S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెరటి చెట్టు

04/25/2018 - 21:21

భారతీయ సాహిత్యంలో నిర్వచనాలకు అతీతమనిపించే భావనలు చాలానే ఉన్నాయి. అందుకే, మన సాహిత్య విమర్శకులు తరచు ‘అనిర్వచనీయం’ అనే విశేషణం వాడుతుంటారు. ఈ అనిర్వచనీయత ఎక్కడయినా చెల్లుతుందేమో కానీ, సాహిత్య చరిత్రలో నడవదు! ఉదాహరణకు ‘శాస్త్రం’ ‘విజ్ఞానం’ వయిరా విషయాలను వేరువేరు సందర్భాల్లో వేర్వేరు అర్థాల్లో ప్రయోగించడం వల్ల వాటికంటూ నిర్దిష్టమయిన నిర్వచనం లేకుండా పోయింది.

04/24/2018 - 21:29

‘విష్ణు భక్తి లేని విద్వాంసుని కంటె, హరి కీర్తనము చేయు నతడే కులజుండు!/ శ్వపచుండైననేమి? ఏ వర్ణంబైన నేమి? ద్విజునికంటె నతడే కులజుండు!’ అని పదమూడు పధ్నాలుగు శతాబ్దాల్లోనే పాడిన ‘వచన’ కవి శ్రీమాన్ శ్రీకాంత శ్రీకృష్ణమాచార్యులు. ఈయనే్న సామాన్య జనం ‘కృష్ణమయ్య’గా పిల్చుకునేవారు. ఆనాటి వైష్ణవ కూటం కృష్ణమయ్యను సాక్షాత్తూ ఏకాదశావతారుడిగా పరిగణించి, పూజించిందట.

04/23/2018 - 21:49

ప్రపంచ సాహిత్యంలోనే ఎంతో అరుదయిన విషయం ఒకటి సంప్రదాయ తెలుగు సాహిత్య చరిత్రలో జరిగిందని విశేషంగా చెప్పుకుంటారు. మహాభారత అనువాద ప్రక్రియలో ఏర్పడిన కాలపరమయిన అగడ్తను కవితాత్మకంగా పూడ్చడమే ఈ అరుదయిన సంఘటన. పదకొండో శతాబ్దంలో, నన్నయ్య చేతిమీదుగా భారతానువాదం మొదలయిన సంగతి మనందరికీ తెలిసిందే. రెండున్నర పర్వాల తర్వాత, అది అర్థంతరంగా ఆగింది.

04/22/2018 - 22:06

‘పరివాదాస్పద వాదమోద మదిరా పానంబుచే మత్తులై/ హరిమేలంచు, హరుండు మేలనుచు నాహా కొందరీ పొందెరుం/ గరు కైలాస నగంబునందు మునులేకత్వంబు భావించి రా/ మురవైరిం బురవైరి బావుట మహా మోహంబు ద్రోహంబగున్’

04/20/2018 - 21:56

‘నవజాతాంబకు డేయు సాయకములన్ వర్జింపగా రాదు, నూ
తన బాల్యాధిక వనంబ మదికిన్ ధైర్యంబు రానీయ ద
త్యనురక్తిన్ మిముబోంట్లకున్ దెలువ నాహా! సిగ్గుమైకోదు, పా
వన వంశంబు స్వతంత్రమీయదు, చెలీ! వాంఛల్ తుదల్ముట్టునే’

04/19/2018 - 22:00

తిక్కనగారి తాతగారు - ‘సార కవితాభిరాముడ’నీ, ‘సాహిత్య విద్యాపారీణు’డనీ అనిపించుకున్న - భాస్కరమంత్రి. ‘మంత్రి భాస్కరు, మత్పితామహుని దలచియైన, మన్ననమెయి లోకమాదరించు’నని కవిబ్రహ్మ స్వయానా చెప్పడాన్నిబట్టి ఆయన పెద్దకవే అయి వుండాలనిపించడం సహజం. అంతటి వాడి స్థాయికి తగినట్లుగా ఆయన ఏదయినా గొప్ప కావ్యం రాసి వుంటే - కనీసం అనువదించి ఉంటే - నిజంగానే శోభించేది. కానీ మంత్రి భాస్కరుడు అలాంటిదే చేసినట్లు లేడు.

04/18/2018 - 21:14

తెలుగు భాషకి అత్యంత సహజమయిన ఛందస్సు ద్విపద. నన్నయ్యకన్నా పూర్వకాలంలో వేయించిన పొట్లదుర్తి - మాలెపాడు శాసనంలోనే ద్విపదగతి రగడ కనిపించిందని దేవరపల్లి వెంకట కృష్ణారెడ్డిగారి లాంటి పరిశోధకులు రాశారు.

04/17/2018 - 22:02

సంస్కృతంలో అష్టాదశ (అంటే 18) పురాణాలనూ కృష్ణద్వైపాయనుడనే వేదవ్యాసుడే రాశాడట. ఆ వ్యాసుడే సకల పురాణాల సారంగా సృజించిన పంచమ వేదం భారతాన్ని ఆరింట అయిదువంతులు అనువదించిన మహాకవి తిక్కన. ఆయన శిష్యుల్లో ప్రముఖులు ఇద్దరు. కేతన గురించి మనం ఇంతకు ముందు అనుకున్నాం. తిక్కన శిష్యుల్లో అద్వితీయుడయిన మారన గురించి ఇప్పుడు తలచుకుందాం. మారన తండ్రి పేరు, గురువు పేరు ఒక్కటే - తిక్కన!

04/16/2018 - 21:42

జీవికను వెతుక్కుంటూ నెల్లూరి సీమకొచ్చిన మూలఘటిక కేతన ఆ ప్రయత్నంలో ఏ మేరకు సఫలుడయ్యాడో యేమోగానీ, అద్భుత కథాకావ్య రచనకు హరిత కేతనమెత్తిన ఆద్యుడిగా ఆత్రం నిలిచిపోయాడు. వేంగినాడు ప్రాంతంలోని వెంటిరాల గ్రామానికి చెందిన కేతన, వెల్నాటి చోడుల పతనానంతరం, నెల్లూరికి తరలివెళ్లాడన్నది ఆయనే చెప్పిన వివరం. చదువుకున్న వాళ్లు వేంగి నుంచి ఇలా తరలి వెళ్లడం పదమూడో శతాబ్దం మొదట్లో మొదలయిందని ఒక అంచనా.

04/15/2018 - 22:11

‘వసుమతీనాథ, ఈతడీశ్వరుడుగాని, మనుజమాత్రుండు కాడు - పల్మారు నితని, అనుమతంబున నీవు రాజ్యంబు నెమ్మి నేలుము’- ఇది, శివదేవయ్య గురించి, తిక్కన గణపతి దేవుడితో అన్నమాట. అలాగని ‘సోమరాజీయం’ చెప్తోంది.

Pages