S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెరటి చెట్టు

05/31/2018 - 21:20

ఆధునిక సాహిత్య పరిభాషలో తరచు వినబడే మాటల్లో వ్యక్తినిష్టత, వస్తునిష్టత అనేవి ముఖ్యమయినవి. పుస్తకాలు చదివే అలవాటున్న వాళ్లకి - కాస్తోకూస్తో తత్వశాస్త్రం గురించి చదువుకున్న వాళ్లకి - వ్యక్తినిష్టత గురించీ, వస్తునిష్టత గురించీ పనిగట్టుకుని చెప్పనక్కర్లేదు. అయినప్పటికీ ఈ విషయాన్ని సరళమయిన ఉదాహరణల సహాయంతో ఒక్కసారి పరిశీలిద్దాం. మనుషులు సాధారణంగా రెండు ప్రపంచాల్లో బతుకుతుంటారు.

05/30/2018 - 22:14

ఇంతకీ, ఆధునికత కాల సూచికా? గుణ సూచికా? కాలసూచికే అయితే, దాని ప్రమాణాలేమిటి? ఒకవేళ, ఆధునికత గుణసూచికే అయిన పక్షంలో, ఆ గుణ గణాల రూపరేఖల్ని నిర్ణయించేదీ, నిర్ధారించేదీ ఎవరు? మనమేనా?? (అవునూ - ఎవరీ ‘మనం’? మీరా? నేనా? మనమిద్దరమూనా?) ఆధునికత అనే భూతాన్ని బంధించి వుంచిన కాలనాళిక మూత తెరిస్తే, ఇలాంటి ‘ఇబ్బందికరమయిన’ ప్రశ్నలు బయటపడటం సహజం.

05/29/2018 - 21:24

‘పెరటి చెట్టు’ నీడలో ఇక మీదట మనం ఆధునిక సాహిత్యం స్వరూప స్వభావాల్లో వచ్చిన మార్పుల గురించీ, వాటికి దారి తీసిన సామాజిక పరిస్థితుల గురించీ చర్చించుకుందాం. ఇది ఈ చెట్టుకు మొలిచిన కొత్త కొమ్మ! ఏ చెట్టుకయినా కొత్త కొమ్మలూ రెమ్మలూ తొడగడం దాని జీవలక్షణానికి నిదర్శనం. పెరటి చెట్టుకూ అంతే! ఆధునిక సాహిత్యం గురించిన మన చర్చను ఆధునికతకు నిర్వచనం చెప్పుకోవడంతో మొదలుపెడితే భావ్యంగా ఉంటుంది!

05/28/2018 - 21:24

‘ఈ నాతి కౌనుతో ఎనకాక కాబోలు సింగముల్ గుహలలో చిక్కుటెల్ల/ ఈ బాల నడలతో ఎనకాక కాబోలు ఏనుంగు లడవిలో ఈగుటెల్ల/ ఈ చెల్వ చూడ్కిడో ఎనకాక కాబోలు సారంగముల్ పొదల దూరుటెల్ల/ ఈ కన్య ఘనవేణి ఎనకాక కాబోలు నహులు పుట్టలు సొచ్చి అడగుటెల్ల/ ఈ నెలత చేరి కాబోలు ఇంచువింటిచెం చతనుడయ్యు జగము జయించుటెల్ల/ ఈ లలన సృష్టి సేసి కాబోలు పంకజాసనుడు విశ్వమున స్రష్ట అగుట ఎల్ల’ - మయుడి వెనక నడుస్తూ వస్తూన్న అతగాడి కూతురు ‘మందోదరి’

05/27/2018 - 21:22

‘కటి చుట్టి కట్టిన కనకాంబరముతోడ, మెరుగు చామనచాయ మేనితోడ,/ నాసిక తుదకల్గు నవవౌక్తికముతోడ, జిగిలి కస్తురిబొట్టు మొగముతోడ,/ కరుణారసము చిల్కు కన్నుతమ్ములతోడ, నెమ్మి రెక్క తురాయి నీటుతోడ,/ గుదికొని వెన్నాడు కుసుమపుంజముతోడ, చంద్రసూర్యాది భూషాళితోడ/ ప్రతియెరుంగని దివ్య రూపంబుతోడ, సొగసు కనుపించు మవ్వంపు సొంపుతోడ/ రాధికామణి కైదండ రమణ పూని, చిన్ని కృష్ణుండు కలను ప్రసన్నుడాయె’ నంటోంది ముద్దుపళని.

05/25/2018 - 20:54

‘రాజు కళంకమూర్తి, రతిరాజు శరీరవిహీను డంబికా/ రాజు దిగంబరుండు, మృగరాజు గుహాంతర సీమవర్తి, వి/ భ్రాజిత పూసపా డ్విజయరామ నృపాలుడె రాజుకాక, రుూ/ రాజులు రాజులే, పెను తరాజులు కాక? ధరాతలంబునన్!’.. - ఈ చాటు - చమత్కార పద్యం సుప్రసిద్ధం. రాజు అంటే చంద్రుడనే అర్థం ప్రచురమే కదా! ‘ఆ ‘రాజు’కి మచ్చ వుంది. రతిరాజయిన మన్మథుడికి శరీరం లేదు. అంబికా రాజయిన శివుడికి ఒంటి మీద గుడ్డ కూడా లేదు.

05/24/2018 - 21:31

‘కులము కల్గువారు గోత్రంబు కలవారు విద్యచేత విర్రవీగువారు

05/23/2018 - 21:41

‘రాయలకు రాజనీతులు నాయడు అప్పాజి చెప్పినవి అన్నియు తా/ పాయక మనసున ఉనిచిన రాయసములు వ్రాయ చదువ రసికత కలుగున్’ - కాశీ వివ్వనాథ నాయనయ్యవారి స్థానాపతి రాసిన ‘రాయవాచకం’ అవతారికలోనిది ఈ పద్యం.

05/22/2018 - 21:07

‘మ్రొక్కిన ఎవ్వరేమనడు; మోమటువెట్టుక
చక్కబోయె; నీ
దిక్కును చూడడాయె; ఒక దీవనమాటయు
ఆడడాయె; వీ
డెక్కడి వైష్ణవుండు? మనమేటికి మ్రొక్కితిమమ్మ? అక్కటా!

05/21/2018 - 20:52

‘ఖగోళ శాస్త్రం మొదలు కామశాస్త్రం వరకూ అన్ని శాస్త్ర సాహిత్య ప్రక్రియలలో మూలికము, ప్రామాణికము లయిన రచనలు చేసిన ప్రాచీన భారతీయులు, కారణమేదయినా, శాస్త్ర నిబద్ధమయిన ప్రామాణికమయిన చరిత్ర రచన చెయ్యలేదు.

Pages