిస్తూనే ఉన్నా. అంతకు ముందు, బహుశా, రికామీగా గడిపేశాననుకుంటా!’ అన్నాడట పీజీ వుడ్‌హౌస్.

06/19/2018 - 21:31

భాషా సాహిత్యాలని సామాజిక సాధనాలుగా, సామాజిక ఉత్పత్తులుగా గుర్తించలేని వాళ్లు, తమ మడీ - తడీ - చాదస్తం వాటికీ అంటగట్టాలని చూస్తారు. తమ బుర్రల్లోనే భాష, సాహిత్యం పురుడు పోసుకున్నాయని తాము నమ్మి, ఇతరులనూ నమ్మించాలని చూస్తారు. మన చుట్టూ తిరిగే మనుషులు, ఏయే మాటల్ని ఎలా వాడుతున్నారో పరిశీలించి గ్రహించడానికి బదులుగా, ఆ భాషని సృష్టించిన సామాన్యులకే ఆ మాటల్లో మంచీ - చెడూ నేర్పించే ప్రయత్నం చేస్తారు.

06/18/2018 - 23:45

‘గురజాడ 1915లో చనిపోలేదు - అప్పుడే ఆయన జీవించడం ప్రారంభించా’డన్నారట దేవులపల్లి కృష్ణశాస్ర్తీ. ఇది కేవలం చమత్కారం కోసం చేసిన మాటలాట కాదు సుమా! బతికివుండగా గురజాడను మన ప్రధాన స్రవంతి సాహిత్య ప్రపంచం పెట్టిన బాధలను తీవ్రంగా అభిశంసిస్తూ కృష్ణశాస్ర్తీ చేసిన విమర్శ అది.

06/18/2018 - 21:19

‘గురజాడ 1915లో చనిపోలేదు - అప్పుడే ఆయన జీవించడం ప్రారంభించా’డన్నారట దేవులపల్లి కృష్ణశాస్ర్తీ. ఇది కేవలం చమత్కారం కోసం చేసిన మాటలాట కాదు సుమా! బతికివుండగా గురజాడను మన ప్రధాన స్రవంతి సాహిత్య ప్రపంచం పెట్టిన బాధలను తీవ్రంగా అభిశంసిస్తూ కృష్ణశాస్ర్తీ చేసిన విమర్శ అది.

06/17/2018 - 21:28

ఎవరో అన్నట్లుగా, ‘యుద్ధాలు మొదలయ్యేది మెదళ్లలోనే’. కుసంస్కారం మీద యుద్ధం కూడా - అలాగే - కొందరు మేధావుల మెదళ్లలోనే మొదలయింది. కుసంస్కారం వల్ల సమాజమంతా బాధలు పడినా, దాని మీద యుద్ధం చెయ్యాలని నడుం కట్టే వాళ్ల సంఖ్య- మొదట్లో - అతి పరిమితంగానే ఉంటుంది. ఎక్కడయినా, అన్నిటికీ మించి, ఈ యుద్ధం దశాబ్దాల తరబడి సాగుతుంది.

06/15/2018 - 21:59

ఈ రోజుల్లో ఎవరికి ఏ సమాచారం కావలసి వచ్చినా, తక్షణం ‘గూగులమ్మ తల్లి’కి మొక్కుకోవడం అలవాటుగా మారింది. నిన్నమొన్నటి వార్తాపత్రికలు మొదలుకుని నూరేళ్లనాటి ఉద్గ్రంథాల వరకూ ఏది కావల్సినా, గూగుల్ ద్వారా దాని అజ తెలుసుకునేందుకూ, అంతు తేల్చుకునేందుకు ఈ తరం సిద్ధమవుతోంది. అలాంటి ‘శోధన యంత్రాంగం’ (సర్చ్ ఎంజిన్) ఏడాదికి అయిదారువందల సార్లు తను సమకూర్చే సమాచారాన్ని అప్‌డేట్ చేసుకుంటుందట.

06/14/2018 - 21:34

-‘కవి సమ్రాట్’ విశ్వనాథ సత్యనారాయణ గురించి జలసూత్రం రుక్మిణీనాథ శాస్ర్తీ అన్నమాట ఇది. అక్షరం మార్చనక్కర్లేకుండా పందొమ్మిదో శతాబ్దిలో పుట్టిగిట్టిన పండిత కవులెందరికో అతికే వర్ణన ఇది. వాళ్లలో అగ్రగణ్యుడు పరవస్తు చిన్నయసూరి. పందొమ్మిదో శతాబ్ది మొదట్లో జన్మించిన చిన్నయసూరి బతికింది అర్ధ శతాబ్దంకన్నా రెండేళ్లు ఎక్కువ.

06/14/2018 - 01:00

‘మనుషుల గుణగణాలను లెక్కగట్టడానికి నిక్కమయిన గీటురాయి ఒకటుంది - తనకి ఎటువంటి ఉపకారం చెయ్యలేని వ్యక్తిని అతను ఎలా చూస్తాడనేదే ఆ గీటురాయి’ అన్నారట డాక్టర్ శామ్యూయెల్ జాన్సన్. ఛార్ల్స్ ఫిలిప్ బ్రౌన్ భారతదేశంలో జన్మించడానికి దశాబ్దంన్నర ముందే లండన్‌లో కన్నుమూసిన జాన్సన్‌కి మన ‘తెలుగు సూర్యుడు’ తెలిసి వుండే అవకాశం లేదు.

Pages