S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెరటి చెట్టు

05/18/2018 - 21:35

‘ధరాధరము వెన్ను తన్ని పుట్టిన చాయ నున్నదీ బింబాధరోష్ఠి వేణి/ జక్కవ కవ రొమ్ము త్రొక్కి నిల్చిన జాడ నున్నవీ నవలా పయోధరములు/ చిన్నిప్రాయపు లేడి చెవులు పట్టాడించు గతినున్న దీ రామ కన్నుదోయి/ నల్ల చీమల బారు నడుము తాకినవీక నున్నదీ చెలువంపు కనె్నయారు/ విపుల పులినంబు వెన్కకు వీగ నొత్తు నందమున నున్నదీ మందయాన పిరుదు/ దీని కెనయైన లతకూన కాన మ మనోజ వజ్రాంగి ఈ జగన్మోహనాంగి’ - ఈ పద్యంలో ప్రతి పాదానికి ఓ జాతీయా

05/17/2018 - 21:24

‘అనుకు వెనె్నల తాల్చి తునిచి సేవెలు చేసి వెనె్నల పాలను జున్నొనర్చి/ గట్టి వెనె్నల పిండిగొట్టి వెనె్నల వెన్న కలయ వెన్నప్పాలుగా అమర్చి/ గడితంపు వెనె్నల గండ్రికల్ సిగరిగా తియ్య వెనె్నలలోన తెచ్చిపెట్టి/ ఎడల వెనె్నల చక్కెరిడి జోర్కు వెనె్నల పూనిక నాళీలు గాను కూర్చి/ పండు వెనె్నల అను వెండి పళ్లెరముల చెలగి యిల్లాండ్రు వడ్డింప చెలులు తాము/ వేడుకలు మీర బువ్వంపు కూడు కుడిచి పొదలు తమితోడ వెనె్నల పులుగు లమ

05/16/2018 - 21:31

‘చివురుం తామరపాకులన్ సలలిత శ్రీఖండ పంకంబులన్/ అవనీహార జలాభిషేచనములన్ నాళీక పాళీ మృణా/ళ వితానంబుల వౌక్తిక గ్రధిత మాల్య శ్రేణులన్ బాల ప/ల్లవ తల్పంబుల శీతల క్రియలు చాలం చేసిరయ్యింతికిన్’ - పెద్దనాదులు దిద్దబెట్టిన ప్రాబంధిక ధోరణికి అన్ని విధాలా తగినట్లున్న ఈ పద్యం అద్దంకి గంగాధర కవి రాసిన ‘తపతీ సంవరణోపాఖ్యానం’లోనిది.

05/15/2018 - 21:18

‘ఎల్లరు మెచ్చని మత్కృతి నుల్లంబున మెచ్చుగాక ఒక దుష్టక్రులం/ బొల్లని పల్లవితామ్రము కొల్లలుగా పొగడనొక్క కోయిల లేదే?’ - నా కవిత్వాన్ని అందరూ మెచ్చకపోవచ్చు గానీ, దాన్నీ మెచ్చుకునే వాడొకడు ఉంటాడు. లొట్టిపిట్టలకు కిట్టని మావి చిగురు రుచిని వేనోళ్ల పొగిడే కోయిల పిట్ట ఉండదా?

05/14/2018 - 21:21

‘తమి పూతీగెల తూగు టుయ్యెలల పంతా లాడుచుం తూగునా/ కొమరుం ప్రాయపు గుబ్బి గుబ్బెతల అంఘ్రుల్ చక్కగా చాగి మిం/టి మొగంబై చనుదెంచు ఠీవి కనుగొంటే, దివ్య వౌనీంద్ర, నా/క మృగీ నేత్రల మీద కయ్యమునకుం కాలు తాచులా గొప్పెడున్’ - ‘కళాపూర్ణోదయం’ పేరెత్తగానే గుర్తుకొచ్చే పద్యమిది.

05/13/2018 - 21:51

‘కన కోర డొకనాడు కన్నుల పరవధూ లావణ్య, సౌభాగ్య లక్షణములు/ విన కోర డొకనాడు వీనుల కింపుగా కొలుచువారల మీది కొండెములను/ చిత్తంబు వెడలించి జిహ్వాగ్రమున కోరి పలుకడు కాఠిన్య భాషణములు/ తలప డించుక యైన ధనకాంక్ష యేనాడు బంధు మిత్రాశ్రీత ప్రతతి చెరుప/ సతత గాంభీర్య ధైర్య భూషణపరుండు - వార్త కెక్కిన రాజన్య వర్తనుండు/ సకల భూపాల జనసభా సన్నుతుండు - ధర్మ తాత్పర్య నిరతుండు దశరథుండు’ - ఈ పద్యం ఎవరి గురించి రాసిందో అంద

05/11/2018 - 21:50

‘స్వైర విహార ధీరలగు సారసలోచనలున్న చోటికిన్/ భోరున లాతివారు చొరబోయినచో రసభంగమంచు నే/ చేరక పువ్వు తీవియల చెంతనె నిల్చి లతాంగి రూపు క/ న్నారగ చూచి వచ్చితి నవాంబురుహాంబక నీకు తెల్పగాన్’ - ప్రసిద్ధమయిన ఈ పద్యం ‘వసుచరిత్ర’లోది. ఇందులోని ‘సారస లోచనలు’ - ‘రసభంగం’ అనే మాటల్ని ప్రయోగించడం ద్వారా కవి ఉద్దేశించిన చమత్కారం గురించి మనమందరం హైస్కూల్లో పాఠాలు చెప్పించుకున్న వాళ్లమే.

05/09/2018 - 22:02

‘నీలమేఘము డాలు ఈలు సేయగచాలు మెరుగు చామన చాయ మేనితోడ/ అరవిందముల కచ్చు లడగించు జిగి హెచ్చు నాయతంబగు కన్ను దోయి తోడ/ పులుగురాయని చట్టుపల వనె్న నొరబట్టు హోంబట్టు జిలుగు రెంటెంబు తోడ/ ఉదయార్క బింబంపు ఒరపు విడంబంబు దొరలంగ ఆడు కౌస్త్భుము తోడ/ తమ్మికేలుండ పెర కేల దండ ఇచ్చు లేము లుడిపెడు లేచూపు లేమ తోడ/ తొల్కు దయ తెల్పు చిరునవ్వు తోడ కల తదంధ్ర జలజాక్షు డిట్లని ఆనతిచ్చె’ - - నీలమేఘ కాంతిని తేలిపోయేలా చేస

05/08/2018 - 22:01

‘రాజుల్మత్తులు, వారి సేవ నరకప్రాయంబు; వారిచ్చు అం/్భజాక్షీ చతురంతయాన తురగీ భూషాదు లాత్మవ్యధా/ బీజంబుల్; తదపేక్ష చాలు, పరితృప్తింబొందితిన్; జ్ఞాన ల/క్ష్మీ జాగ్ర త్పరిణామ మిమ్ము దయతో శ్రీకాళహస్తీశ్వరా!’ - జీవితమంతా రాచకొలువుల్లో గడిపేసిన ఓ మహాకవి చేసుకున్న చిరు విన్నపమిది. రాజులు మదమెక్కిన వారట! వారి సేవ నరకప్రాయమయినదట!

05/07/2018 - 21:46

‘ఈసున పుట్టి డెందమున హెచ్చిన శోక దవానలంబుచే/ గాసిలి ఏడ్చె, ప్రాణవిభు కట్టెదుటన్ లలితాంగి పంకజ/ శ్రీసఖమైన మోముపయి చేలచెరంగిడి బాలపల్లవ/ గ్రాస కషాయ కంఠ కలకంఠ వధూకల కాకలీ ధ్వనిన్’ - అచ్చమయిన ప్రబంధ ఫక్కికి నిక్కమయిన నిదర్శనమీ పద్యం! సవతి మీద ఈర్ష్య పడ్డంతో మనసులో పుట్టి, చెలరేగిన దవానలం కారణంగా, భర్త సమక్షంలోనే మొహం మీద కొంగు కప్పుకుని గొల్లుమన్న ప్రబంధ నాయిక వైనం ఈ పద్యంలో చిత్రించాడు కవి.

Pages